Jump to content

వరరామచంద్రపురం

వికీపీడియా నుండి

వరరామచంద్రపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లా, వరరామచంద్రపురం మండల లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది వరరామచంద్రపురం మండల కేంద్రం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం గజెట్ ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను తూర్పు గోదావరి జిల్లాల్లోని రంపచోడవరం నియోజకవర్గంలో కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు.

అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని ఎటపాక, కూనవరం, చింతూరు వరరామచంద్రపురం, మండలాలతోపాటు ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[1]

అనంతరం వైసీపీ ప్రభుత్వంలో పరిపాలనా సౌలభ్యం కొరకు అని ఈ మండలాలతో కలిసి ఉన్న రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడం జరిగింది. పరిపాలన సౌలభ్యం అని చెప్పి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో కలిపారు. జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు 170 కిలోమీటర్లు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు కాకినాడ వెళ్లాలంటే 220 కిలోమీటర్లు ఉండేది. ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో చేర్చారు.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

[మార్చు]
కుంజా సత్యవతి: మాజీ శాసన సభ్యురాలు
  • కుంజా సత్యవతి: ఈమె శూలం కృష్ణ, సీతమ్మ దంపతులకు వరరామచంద్రపురంలో 1971, ఆగస్టు 1న జన్మించింది.మాజీ శాసన సభ్యురాలు. సీపీఎం పార్టీ ద్వారా ఆమె రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. 1991లో భద్రాచలం ఎంపిపిగా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా భారత జాతీయ కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికయింది. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది. అనంతరం, భారతీయ జనతా పార్టీలో చేరింది.

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు ఎక్స్‌ప్రెస్ నుండి". Archived from the original on 2021-12-26. Retrieved 2014-09-13.

వెలుపలి లింకులు

[మార్చు]