వేపరాల (మైలవరం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేపరాల
—  జనగణన పట్టణం  —
వేపరాల is located in Andhra Pradesh
వేపరాల
వేపరాల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°30′47″N 78°12′19″E / 14.5131°N 78.2053°E / 14.5131; 78.2053
దేశం  భారతదేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం మైలవరం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,712
 - పురుషులు 3,308
 - స్త్రీలు 3,404
 - గృహాల సంఖ్య 1,873
పిన్ కోడ్ 516431
ఎస్.టి.డి కోడ్ 08560

వేపరాల, వైఎస్‌ఆర్ జిల్లా, మైలవరం మండలానికి చెందిన జనగణన పట్టణం గ్రామం.[1]

గణాంకాలు[మార్చు]

వేపరాల అనేది వైఎస్ఆర్ జిల్లా, మైలవరం మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, వేపరాల నగరంలో మొత్తం 1,873 కుటుంబాలు నివసిస్తున్నాయి. వేపరాల మొత్తం జనాభా 6,712 అందులో పురుషులు 3,308 మంది కాగా, స్త్రీలు 3,404 మంది ఉన్నారు.[2] సగటు లింగ నిష్పత్తి 1,029. వేపరాల పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 660, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 354 మంది మగ పిల్లలు, 306 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం వేపరాల పిల్లల లింగ నిష్పత్తి 864, ఇది సగటు లింగ నిష్పత్తి (1,029) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 62.9%. ఆ విధంగా వైఎస్ఆర్ జిల్లాలో 67.3%తో పోలిస్తే వేపరాల అక్షరాస్యత తక్కువగా ఉంది. వేపరాలలో పురుషుల అక్షరాస్యత రేటు 77.18% మరియు స్త్రీల అక్షరాస్యత రేటు 49.23%.

చరిత్ర[మార్చు]

పెన్నానది సమీపాన, రాయలసీమ లోనే అతిపెద్ద చేనేత వస్త్రబరనాలకు పట్టుకొమ్మ, ఎప్పుడు పచ్చగా కళకళ లాడుతుండే మా ప్రాంత జనాభా దాదాపు 6000 పై చిలుకే, మైలవరం మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయితీగా పేరుగాంచిన ఈ ప్రాంత ప్రజలకు చేనేత ప్రార్థన వృత్తి, మా గ్రామానికి ఒక ఉన్నత పాఠశాల, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కలదు, బ్రిటిష్ వారి కాలం నుంచి తనకంటూ ఓ ప్రాధాన్యత వున్నా, గంగన పల్లె కొండారెడ్డి అనే వ్యక్తీ వలన మరింత కీర్తిని అర్జించింది, ఈ గ్రామానికి కరెంట్ సదుపాయాన్ని కలిగించడంలో అతని విశేష పాత్ర ఉందంటారు, ఇక పొతే వ్యవసాయం ఒక విధంగా ఇది రెండో అతిపెద్ద ప్రధాన వృత్తి. ఈ ప్రాంత ప్రజలకి సర్వమత సమ్మేళనానికి ఆదర్శంగా అన్ని హిందూ దేవాలయాలు, ముస్లిం పీర్ల చావిడి, క్రైస్తవుల చర్చి ఒకే చోట వుండటం విశేషం

భౌగోళికం[మార్చు]

హద్దులు:

 • తూర్పున దొమ్మరనంద్యాల గ్రామం,, పడమర మైలవరం, ఉత్తరాన జలాశయం.

విద్య[మార్చు]

పదవతరగతి వరకు విద్యాబ్యాసం కలిగినా పై చదువుల కోసం వేరే ప్రాంతాన్ని అశ్రయించవలసిందే. ఈ గ్రామంలో చదివి వున్నత స్థానంలో వున్నా అనేక ప్రతిభావంతులు, తమవంతు బాధ్యతగా తమ సహాయాన్ని అందిస్తూనే అనేక కార్యక్రమాలు చేపట్టారు, ఇదే ఈ ప్రాంత ఆదర్శానికి మచ్చుతునక. ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివిన 1988-89 బ్యాచ్ విద్యార్థులు, 2013 డిసెంబరు 14న, రజతోత్సవాలు జరుపుకుని, తమకు విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థుల చేయూతతో పాఠశాల మైదానంలో నిర్మించిన సభాస్థలిని ఈ సందర్భంగా ప్రారంభించారు.[3]

గ్రామ రాజకీయాలు[మార్చు]

భౌగోళికంగా ఈ ప్రాంతం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల హద్దుగా వుంటుంది, రాజకీయ ఈ ప్రాంతం జమ్మలమడుగు నియోజక వర్గం కింద క్రియాశీలకంగా కలదు, లోక్‌సభ ప్రతిపదికలో కడప స్థానం కిందికి వస్తుంది.ప్రస్తుతం ఈ ప్రాంత ప్రెసిడెంటుగా కరుమూరి నరసింహులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు [4]

ఉత్సవాలు, కార్యక్రమాలు[మార్చు]

ఆద్యాత్మికం[మార్చు]

 • వేపరాల గ్రామంలోని శ్రీ భవానీ శంకరస్వామివారి ఆలయంలోని పార్వతీ, పరమేశ్వరుల పంచలోహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని, 2014,మార్చి-10, సోమవారం నాడు, ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా, ఆలయ ఆవరణలో కలశాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు హోమం, చలప్రతిష్ఠ చేశారు. నూతన విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
 • ఈ ప్రాంతంలో ఎక్కువగా తొగట వీర క్షత్రియులుండటం వలన ఏట చౌడేశ్వరి దేవి ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రాంత ప్రజలు జ్యోతి వుత్సవం అను ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, ప్రధానంగా ఈ ఉత్సవాన్ని తిలకించడానికి చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు చాల మంది తరలి వస్తుంటారు.

జ్యోతి నృత్యం

 • జానపద నృత్యాల్లో ఇది కూడా వ్యష్టి నృత్యమే. కానీ ఇది కులపరమైంది. కేవలం తొగట వీర క్షత్రియులు జ్యోతి నృత్యం చేస్తారు. చేనేత తెగకు సంబంధించిన తొగటవీర క్షత్రియులు చౌడెశ్వరీదేవిని ఆరాధిస్తూ ఈ నృత్యం చేస్తారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా నందవరంలో వెలసిన చౌడెశ్వరీదేవి వీరి ఆరాధ్య దైవం.
 • చౌడమ్మ గురించి అనేక కథలున్నాయి. ఈమె ఓంకార బిందు స్వరూపిణి. రాక్షస సం హారానికి పుష్పండజుడు అనే రాజుకు చౌడెశ్వరిగ జన్మించి 360 మంది వీర క్షత్రియులను హోమం నుండి సృష్టించింది. వీరే తొగట వీర క్షత్రియులు. వీరు ఈమెను గురించి పద్య, గద్య, ఖడ్గ రూపంలో స్తుతిస్తారు.

జ్యోతి తయారు చేయడం[మార్చు]

 • జ్యోతి చేయడానికి ముందు రతి వేస్తారు. రతి అంటే ముగ్గు వేయడం. తరువాత గోధుమ పిండి, బెల్లం కలిపి ముద్ద చేసి 2 మీటర్ల పంచె జ్యోతిగ చేస్తారు. ఆ జ్యోతిని నెయ్యిలో తడుపుతారు. ముద్దలో జ్యోతిని ఉంచి చుట్టు అలంకరణ చేస్తారు. జ్యోతి నెత్తి మీద ఉంచుకొని చౌడెశ్వరిని గురించి భక్తి పూర్వకంగ పాటలు పాడుతు రాత్రి అంతా ఉరేగుతారు.
 • వేషధారణ - జ్యోతిని ఎత్తుకొనేవాళ్ళు నడుముకు యెర్రటి గుడ్డ చుట్టుకొని ఉంటారు. పంచె చుట్టుకొని ఉంటారు. పైన అంగీ ఉండదు. మెడలో హారాలు వేసుకొంటారు. తాళాలు, డప్పు, కంజీర వాద్యాలు వాయిస్తారు.
 • జ్యోతి నృత్యం- ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన ఉంటుంది. తరువాత అమ్మవారిని గురించి పాటలు పాడతారు.
 • జ్యోతులను సుమారు రాత్రి 1 గంట ప్రాంతంలో యెత్తుతారు. రాత్రంతా తిరిగి అమ్మవారిని ఊరేగించి చివరకు అమ్మవారికి బలులు ఇస్తారు.అమ్మవారిని ఊరేగించటాన్ని "మెరవణి" అంటారు.

ఖడ్గాలు[మార్చు]

 • చౌడేశ్వరి దేవి షక్తిని కీర్తించే పద్యాలనే ఖడ్గాలు అంటారు. ఖడ్గాలు చెప్పడం చాలా బాగుంటుంది. మధ్యలో పదాలు ఆగినప్పుడల్ల పక్కనున్నవారు భళి, భళి అంటుంటారు.

మూలాలు[మార్చు]

 1. "Villages and Towns in Mylavaram Mandal of YSR, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-10-05.
 2. "Veparala Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-10-05.
 3. ఈనాడు కడప/జమ్మలమడుగు, 2013,డిసెంబరు 15. 2వపేజీ.
 4. ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,మార్చ్-11; 1వ పేజీ.

వెలుపలి లంకెలు[మార్చు]