అట్లూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అట్లూరు
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో అట్లూరు మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో అట్లూరు మండలం యొక్క స్థానము
అట్లూరు is located in ఆంధ్ర ప్రదేశ్
అట్లూరు
ఆంధ్రప్రదేశ్ పటములో అట్లూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°33′30″N 79°3′17″E / 14.55833°N 79.05472°E / 14.55833; 79.05472
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము అట్లూరు
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 24,339
 - పురుషులు 12,298
 - స్త్రీలు 12,041
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.83%
 - పురుషులు 70.23%
 - స్త్రీలు 36.46%
పిన్ కోడ్ {{{pincode}}}

అట్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.[1]

పేరు వెనుక చరిత్ర[మార్చు]

మనం ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెందని రోజులవి! నిప్పును కనుక్కున్న మనిషి ఆహారాన్ని వండుకుని తినడం ప్రారంభించాడు. పచ్చి మాంసం, కూరగాయల్ని తినేసే మనిషి` వాటిని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకు తినడం అలవాటు చేసుకున్నాడు. కూరలు, వేపుళ్ళు అప్పుడు లేనేలేవన్నమాట! అటువంటి రోజుల్లో ఓ మనిషి తన ఇంట్లోంచి బయటకి రావడం అందర్నీ ఆకర్షించింది. ఎందుకంటే` అతని చేతిలో జింక చర్మం... ఆ చర్మం మీద ఎర్రెర్రగా కాలి, సువాసనలు వెదజల్లుతున్న వేడి వేడి అట్టు ఉంది. ఆ అట్టు చూసేవారికి అందరికీ నోరూరి పోతోంది. అందరూ అతని చుట్టూ గుమిగూడారు. ఎలా చేశావని అడిగారు. నిప్పుమీద పలకగా ఉన్న రాయిని పెట్టి ఆ వేడి సెగలో పిండి పదార్ధాన్ని పోసి అట్టుగా మార్చాడట! ఆ విధానం అందరికీ నచ్చేసింది. అలా అలా ప్రచారం జరిగి... చివరికీ ప్రాంతం అట్టు ఊరుగా... అట్టులూరుగా... అట్లూరుగా పిలవబడుతోంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 24,339 - పురుషులు 12,298 - స్త్రీలు 12,041

మూలాలు[మార్చు]

గ్రామాలు[మార్చు]


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=అట్లూరు&oldid=2022908" నుండి వెలికితీశారు