యర్రగుంట్ల నగరపంచాయితీ
యర్రగుంట్ల | |
స్థాపన | 2012 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
యర్రగుంట్ల నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2012 లో ఏర్పడింది. ఈ నగరపంచాయితీలో 4 మండలాలు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 470 కి.మీ దూరంలోనూ జిల్లా ప్రధాన కేంద్రం 35 కి.మీ. దూరంలో ఉంది.యర్రగుంట నగర పంచాయతీ, కడప లోక్‌సభ నియోజకవర్గంలోని, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం కిందకు చెందిన భాగం.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]2001 లో 26752 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 32574 కు పెరిగింది. గత దశాబ్దంలో 82% పెరిగింది. లింగ నిష్పత్తి 1000 మగవారికి 976 మహిళలు. అక్షరాస్యత రేటు 70% ఉండగా పురుష జనాభాలో 75%, స్త్రీ జనాభాలో 55% అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీలో 10520 గృహాలు ఉన్నాయి.[2]
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్తుత చైర్‌పర్సన్‌గా హెచ్.ముసలయ్య, [3] వైస్ చైర్మన్‌గా సుభాష్ రెడ్డి కొనసాగుచున్నారు.[3]
సమీప కర్మాగారాలు
[మార్చు]- ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
- ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
- జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంట్ గ్రూప్)
- భారతీ సిమెంట్స్ కూడా ఉంది.
ఇతర వివరాలు
[మార్చు]ఈ నగర పంచాయతీలో 7 రెవెన్యూ వార్డులు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి. 33 మురికివాడలు ఉండగా మురికివాడలో 24541 జనాభా ఉన్నారు.10 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-08-09.
- ↑ "Yerraguntla Population, Caste Data YSR Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-25. Retrieved 2020-08-09.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.