రంపచోడవరం
పట్టణం | |
![]() | |
నిర్దేశాంకాలు: 17°26′20″N 81°46′37″E / 17.439°N 81.777°ECoordinates: 17°26′20″N 81°46′37″E / 17.439°N 81.777°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా |
మండలం | రంపచోడవరం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 4.99 కి.మీ2 (1.93 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 9,952 |
• సాంద్రత | 2,000/కి.మీ2 (5,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 899 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 8864 ![]() |
పిన్(PIN) | 533288 ![]() |
జాలస్థలి | ![]() |
రంపచోడవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక జనగణన పట్టణం. ఇది రంపచోడవరం రెవెన్యూ డివిజన్లోని, రంపపచోడవరం మండలంలో ఉంది.ఇది రంపచోడవరం మండలానికి,రంపచోడవరం శాసనసభ నియోజకవర్గానికి కేంద్రస్థానం.
రంపచోడవరం దట్టమైన అడవి ప్రాంతానికి, జలపాతాలకు ప్రసిద్ది చెందింది, వీటిని రహదారి రవాణా ద్వారా మాత్రమే చేరుకోవటానికి అవకాశం ఉంది.[2] రంపచోడవరంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు.వారి ఉన్నతి కొరకు ప్రభుత్వం ఐ.టి.డి.ఏ. సంస్థను ప్రభుత్వం నెలకొల్పింది. గిరిజనుల సంస్కృతి,జీవన విధానం గురించిన మ్యూజియం శక్తి సంస్థ సహకారంతో ఏర్పాటు చేయబడుతోంది.
రంప అనే గ్రామం ప్రక్కగా ప్రవహించే వాగు పక్కనే ఈ ఊరు ఉంది.రంప అనే గ్రామం రెవెన్యూ లెక్కలలో మరో గ్రామంగా ఇప్పటికీ ఉంది.అయితే రంప గ్రామం, చోడవరం కలిపి రంపచోడవరం అయిందని తెలుస్తుంది.ఇక్కడ కొండమీద ఒక పురాతన శివాలయం ఉంది.
అల్లూరి సీతారామరాజు ఆ ఆలయంలో పూజ చేసుకునేవాడని తెలుస్తుంది. అక్కడ ఒక జలపాతం కూడ ఉంది. సంవత్సరం పొడుగునా ఈ జలపాతంలో నీరు ప్రవహిస్తుంటాయి.
జనాభా[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రాంపచోడవరం 2,485 గృహాలతో, 9,952 జనాభాను కలిగి ఉంది. మొత్తం జనాభాలో 5,242 మంది పురుషులు కాగా, 4,710 మంది స్త్రీలు ఉన్నారు.ప్రతి 1000 మంది పురుషులకు 899 మంది స్త్రీలు సెక్స్ నిష్పత్తిగా కలిగి ఉంది. 943 మంది పిల్లలు 0–6 సంవత్సరాల వయస్సు మధ్యగల పిల్లలు 943 మంది ఉన్నారు, వీరిలో 458 మంది బాలురు కాగా, 485 మంది బాలికలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 7,613 మంది అక్షరాస్యులతో 84.50% వద్ద ఉంది. ఇది రాష్ట్ర సగటు కంటే 67.41% ఎక్కువ గణనీయంగా ఉంది. [3]
భౌగోళికం[మార్చు]
రంపచోడవరం 17.4500 ° N 81.7667 ° E. వద్ద ఉంది.సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 162 మీటర్లు (534 అడుగులు).[4]
రవాణా సదుపాయాలు[మార్చు]
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2814_PART_B_DCHB_EAST%20GODAVARI.pdf
- ↑ "Rampachodavaram Population, Caste Data East Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-01.
- ↑ "Maps, Weather, and Airports for Chodavaram, India". www.fallingrain.com. Retrieved 2020-07-01.