కనిగిరి నగరపంచాయితీ
కనిగిరి | |
స్థాపన | 2011 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
కనిగిరి నగర పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశంజిల్లాకు చెందింది.ఈ నగర పంచాయతీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం లోని, కనిగిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.
చరిత్ర
[మార్చు]కనిగిరి నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 208 కి.మీ దూరంలోనూ, జిల్లా ప్రధాన కేంద్రం 85 కి.మీ. దూరంలో ఉంది.[1] కనిగిరిని పూర్వం కనకగిరి (బంగారుకొండ) అని పిలిచేవారు. దీని పూర్తిపేరు కనకగిరి విజయ మార్తాండ దుర్గం.[2] కవి, రాజు నన్నెచోడుడు ఉదయగిరిని పరిపాలించిన కాలంలో కనిగిరి సామంత రాజ్యంగా ఉండేది.[3] కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధం చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కొన్ని చారిత్రక కట్టడాలున్నాయి. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గం ముఖ్యమైనవి. కనిగిరి కొండపై రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశాల్యం కలిగిన చదును నేల ఉంది. పూర్వం కొండపై ఒక పట్టణం ఉండేదని స్థానికుల కథనం[4]
జనాభా గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం 35368 ఉన్న పట్టణ జనాభా 2011 లో 44775 కు పెరిగింది. గత దశాబ్దంలో 79%% పెరిగింది. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 934 స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత రేటు 77.55% ఉండగా పురుష జనాభాలో 38.42% స్త్రీ జనాభాలో 39.13% అక్షరాస్యులు ఉన్నారు.
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా షేక్ గఫుర్, వైస్ చైర్మన్‌గా పులి శాంతి పనిచేస్తున్నారు.[5]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- కనిగిరి కొండ
- శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం. కనిగిరి
ఇతర వివరాలు
[మార్చు]ఈ నగర పంచాయతీలో 11 రెవెన్యూ వార్డులు, 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి.మురికివాడల జనాభా 7644 ఉన్నారు.ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 4 ఉన్నత పాఠశాలలు,5 ప్రభుత్వ పాఠశాలలు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి. ఈ నగర పంచాయతీలో 10465 గృహాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-23. Retrieved 2020-08-16.
- ↑ Gazetteer of the Nellore District: brought upto 1938 By Government Of Madras Staff పేజీ.325 [1]
- ↑ ఈతకోట, సుబ్బారావు (సెప్టెంబరు 2010). "చరిత్రకందని ఉదయగిరి కోట". అలనాటి నెల్లూరు (1 ed.). హైదరాబాద్: పాలపిట్ట బుక్స్. pp. 44–49.
- ↑ Lists of the Antiquarian Remains in the Presidency of Madras By Robert Sewell పేజీ.138 [2]
- ↑ "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.