Jump to content

సుజాతనగర్ మండలం

వికీపీడియా నుండి
సజాతనగర్
  మండలం  
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, సజాతనగర్ స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, సజాతనగర్ స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, సజాతనగర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం సుజాతనగర్
గ్రామాలు 6
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 106 km² (40.9 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 26,919
 - పురుషులు 13,603
 - స్త్రీలు 13,316.
పిన్‌కోడ్ {{{pincode}}}

సుజాతనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 6 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  6  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం సుజాతనగర్.

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 106 చ.కి.మీ. కాగా, జనాభా 26,919. జనాభాలో పురుషులు 13,603 కాగా, స్త్రీల సంఖ్య 13,316. మండలంలో 7,056 గృహాలున్నాయి.[4]

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.

[మార్చు]

గతంలో సుజాతనగర్ గ్రామం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సుజాతనగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+5 (ఆరు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సుజాతనగర్
  2. గరీబ్ పేట
  3. సర్వారం
  4. సీతంపేట
  5. రాఘవపురం
  6. సింగభూపాలెం

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-20 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  3. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-20 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2017-08-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-04-07.

వెలుపలి లంకెలు

[మార్చు]