జోయెల్ గార్నర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోయెల్ గార్నర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1952-12-16) 1952 డిసెంబరు 16 (వయసు 71)
క్రైస్ట్ చర్చ్, బార్బడోస్
మారుపేరుబిగ్ బర్డ్
ఎత్తు6 ft 8 in (2.03 m)
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడిచేతివాటం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 160)1977 ఫిబ్రవరి 18 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1987 మార్చి 15 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 21)1977 మార్చి 16 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1987 మార్చి 28 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975–1987బార్బడోస్
1977–1986సోమర్సెట్
1982/83దక్షిణ ఆస్ట్రేలియా
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 58 98 214 256
చేసిన పరుగులు 672 239 2,964 1,023
బ్యాటింగు సగటు 12.44 9.19 16.74 11.75
100లు/50లు 0/1 0/0 1/8 0/1
అత్యుత్తమ స్కోరు 60 37 104 59*
వేసిన బంతులు 13,169 5,330 39,829 13,359
వికెట్లు 259 146 881 397
బౌలింగు సగటు 20.97 18.84 18.53 16.61
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 7 3 48 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 7 0
అత్యుత్తమ బౌలింగు 6/56 5/31 8/31 6/29
క్యాచ్‌లు/స్టంపింగులు 42/– 30/– 129/– 71/–
మూలం: Cricinfo, 2009 సెప్టెంబరు 13

జోయెల్ గార్నర్ (జననం 1952 డిసెంబరు 16) వెస్టిండీస్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను 1970ల చివరి నుంచి 1980ల ప్రారంభంలో వెస్టిండీస్ క్రికెట్ జట్లలో సభ్యుడు. గార్నర్ ఐసీసీ బెస్ట్ ఎవర్ బౌలింగ్ రేటింగ్‌ల ప్రకారం అత్యుత్తమ ర్యాంకు పొందిన వన్డే ఇంటర్నేషనల్ బౌలర్,[1] టెస్టుల్లో 37వ స్థానం పొందాడు.[2] గార్నర్ 1979 క్రికెట్ ప్రపంచ కప్‌ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టులో సభ్యుడు.

జోయెల్ గార్నర్ తోటి ఫాస్ట్ బౌలర్లు మైఖేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, కోలిన్ క్రాఫ్ట్, తరువాత మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్‌లతో కలిపి వెస్టిండీస్ టెస్ట్, వన్డే క్రికెట్లలో అపూర్వమైన ఎత్తులకు తీసుకువెళ్ళడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ దశలో వెస్టిండీస్ 15 సంవత్సరాల పాటు ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

జోయెల్ గార్నర్ తల్లిదండ్రులు అమెరికా, కెనడా వలసవెళ్ళడంతో బార్బడోస్‌లోని క్రైస్ట్ చర్చి ప్రాంతంలో చెరకు పొలాల మధ్య విసిరేసినట్టున్న ఇళ్ళ మధ్య తాతయ్య ఇంటివద్ద పెరిగాడు. బాల్యం నుంచి క్రికెట్ ఆడుతూ వచ్చిన ఇతను స్కూల్ జట్టులో సేమర్ నర్స్ కోచింగ్‌లో రాటుతేలాడు. గార్నర్ ఎత్తును బౌలింగ్‌లో ఉపయోగించుకునేలా నర్స్ కోచింగ్ ఇచ్చాడు. గ్రిఫిత్ బౌన్స్, యార్కర్ వంటివి చార్లీ గ్రిఫిత్, గ్యారీ సోబర్స్ కోచింగ్ సెషన్లలో నేర్చుకున్నాడు.[3]

1976-78 మధ్యకాలంలో ఇంగ్లండులోని గార్నర్ సెంట్రల్ లంకషైర్ లీగ్‌లో లిటిల్‌బరో జట్టుకు జీతానికి ఆడాడు. ఈ మూడేళ్ళలో 1500 పరుగులు చేసి, 334 వికెట్లు తీశాడు. ఈ దశలోనే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్ 1977 సీజన్‌కు ఇతన్ని తీసుకుంది.[4] 338 ఫస్ట్ క్లాస్ వికెట్లను 18.10 యావరేజితో తీసి కౌంటీకి ఆడుతున్న అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా పేరు సంపాదించాడు.[5]

1977 ఫిబ్రవరిలో పాకిస్తాన్ మీద వెస్టిండీస్ టెస్టు మ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన ఇతను 1987 వరకూ వెస్టిండీస్ జట్టులో 58 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొదటి టెస్టు సీరీస్‌లోనే 25 వికెట్లు తీసుకున్న గార్నర్ మొత్తం కెరీర్‌లో కేవలం 20.9 సగటుతో 259 వికెట్లు పడగొట్టి టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.[6] తన టెస్టు కెరీర్‌లో ఐదుసార్లు ఇన్నింగ్స్‌లో ఏడేసి వికెట్లు తీసుకున్న ఘనత సాధించినా ఇతనికి మైకేల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, కోలిన్ క్రోఫ్ట్, మాల్కమ్ మార్షెల్ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్న జట్టులో వారితో పోటీపడి వికెట్లు తీయాల్సిరావడంతో పది వికెట్లు తీసుకునే వీలుచిక్కలేదు.[7]

తాను ఆడే కాలంలో అత్యంత ఎత్తైన బౌలర్‌గా నిలిచిన గార్నర్ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో దాన్ని తన ఆటకు బాగా అనువుగా ఉపయోగించుకున్నాడు. 98 మ్యాచ్‌ల్లో 146 వికెట్లు తీసుకున్న ఇతను 2020 జనవరి నాటికి వికెట్‌కి 20 పరుగులకు మించని యావరేజితో వంద వికెట్లు తీసుకున్న ఇద్దరే ఇద్దరు వన్డే బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. వెయ్యి బంతులకు పైగా వేసిన ఏ బౌలర్‌కీ సాధ్యం కాని ఓవర్‌కి 3.09 పరుగుల ఎకానమీ రేట్ కూడా ఇతని ఖాతాలోనే ఉంది.[8]

1979లో ప్రపంచ కప్ ఫైనల్లో కేవలం 4 పరుగులకు ఒక హ్యాట్రిక్‌తో కలిపి 5 వికెట్లు తీసి ఇప్పటిదాకా చెక్కుచెదరని ప్రపంచ కప్‌ ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్ పెర్‌ఫార్మెన్స్ రికార్డు సృష్టించాడు.

ఐసీసీ ఆల్‌టైమ్ అత్యుత్తమ బౌలర్ల జాబితాలో అత్యుత్తమ ర్యాంక్ సంపాదించాడు. 2010లో గార్నర్‌ను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు.[9]

  1. ICC Highest-Ever ODI Ratings, Reliance ICC rankings, accessed 21-Jan-2020
  2. ICC Highest-Ever Test Ratings, Reliance ICC rankings, accessed 21-Jan-2020
  3. Garner, Joel (1988). Big Bird. Flying High. The autobiography of Joel Garner. Great Britain: Arthur Barker. pp. 20–35.
  4. "Joel GARNER - Test Profile 1977 - 1987 - West Indies". Sporting Heroes. Retrieved 2022-05-08.
  5. "Joel Garner interview: "Somerset is still one of the better places in the world to live"". Somerset County Gazette (in ఇంగ్లీష్). 20 June 2019. Retrieved 2022-05-12.
  6. "Has there ever been a more underrated bowler than Joel Garner?". The Roar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-08.
  7. "Joel Garner: 16 facts you should know about the Big Bird". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-12-16. Retrieved 2022-05-12.
  8. RECORDS / ONE-DAY INTERNATIONALS / BOWLING RECORDS / BEST CAREER ECONOMY RATE, ESPNcricinfo, 20 January 2020
  9. Staff (6 October 2010). "Walsh, Garner inducted into Hall of Fame". Guardian Media. Retrieved 19 July 2019.