జమ్మలమడుగు
జమ్మలమడుగు కడప జిల్లాలోని పట్టణం [1]
విషయ సూచిక
పట్టణము చరిత్ర[మార్చు]
ఈ ప్రాంతాన్ని పూర్వం ములికినాడు అని పిలిచేవారు.[2] సుప్రసిద్ధమైన గండికోట ఈ మండలములోనే ఉంది.
పట్టణము పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ అసలు నామము జంబుల మడక (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలమునకు రూపాంతరము చెంది జమ్మలమడుగుగా మారినది.
పట్టణ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామము కన్నెలురు గ్రామము
సమీప మండలాలు[మార్చు]
పట్టణానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పట్టణములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి డిపో ఉంది. ఇది రెవెన్యూ డివిజన్. జమ్మలమడుగులో రైల్వే స్టేషను కట్టారు.
పట్టణములో విద్యా సౌకర్యాలు[మార్చు]
కళాశాలలు[మార్చు]
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల.
పాఠశాలలు[మార్చు]
- పతంగే రామన్న శతాబ్ది ఉన్నత పాఠశాల ( పి.ఆర్.శతాబ్ది ఉన్నత పాఠశాల):- ఇటీవలే, ఈ పాఠశాల శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ఏడేళ్ళుగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించుచున్నది. పైసా ఖర్చులేకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించుచూ, మద్యాహ్న భోజనం పెడుతూ, మంచి విద్యను అందించుచున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు, చదువులతోపాటు విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయిలలో క్రీడాకారులుగా తీర్చిదిద్దుచున్నారు. వీరికి ఎన్.సి.సి.లో గూడా మంచి శిక్షణ ఇచ్చుచున్నారు. దీనితో తల్లిదండ్రులలో గూడా నమ్మకం ఏర్పడి, తమ పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్పించుచున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ ఏకమై, విరాళాలు వేసుకొని తరగతి గదులను మరమ్మత్తు చేయించారు. పూర్తిగా దెబ్బతిన్న క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దినారు. మిగిలిన పది లక్షల రూపాయలను, పాఠశాల బ్యాంకు ఖాతాలో జమచేసారు.[3]
- ప్రభుత్వ బాలికల పాఠశాల
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
- రేడియన్స్ ఉన్నత పాఠశాల
- సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాల
- ప్రభుత్వ బాలుర పాఠశాల
- బాలాజీ ఉన్నత పాఠశాల
- శ్రీ దయానంద ఉన్నత పాఠశాల
- క్రీసెంట్ పాఠశాల
- లిటిల్ రోజస్ ఉన్నత పాఠశాల
- సైలాస్ పాఠశాల
- శ్రీ పద్మావతీ ఉన్నత పాఠశాల
- యల్.యమ్.సి బాలికల ఉన్నత పాఠశాల
- శ్రీ రాఘవేంద్ర ఉన్నత పాఠశాల
- శ్రీ సాయిబాబ ఉన్నత పాఠశాల
- టి.కె.ఆర్ ఉన్నత పాఠశాల
- నారాయణ ఉన్నత పాఠశాల
- జాన్స్ ఉన్నత పాఠశాల
- ఈడిగ పేట ఉన్నత పాఠశాల
పట్టణంలోని మౌలిక వసతులు[మార్చు]
బ్యాంకులు[మార్చు]
అన్నశాలలు[మార్చు]
- గుడ్ బాయ్ అన్నశాల
- తాజ్మహల్ మిలిటరీ భోజనశాల
- గణేష్ భోజనశాల
- నవయుగ హోటల్
- హోటల్ జయశ్రీ
- శ్రీ గురువాయర్ అప్పన్ కేఫ్
చలనచిత్ర ప్రదర్శన శాలలు[మార్చు]
- అలంకార్ (ఇప్పుడు ఫంక్షన్ హాల్ గా మారింది)
- టి.ఎన్.ఆర్
- టి.పీ.ఆర్
- సాయిరాం
- ధనలక్ష్మి (చాలా కాలం నుండి మూత పడింది)
వీధులు[మార్చు]
- దిగువపట్నం కాలనీ
- యస్.పి.జి క్వార్టర్స్
- కాపువీధి
- ట్యాంక్ వీధి
- బెల్లాల వీధి
- గూడుమస్తాన్ వీధి
- అంభాభవాని దేవాలయం వీధి
- భ్యాగ్యనగర్ కాలనీ
- శ్రీరామ్ నగర్
- డొంకవీధి
- చెన్నబసప్పవీధి
- టెక్కాయచేను
పట్టణానికి త్రాగునీటి సౌకర్యాలు[మార్చు]
పట్టణ పరిపాలన[మార్చు]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము:- ఈ పట్టణంలో శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర దేవాలయము ఉంది. నారాపురుడనే భక్తుడు నిర్మించిన దేవాలయము కనుక దీనిలో స్వామిని నారాపుర వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. ఉత్తర దిశగా నిర్మించిన ఈ ఆలయం ఇసుక తిన్నెలలో అందంగా కనిపిస్తుంటుంది.
- శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము:- ఈ ఆలయం 1914 లో నిర్మితమైనది. ఈ ఆలయ శతాబ్ది ఉత్సవాలు, 2014,జూన్-4 నుండి 9 వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా 2014,జూన్-5, గురువారం నాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మీ అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం చండీహోమం, నవగ్రహ జపాలు, మద్యాహ్నం మంత్రపుష్పం, సాయంత్రం సాయందీక్షాహోమం, సూక్తపారాయణం నిర్వహించారు. 8వ తేదీన, హంపీ పీఠాధిపతులు, విరూపాక్ష, విద్యారణ సంస్థానాధీశులు, విద్యారణ్యభారతి స్వామీజీ సమక్షంలో మహా కుంభాభిషేకం నిర్వహించెదరు.[4]
- శ్రీ అంబా భవాని దేవాలయము.
అంభాభవానీ దేవాలయం పట్టణంలో ప్రసిధ్ధి పొందిన దేవాలయం. జమ్మలమడుగు పట్టణ భావసార క్షత్రియుల ఇలవేలుపు గా ఎన్నో సంవత్సరాల నుండి పూజలు అందుకుంటూ కాపాడుతూ ఉంది.
- శ్రీ గణపతి దేవాలయం
పట్టణంలో గల ఏకైక గణపతి దేవాలయం. ఈ ఆలయం పెన్నా నదిలో మొక్కల నర్సరీ కి సమీపాన ఉంది. గణపతి కి ప్రత్యేకమైన ఆలయం జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కడా లేదు. ఈ ఆలయ పరిసరాలలో లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శివాలయం, 15 అడుగుల ఎత్తులో శివలింగం ఉన్నాయి. ఇక్కడ మహిమాన్వితమైన అశ్వర్థ నాలాయణ వృక్షం, ఉసిరి చెట్టు, శివునికి ప్రీతి పాత్రమైన బిల్వ వృక్షం, తెల్ల జిల్లేడు , మామిడి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు చాలా ఉన్నాయి. అందరూ తప్పక దర్శించండి.
ప్రముఖులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. p. 65. Retrieved 2 July 2018.
- ↑ ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,మే-22; 5వ పేజీ.
- ↑ ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-3, 1వ పేజీ.