నరసాపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసాపురం పురపాలక సంఘం
నరసాపురం
నరసాపురం పురపాలక సంఘం
స్థాపన1956
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నరసాపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసాపురం పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, నర్సాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

చరిత్ర

[మార్చు]

నరసాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 219 కి.మీ దూరంలో ఉంది.1956 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.తరువాత దీనిని 1965 వ సంవత్సరంలో 2 వ గ్రేడ్ పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. 2001 సంవత్సరంలో 1 వ గ్రేడ్ మునిసిపాలిటీగా మార్చబడింది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 58,770, జనాభా ఉండగా అందులో పురుషులు 28,796, మహిళలు 29,974 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 89.54%, ఉండగా స్త్రీ జనాభాలో 83.10% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5121 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 15,683 గృహాలు ఉన్నాయి.[1][2]

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా పసుపులేటి రత్నమాల, వైస్ చైర్మన్‌గా పి.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.[3]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 11.74 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.15 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో మురికివాడల సంఖ్య 48 ఉండగా అందులో జనాభా 35805 ఉన్నారు.పురపాలక సంఘం పరిధిలో కూరగాయల మార్కెట్ ఒకటి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Narasapur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-05.
  2. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]