పెద్దాపురం పురపాలక సంఘం
పెద్దాపురం | |
స్థాపన | 1915 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
పెద్దాపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కాకినాడ లోకసభ నియోజకవర్గం లోని,పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
పెద్దాపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1915 సంవత్సరంలో 2 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.పురపాలక సంఘం పరిధి 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు[మార్చు]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 49,477 జనాభా ఉండగా అందులో పురుషులు 24,334 , మహిళలు 25,143 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 77.14% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 80.41% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 72.05%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4219 ఉన్నారు.[2]
భౌగోళికం[మార్చు]
పెద్దాపురం పట్టణం17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[3]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా లక్ష్మీ సూర్యనారాయణ రాజు,[4] వైస్ చైర్మన్‌గా సత్య భాస్కరరావు పనిచేస్తున్నారు.[4]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
- మరిడమ్మ తల్లి దేవాలయం
- సామర్లకోట చాళుక్య కుమరారామ మందిరం (భీమేశ్వరాలయం), ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
- పెద్దాపురంపాండవులమెట్ట, పాండవగుహలు
- ముప్పన వారి బంగ్లా గాలి బంగ్లా - కార్తీక మాసంలో జరుగు వనభోజనములకు ప్రసిద్ధి
- హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔలియా దర్గా తొమ్మిది మూరల సాహెబ్ దర్గా
- కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దేవాలయం
- తిరుపతి (పెద్దాపురం) శృంగార వల్లభస్వామి వారి దేవాలయం
- వాలుతిమ్మాపురం ఆంజనేయ స్వామి వారి దేవాలయం
- పాండవుల మెట్ట మీద గల సూర్యనారాయణ స్వామి దేవాలయం.
- పరమేశ్వర, వెంకటేశ్వర, అయ్యప్ప స్వామి దేవాలయాలు.
- చంద్రబాబు శతాబ్ది పార్కు
ఇతర వివరాలు[మార్చు]
ఈ పురపాలక సంఘం 38.77.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.15 రెవెన్యూ వార్డులు,28 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 45 మురికివాడలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,2ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Peddapuram Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-11.
- ↑ "ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం". Archived from the original on 2008-01-15. Retrieved 2008-06-27.
- ↑ 4.0 4.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help)