బొబ్బిలి పురపాలక సంఘం
| బొబ్బిలి | |
| స్థాపన | 1956 |
|---|---|
| రకం | స్థానిక సంస్థలు |
| చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
| కేంద్రీకరణ | పౌర పరిపాలన |
| ప్రధాన కార్యాలయాలు | బొబ్బిలి |
| కార్యస్థానం |
|
| సేవలు | పౌర సౌకర్యాలు |
| అధికారిక భాష | తెలుగు |
| ప్రధానభాగం | పురపాలక సంఘం |
| జాలగూడు | అధికార వెబ్ సైట్ |
బొబ్బిలి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గంలోని, బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.[1]
చరిత్ర
[మార్చు]
బొబ్బిలి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 500 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1956లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.1980 లో 2వ తరగతి మునిసిపాలిటీగా మార్చబడింది.సముద్ర మట్టానికి 108 మీటర్ల ఎత్తులో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]బొబ్బిలి పురపాలక సంఘంలో 30 వార్డులుగా విభజించబడింది, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 56,819 జనాభా ఉండగా అందులో పురుషులు 28,285, మహిళలు 28,534 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు 69% ఉండగా అందులో పురుష జనాభాలో 75%, స్త్రీ జనాభాలో 63%అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5,693 ఉన్నారు. ఈ పురపాలక సంఘంలో మొత్తం 14,584 గృహాలు ఉన్నాయి.
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా తూముల అచ్చుతవల్లి పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా చోడిగంజీ రమేష్ పనిచేస్తున్నాడు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- వేణుగోపాల స్వామి ఆలయం
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". the original నుండి 2019-12-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-20.
- 1 2 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. the original (PDF) నుండి 6 సెప్టెంబరు 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2016.