Jump to content

గొల్లప్రోలు నగరపంచాయితీ

గొల్లప్రోలు నగరపంచాయితీ
గొల్లప్రోలు
స్థాపన2021
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

గొల్లప్రోలు నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, గొల్లప్రోలు పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ నగర పంచాయతీ కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని, పిఠాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగర పంచాయతీ.

చరిత్ర

[మార్చు]

ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులతో ఏర్పాటు చేశారు.ఇది సమీప పట్టణమైన కాకినాడ నుండి 22 కి.మీ. దూరంలో ఉంది.[1]

భౌగోళికం

[మార్చు]

ఈ నగరపంచాయితీ 17°10′02″N 82°17′05″E / 17.1672°N 82.2847°E / 17.1672; 82.2847 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన కాకినాడ నుండి 22 కి. మీ. దూరంలోను, అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, రాష్ట్ర రాజధాని అమరావతి నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 23,882మంది జనాభా ఉన్నరు. అందులో పురుషులు 12,071, మహిళలు 11,811 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2,509 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే గొల్లప్రోలు అక్షరాస్యత ఎక్కువ. 2011 లో అక్షరాస్యత గొల్లప్రోలు 67.09% కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 67.02%.ఉంది. పురుషుల అక్షరాస్యత 70.69% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 63.43%.అక్షరాస్యులు ఉన్నారు.[2]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[3] ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు

[మార్చు]
  1. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-06.
  2. "2011 జనాభా గణాంకాలు గొల్లప్రోలు తూర్పు గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్". www.census2011.co.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "గొల్లప్రోలు మున్సిపాలిటీలో వైకాపా విజయ భేరి". ETV Bharat News (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-08.