1954
స్వరూపం
1954 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1951 1952 1953 - 1954 - 1955 1956 1957 |
దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 1: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
- జూన్ 16: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
- నవంబర్ 15: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
జననాలు
[మార్చు]- జనవరి 1: శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రిడాకారిణి .
- జనవరి 1: తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు.
- ఫిబ్రవరి 16: మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- ఫిబ్రవరి 17: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తొలి ముఖ్యమంత్రి.
- మార్చి 12: దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.
- జూన్ 22: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (మ.2017)
- జూలై 19: దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.
- జూలై 27: రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023)
- ఆగస్టు 4: ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు.
- ఆగస్టు 13: రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి.
- సెప్టెంబరు 20: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013)
- అక్టోబర్ 5: ఎం.వి.రఘు, ఛాయాగ్రాహకుడు, కళ్లు సినిమా దర్శకుడు.
- నవంబర్ 7: కమల్ హాసన్, చలనచిత్ర నటుడు.
- నవంబరు 19: చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
- నవంబర్ 25: సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది
- నవంబర్ 29: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.
- నవంబర్ 30: వి.ఆర్.గౌరీశంకర్ సామాజిక కార్యకర్త, శృంగేరి శారదా పీఠం నిర్వాహకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత
- డిసెంబర్ 1: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
మరణాలు
[మార్చు]- నవంబర్ 28: ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- : రాయసం వెంకట శివుడు, రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త. (జ.1870)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురష్కారాలు : సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తి రాజగోపాలాచారి, డా. సీ.వీ.రామన్