యర్రగుంట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


యర్రగుంట్ల
రెవిన్యూ గ్రామం
యర్రగుంట్ల is located in Andhra Pradesh
యర్రగుంట్ల
యర్రగుంట్ల
నిర్దేశాంకాలు: 14°36′N 78°30′E / 14.6°N 78.5°E / 14.6; 78.5Coordinates: 14°36′N 78°30′E / 14.6°N 78.5°E / 14.6; 78.5 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండలంయర్రగుంట్ల
విస్తీర్ణం
 • మొత్తం5.32 కి.మీ2 (2.05 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం32,574
 • సాంద్రత6,100/కి.మీ2 (16,000/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (8519 Edit this at Wikidata)
పిన్(PIN)516309 Edit this at Wikidata

యర్రగుంట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1].ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి చెందింది.యర్రగుంట పట్టణం,కడప లోకసబ లోకసభ నియోజకవర్గంలోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది జమ్మలమడుగు రెవెన్యూ డివిజను పరిధికి చెందిన పట్టణం.ఇది యర్రగుంట్ల పురపాలకసంఘం ప్రధాన కేంద్రం.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం యర్రగుంట్ల పట్టణ పరిధిలో మొత్తం 7,957 కుటుంబాలు నివసిస్తున్నాయి. యెర్రగుంట్ల మొత్తం జనాభా 32,574, అందులో 16,558 మంది పురుషులు కాగా,16,016 మంది మహిళలు ఉన్నారు.యెర్రగుంట్ల సగటు సెక్స్ నిష్పత్తి 967.[2]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3754 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 12% గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 1963 మగ పిల్లలు కాగా, 1791 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం యెర్రగుంట్లా చైల్డ్ సెక్స్ నిష్పత్తి 912 గా ఉంది. ఇది సగటు సెక్స్ నిష్పత్తి (967) కన్నా తక్కువ.

2011 జనాభా లెక్కల ప్రకారం, యెర్రగుంట్ల అక్షరాస్యత రేటు 70.6% గా ఉంది. వైయస్ఆర్ జిల్లా అక్షరాస్యత 67.3% తో పోల్చగా, యెర్రగుంట్ల అక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 80.19% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 60.67% గా ఉంది.[2]

రవాణా సౌకర్యం[మార్చు]

యర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషను, నంద్యాల - యర్రగుంట్ల విభాగానికి, గుంతకల్లు - చెన్నై ఎగ్మోర్ విభాగానికి ఒక జంక్షన్. ఇది గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. డివిజన్‌లోని 'డి'-కేటగిరీ ఉన్న స్టేషన్‌లో ఇది ఒకటి.[3]

పట్టణ సమీపంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు[మార్చు]

  • ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
  • ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
  • జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంట్ గ్రూప్)
  • భారతీ సిమెంట్స్ కూడా ఉంది.

ప్రత్యేకం[మార్చు]

ఇది కాక నాప రాయి పరిశ్రమకు ప్రసిద్ధి.ఒక థర్మల్ పవర్ స్టేషను కూడా ఉంది.

ప్రధాన వృత్తి[మార్చు]

ఇక్కడ వ్యవసాయం మెట్ట వ్యవసాయం

మూలాలు[మార్చు]

  1. "List of Sub-Districts". Census of India. Retrieved 2007-05-22.
  2. 2.0 2.1 "Yerraguntla Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-30.
  3. https://www.thehindu.com/news/cities/Vijayawada/Nandyal-Yerranguntla-rail-line-commissioned/article14586839.ece

బయటి లింకులు[మార్చు]