బద్వేలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బద్వేలు
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో బద్వేలు మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో బద్వేలు మండలం యొక్క స్థానము
బద్వేలు is located in Andhra Pradesh
బద్వేలు
ఆంధ్రప్రదేశ్ పటములో బద్వేలు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°45′N 79°03′E / 14.75°N 79.05°E / 14.75; 79.05
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము బద్వేలు
గ్రామాలు 22/area_total=
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 46,392
 - పురుషులు 23,343
 - స్త్రీలు 23,049
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.19%
 - పురుషులు 75.92%
 - స్త్రీలు 48.45%
పిన్ కోడ్ {{{pincode}}}

బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. [1]

గ్రామములో రాజకీయాggrtyiopnలు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

చరిత్ర[మార్చు]

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.

దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,జూన్-4న నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంకోసం, తిరుపతి నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల విగ్రహాలను తెప్పించారు. భద్రాచలం నుండి ధ్వజస్తంభం తెప్పించారు. నాలుగు ఎకరాల స్థలంలో,దాతల సహకారంతో, రు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో, ఈ ఆలయాన్ని నిర్మించారు. వినాయకుడు, వరాహస్వామివార్ల ఆలయాలు గూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆలయం బద్వేలు పట్టణానికి తలమానికం కాగలదని భక్తుల విశ్వాసం. [1]

పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల బ్రహ్మంగారిమఠంలో సమాధి చెందారు.

ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి మొల్ల పేరుమీద మొల్ల సాహితీ పీఠం ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

వ్యవసాయం[మార్చు]

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. వరి, కాయగూరలు ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు బ్రహ్మంసాగర్కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

గ్రామాలు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014,మే-30; 6 వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=బద్వేలు&oldid=1998586" నుండి వెలికితీశారు