జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం
జంగారెడ్డిగూడెం
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా లోని పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం ఏలూరు లోకసభ నియోజకవర్గం లోని, చింతలపూడి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉంది. [1]

చరిత్ర[మార్చు]

ఈ పురపాలక సంఘం 2011 లో ఏర్పాటు చేశారు.29 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.

భౌగోళికం[మార్చు]

జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం 17°07′00″N 81°18′00″E / 17.1167°N 81.3000°E / 17.1167; 81.3000 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.[2] సముద్రమట్టానికి 74 మీటర్ల ఎత్తులో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధిలో 109814 జనాభా ఉండగా అందులో పురుషులు 54682 ఉండగా స్త్రీల 55132 ఉన్నారు. ఈ పురపాలక సంఘం పరిధిలో 29820 గృహాలు ఉన్నాయి.0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 11669, ఇది మొత్తం జనాభాలో 10.63% ఉంది.జంగారెడ్డిగూడెం మండలం లింగ నిష్పత్తి 1008గా ఉంది. జంగారెడ్డిగూడెం అక్షరాస్యత శాతం 62.64% అందులో పురుషులు 65.16% అక్షరాస్యులు స్త్రీలు 60.14% స్త్రీలు అక్షరాస్యులు ఉన్నారు.[3]

పౌర పరిపాలన[మార్చు]

ఈ పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 29 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "పాఅలింగ్ రైన్ జీనోమిక్స్". Archived from the original on 2007-09-20. Retrieved 2007-09-19.
  3. "Jangareddigudem Mandal Population West Godavari, Andhra Pradesh, List of Villages & Towns in Jangareddigudem Mandal". Censusindia2011.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-26.
  4. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు[మార్చు]