రాజా వత్సవాయ సూరిబాబు రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజా వత్సవాయ సూరిబాబు రాజు
జననం
శ్రీ రాజా వత్సవాయ లక్ష్మీ సూర్యనారాయణ జగపతి బహద్దరు మహారాజు

(1954-01-07) 1954 జనవరి 7 (వయసు 70)
పెద్దాపురం
జాతీయతభారతీయుడు
వృత్తిపెద్దాపురం మునిసిపల్ చైర్మన్
జీవిత భాగస్వామివత్సవాయ సుధ
పిల్లలుదినేష్ రాజు
తల్లిదండ్రులుసూర్యనారాయణ జగపతి, నర్శిమూర్తియమ్మ

రాజా సూరిబాబు రాజు పెద్దాపురం సంస్థానాన్ని 300 సంవత్సారాలు పరిపాలించిన వత్సవాయ వంశస్థుల కోవకి చెందినవారు. ఆయన పూర్తిపేరు "శ్రీ రాజా వత్సవాయ లక్ష్మీ సూర్యనారాయణ జగపతి బహద్దరు మహారాజు".[1]

జీవిత విశేషాలు[మార్చు]

రాజా వత్సవాయ సూరిబాబు రాజు జనవరి 7 1954పెద్దాపురంలో సూర్యనారాయణ జగపతి, సర్శిమూర్తియమ్మ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్యను లూథరన్ హైస్కూల్ లో చదివారు. మహారాణీ కళాశాల, పెద్దాపురం నుండి పట్ట బద్రులయ్యారు.[1]

రాజకీయం ప్రస్థానం[మార్చు]

పెద్దాపురం మహారాణీ కళాశాల అధ్యక్షులుగా, కాంగ్రేస్ పట్టణ అద్యక్షులుగా తన సేవలనందించారు. జిల్లా కాంగ్రేస్ యువ నాయకునిగానూ, మహారాణీ సత్రం కార్యనిర్వాహక అధ్యక్షునిగానూ పనిచేసారు. 1999 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి సేవలనందించారు. రెండు సార్లు పెద్దాపురం పురపాలక సంఘ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పెద్దాపురం పురపాలక సంఘంలో అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం తరపున పోటీచేసి విజయం సాధించి మొదటిసారి చైర్మన్ గా మార్చి 31 2000 నుండి మార్చి 30 2005 వరకు తన సేవలనందించారు. తరువాత రెండవసారి కూడా విజేతగా నిలిచి 03.07.2014 న చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అటు పార్టీ కార్యక్రమాలలో, నవ్యాంద్ర నిర్మాణంలో చురుకుగా పాల్గొంటూ ఇటు పెద్దాపురం ప్రథమ పౌరుడిగా ప్రముఖ పాత్ర పోషిస్తూ అత్యంత ప్రభావశాలియైన రాజకీయనాయకుడిగా అందరి మన్ననలూ పొందుతూ అందరినీ అక్కున చేర్చుకుంటూ చిన్న పిల్లల్ని సైతం ఆప్యాయంగా పలకరిస్తూంటారు.

నియోజకవర్గంలో ప్రతీ కార్యక్రమానికీ హాజరవుతూ కష్టం అన్న ప్రతీఒక్కరినీ ఆదుకుంటూ అనుకున్న అభివృద్ధి పనిని అందుకోవాల్సిన లక్ష్యాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా వదలని మనిషిగా కులమతాలకి అతీతంగా పేదల సంక్షేమమే పరమావదిగా పరిపాలన చేసే ప్రజానాయకులుగా పేరుపొందారు.

రాజకీయాలు ఎన్నికలవరకే ఎన్నికల తర్వాత ప్రతీ పనీ ఊరి అభివృద్ధి కొరకే అని విశ్వసించే వారిలో మొదటి వరసలో ఉంటారు. ముక్కు సూటిగా వ్యవహరిస్తారు నాన్చేధోరణి సహించరు. న్యాయం ఎటు ఉంటే అటు నిలబడతారు. అది అధికార పక్షమా ప్రతి పక్షమా అనిచూడరు.

టెన్నీస్ చాంపియన్ గా, హార్స్ రైడర్ గా, రైఫిల్ షూటర్ గా, ఇంకా అనేక క్రీడలలో ప్రావీణ్యులుగా క్రీడాభ్యుదయానికి బాటలువేస్తూ క్రీడాకారులను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ యువక్రీడాకారులలో స్పూర్తినింపుతున్నారు.

పెద్దాపురం ప్రాశస్త్యాన్ని ప్రతిభింబింపజేసే ప్రతీ అంశాన్నీ గౌరవిస్తూ పెద్దాపురం ప్రాముఖ్యతని ప్రతీ చోటా తెలియజేస్తూ పెద్దాపురం చరిత్రని ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే ప్రతీఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు.

చారిత్రక పెద్దాపుర పునర్నిర్మాణానికి పునాధిరాళ్లు పేరుస్తూ పునర్వైభవానికి విశేషకృషి చేస్తూ పురపాలక సర్వతోముఖాభివృద్ధికి సర్వదాకృషి చేస్తున్న పెద్దాపురం ప్రథమపౌరులు శ్రీ రాజా సూరిబాబు రాజు గారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఈనాడు, ప్రజాశక్తి దినపత్రిక 17.05.2016 18.05.2016 తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎడిషన్

ఇతర లింకులు[మార్చు]