పిడుగురాళ్ల పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిడుగురాళ్ల పురపాలక సంఘం
పిడుగురాళ్ల
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
పిడుగురాళ్ల
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

పిడుగురాళ్ల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.[1] ఈ పురపాలక సంఘం నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలోని, గురజాల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

పిడుగురాళ్ల పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 83 కి.మీ దూరంలో ఉంది.2005 సంవత్సరంలో మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 30 ఎన్నికల వార్డులు ఉన్నాయి.[2]

జనాభా గణాంకాలు[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం 50,127 ఉన్న పట్టణ జనాభా 2011 లో 63,103 కు పెరిగింది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 63,103 జనాభా ఉండగా అందులో పురుషులు 31,512, మహిళలు 31,591 మంది ఉన్నారు.అక్షరాస్యత 70.17% ఉండగా అందులో పురుష జనాభాలో 78.73%, స్త్రీ జనాభాలో 61.71% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7339 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 15,597 గృహాలు ఉన్నాయి.[3]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా బి.హేమవతి, [4] వైస్ చైర్మన్‌గా అద్దంకి రత్నాకర్ రావు పనిచేస్తున్నారు.[4]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • భోగలింగేశ్వర స్వామివారి దేవాలయం
  • కనకదుర్గ అమ్మవారి దేవాలయం
  • శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయం
  • సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయం.

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 31.63 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.19 రెవెన్యూ వార్డులు,30 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో మురికివాడలు 31 ఉండగా అందులో జనాభా 33250 ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,2 కూరగాయల మార్కెట్లు,6 ప్రభుత్వ పాఠశాలు,4 ప్రాథమిక పాఠశాలలు,1 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,1 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-22. Retrieved 2020-07-03.
  2. skannegari. "Piduguralla Municipality into 33 Wards". Telangana NavaNirmana Sena (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-03-07. Retrieved 2020-07-03.
  3. "Piduguralla Nagar Panchayat City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-03.
  4. 4.0 4.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]