కుంజా సత్యవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంజా సత్యవతి
కుంజా సత్యవతి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం భద్రాచలం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 1, 1971
వరరామచంద్రపురం, భద్రాచలం మండలం, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కుంజా ధర్మారావు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

కుంజా సత్యవతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జాతీయ కాంగ్రెస్ తరపున భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

సత్యవతి 1971, ఆగస్టు 1న శూలం కృష్ణ, సీతమ్మ దంపతులకు భద్రాచలం మండలం లోని వరరామచంద్రపురం లో జన్మించింది. 10వ తరగతి వరకు చదువుకుంది.

వివాహం - పిల్లలు[మార్చు]

1988, ఆగస్టు 8న కుంజా ధర్మారావుతో సత్యవతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (సంతోష్ కుమార్, విశ్వశాంతి)

రాజకీయరంగ ప్రస్థానం[మార్చు]

1991లో భద్రాచలం ఎంపిపిగా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా ఎన్నికయింది. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ... ఎస్టీ కమిటీ... ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది.

మూలాలు[మార్చు]

  1. సాక్షి ఎడ్యువేషన్. "ఆరంభంలోనే అంతరాయం". www.sakshieducation.com. Retrieved 15 May 2017.

ఇతర లంకెలు[మార్చు]