మైకెల్ హోల్డింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైకెల్ హోల్డింగ్
Michael Holding.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి కుడిచేతి ఫాస్ట్ బౌలర్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 60 102
పరుగులు 910 282
బ్యాటింగ్ సగటు 13.78 9.09
100లు/50లు -/6 -/2
అత్యుత్తమ స్కోరు 73 64
ఓవర్లు 2113 912
వికెట్లు 249 142
బౌలింగ్ సగటు 23.68 21.36
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 13 1
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 10 n/a
అత్యుత్తమ బౌలింగ్ 9/92 5/26
క్యాచ్ లు/స్టంపింగులు 22/- 30/-

As of జనవరి 25, 200
Source: [1]

1954, ఫిబ్రవరి 16న జన్మిమ్చిన మైకెల్ హోల్డింగ్ (Michael Anthony Holding) వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ మజీ క్రికెట్ క్రీడాకారుడు. భయంకరమఇన బౌలింగ్ తో బ్యాట్స్‌మెన్‌లను గడగడలాడించేవాడు. అతని ఎత్తుకు తగ్గట్లు (6' 3 ½") అతని రనప్ (బౌలింగ్ వేసే ముందు పరుగెత్తే దూరం) కూడా చాలా పొడవు. అతనితో పాటు భయంకర బౌలర్లు జోయెల్ గార్నర్, ఆండీ రోబర్ట్స్, మాల్కం మార్షల్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టేవారు. 1980 దశాబ్దంలో వెస్టీండీస్ ప్రపంచ క్రికెట్ లో ఉన్నత దశలో నిల్వడానికింf వీరందరి కృషి కారణం.

టెస్ట్ క్రికెట్‌లో 60 మ్యాచ్‌లు ఆడి 23.68 సగటుతో 249 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 13 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 92 పరుగులకు 8 వికెట్లు. టెస్టులలో 36 సిక్సర్లు కొట్టి 1000 పరుగుల లోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు సాధిమ్చిన వాడిగా రికార్డు సృష్టించాడు.

వన్డే క్రికెట్‌లో 102 మ్యాచ్‌లు ఆడి 142 వికెట్లను సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 26 పరుగులకు 5 వికెట్లు. 1979, 1983 లలో ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్నాడు.

ప్రస్తుతం హోల్డింగ్ క్రికెట్ కామెంటేటర్ గా విధులను నిర్వహిస్తున్నాడు.

బయటి లింకులు[మార్చు]