నిడదవోలు పురపాలక సంఘం
| నిడదవోలు | |
గణేశ్ చౌక్, నిడదవోలు | |
| స్థాపన | 1964 |
|---|---|
| రకం | స్థానిక సంస్థలు |
| చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
| కేంద్రీకరణ | పౌర పరిపాలన |
| కార్యస్థానం | |
| సేవలు | పౌర సౌకర్యాలు |
| అధికారిక భాష | తెలుగు |
| ప్రధానభాగం | పురపాలక సంఘం |
| జాలగూడు | అధికార వెబ్ సైట్ |
నిడదవోలు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం లోని, నిడదవోలు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]నిడదవోలు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1964 సంవత్సరంలో 2 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 14.88.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 43,809 జనాభా ఉండగా అందులో పురుషులు 21,281, మహిళలు 22,528 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 81.16% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 84.60% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 77.95%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4263 ఉన్నారు.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్తుత చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్1 యలగాడ బాలరాజు, వైస్ చైర్మన్ 2 షేక్ వజీరుద్దీన్.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం.
- గోలింగేశ్వరస్వామి వారి దేవస్థానం.
- సోమేశ్వర స్వామి వారి దేవస్థానం
- రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి వారి దేవస్థానం
- దాసాంజనేయ స్వామివారి దేవస్థానం
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Nidadavole Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-11.