ముద్దనూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముద్దనూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా లోని జనగణన పట్టణం. పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.[1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [2] & [3]
  2. శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం:- స్థానిక ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఇటీవల కూల్చివేసినారు. రు. 21 లక్షల దేవాదాయశాఖ నిధులతో నూతనంగా చేపడుచున్న ఆలయ నిర్మాణానికి, 2014, జూలై -12, శనివారం, గురుపౌర్ణమి నాడు, భూమిపూజ చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టినారు. [4]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-04. Cite web requires |website= (help)

[1] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,మే-26; 2వ పేజీ. [2] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-6, 1వ పేజీ. [3] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-8, 1వ పేజీ. [4] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014, జూలై-13, 1వ పేజీ.