Jump to content

కోర్ట్‌నీ వాల్ష్

వికీపీడియా నుండి
కోర్ట్‌నీ వాల్ష్
2005 లో వాల్ష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కోర్ట్‌నీ ఆండ్రూ వాల్ష్
పుట్టిన తేదీ (1962-10-30) 1962 అక్టోబరు 30 (వయసు 62)
కింగ్‌స్టన్, జమైకా
ఎత్తు198[1] cమీ. (6 అ. 6 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 183)1984 నవంబరు 9 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2001 ఏప్రిల్ 19 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 45)1985 జనవరి 10 - శ్రీలంక తో
చివరి వన్‌డే2000 జనవరి 11 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.12, 33
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981/82–2000/01జమైకా
1984–1998గ్లౌసెస్టర్‌షైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 132 205 429 440
చేసిన పరుగులు 936 321 4,530 1,304
బ్యాటింగు సగటు 7.54 6.97 11.32 8.75
100లు/50లు 0/0 0/0 0/8 0/0
అత్యుత్తమ స్కోరు 30* 30 66 38
వేసిన బంతులు 30,019 10,822 85,443 21,881
వికెట్లు 519 227 1,807 551
బౌలింగు సగటు 24.44 30.47 21.71 25.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 22 1 104 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 3 0 20 0
అత్యుత్తమ బౌలింగు 7/37 5/1 9/72 6/21
క్యాచ్‌లు/స్టంపింగులు 29/– 27/– 117/– 68/–
మూలం: CricketArchive, 2008 ఆగస్టు 21

కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ OJ (జననం 1962 అక్టోబరు 30) మాజీ జమైకా క్రికెటరు. 1984 నుండి 2001 వరకు వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వెస్టిండీస్‌కు 22 టెస్టు మ్యాచ్‌లలో కెప్టెన్‌గా చేసాడు. [2] అతను ఆల్-టైమ్ గ్రేట్స్‌లో ఒకరిగా పరిగణించబడిన ఫాస్టు బౌలరు. అనేక సంవత్సరాలు సహచర వెస్టు ఇండియన్ కర్ట్‌లీ ఆంబ్రోస్‌తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ బౌలింగ్ భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందాడు. వాల్ష్ వెస్టిండీస్ తరపున 132 టెస్టులు, 205 వన్‌డేలు ఆడి 519, 227 వికెట్లు పడగొట్టాడు. అతను ఆంబ్రోస్‌తో కలిసి 49 మ్యాచ్‌ల్లో 421 టెస్టు వికెట్లు పంచుకున్నాడు. [3] అతను కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత 2000 నుండి అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ రికార్డును, 2004లో షేన్ వార్న్ బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌, వాల్ష్. [4] అతని ఆత్మకథకు "హార్ట్ ఆఫ్ ది లయన్" అని పేరు పెట్టాడు. వాల్ష్, 1987లో విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు. 2010 అక్టోబరులో, అతను ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు. అతను 2016 ఆగస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు స్పెషలిస్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు [5]

తొలినాళ్ళ జీవితం ఫస్ట్-క్లాస్ కెరీర్

[మార్చు]

కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ 1962 అక్టోబరు 30న జమైకాలోని కింగ్‌స్టన్‌లో జన్మించాడు. మైఖేల్ హోల్డింగ్ క్రికెట్ ఆడిన మెల్‌బోర్న్ క్లబ్ తోనే అతనూ తన ప్రారంభ క్రికెట్‌ ఆడాడు. 1979లో స్కూల్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టడంతో వాల్ష్ తొలిసారిగా కీర్తి పొందాడు. మూడు సంవత్సరాల తర్వాత ఫస్టు క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. [6] అతను 1981, 2001 మధ్య ఈ ఫార్మాట్‌లో 427 మ్యాచ్‌లు ఆడి, 21.71 సగటుతో 1,807 వికెట్లు తీశాడు. ఇందులో 104 ఐదు వికెట్ల పంటలు, 20 పది వికెట్ల పంటలూ ఉన్నాయి. [4] వాల్ష్ 1985 నుండి 1 998 వరకు గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (గ్లౌసెస్టర్‌షైర్ CCC) కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు [3]

వాల్ష్ 1984 నుండి 2001 వరకు వెస్టిండీస్ తరపున క్రికెట్ ఆడాడు, 1984 నుండి 1998 వరకు గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (గ్లౌసెస్టర్‌షైర్ CCC), 1981-82 నుండి 1999-00 వరకు జమైకా క్రికెట్ జట్టుకు, 1987లో రెస్టు ఆఫ్ ది వరల్డ్ XI కు, 1991–92 లో వెస్టిండీస్ ఎ కూ ఆడాడు. అతను మొదటిసారిగా, 1984లో గ్లౌసెస్టర్‌షైర్ CCC తరపున ఆడాడు. 1998 వరకూ ఆ జట్టుకు ప్రధాన అండగా ఉన్నాడు [7]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

వాల్ష్, 1984లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై తన తొలి టెస్టులో 43 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. [8] అతను 1984-85 సీజన్‌లో ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1984-85 జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు, స్వదేశీ సిరీస్‌లో న్యూజిలాండ్‌తో ఒక టెస్టు ఆడాడు. [9] ఈ సీజన్‌లో 507 పరుగులిచ్చి 16 వికెట్లు పడగొట్టాడు. [10] అదే సీజన్‌లో, వరల్డ్ సిరీస్ కప్ సందర్భంగా హోబర్ట్‌లో శ్రీలంకపై వాల్ష్ తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. [11] తరువాతి రెండు సీజన్లలో వాల్ష్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఒక మ్యాచ్, పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు, వెస్టిండీస్ వెలుపల న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లూ ఆడాడు. [9] అతను ఈ సీజన్లలోని ఏడు మ్యాచ్‌ల నుండి 29 వికెట్లు తీశాడు. ఇందులో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. [11] 1987లో, వాల్ష్ మునుపటి సంవత్సరంలో అతని ప్రదర్శనకు విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకరిగా ఎంపికయ్యాడు. [6]

1987-88 సీజన్‌లో, వాల్ష్ భారతదేశంలో పర్యటించి, వారితో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడి, 16.80 సగటుతో 26 వికెట్లు తీసుకున్నాడు. [9] [11] ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన సిరీస్‌లోని మొదటి టెస్టులో, అతను భారత రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులకు ఐదు వికెట్లతో సహా 67 పరుగులకు ఆరు వికెట్లు తీసుకున్నాడు. [12] వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో, అతను [13] 54 పరుగులకు ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ సీజన్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వెస్టిండీస్‌కు వెళ్లి మూడు టెస్టులు ఆడింది. 1987 క్రికెట్ ప్రపంచ కప్‌లో వాల్ష్, సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఆఖరి బంతికి పాకిస్థాన్‌కు రెండు అవసరం ఐనప్పుడు సలీమ్ జాఫర్ బ్యాకప్ అవుతుండగా, అతన్ని హెచ్చరించి వదిలేసాడు. చివరికి ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయింది. కానీ వాల్ష్ క్రీడాస్ఫూర్తికి అర్హమైన గౌరవం లభించింది. అతను స్థానిక అభిమాని నుండి చేతితో నేసిన కార్పెట్‌ను కూడా అందుకున్నాడు. వాల్ష్ మూడు మ్యాచ్‌ల నుంచి నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతను, 1988లో ఇంగ్లాండ్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడి, 34.33 సగటుతో 12 వికెట్లు తీశాడు. 1988-89లో వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనలో, వాల్ష్ ఐదు టెస్టులు ఆడి 29.41 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సహా 62 పరుగులకు నాలుగు వికెట్లు తీయడం. [11] అతను బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోకి సాగిన అసాధారణమైన హ్యాట్రిక్ సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో చివరి బంతికి ఆస్ట్రేలియాకు చెందిన టోనీ డోడెమైడ్ ను ఔట్ చేసి, రెండవ ఇన్నింగ్సులో మైక్ వెలెట్టా, గ్రేమ్ వుడ్‌లను మొదటి రెండు బంతుల్లో అవుట్ చేశాడు. [14] ఆ చలికాలంలో కింగ్‌స్టన్‌లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అతను 10 వికెట్లు కూడా తీశాడు.


1994లో, "అక్యూట్ ఫెటీగ్ సిండ్రోమ్" కారణంగా రిచీ రిచర్డ్‌సన్‌ను విశ్రాంతి తీసుకోవాలని ఆదేశించిన తర్వాత, అతను భారతదేశం, న్యూజిలాండ్ పర్యటనలకు వెస్టిండీస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 1995లో, అతను 21.75 పరుగుల సగటుతో 62 టెస్టు వికెట్లు తీశాడు. 2000లో 18.69 సగటుతో 66 టెస్టు వికెట్లు తీయడం ద్వారా మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 12.82 సగటుతో 34 వికెట్లు తీసాడు. ఒక టెస్టు సిరీస్‌లో 35 వికెట్లు తీసిన వెస్టిండీస్ బౌలర్‌గా (1988లో మాల్కం మార్షల్ నెలకొల్పిన) రికార్డుకు దగ్గరగా వచ్చాడు. 1990లలో, కర్ట్లీ ఆంబ్రోస్‌తో అతని భాగస్వామ్యం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత భయానకమైన బౌలింగ్ దాడుల్లో ఒకటి.

అతని కెరీర్ మొదటి భాగంలో, మార్షల్, జోయెల్ గార్నర్, ఆ తర్వాత ఆంబ్రోస్‌లతో కూడిన దాడిలో వాల్ష్ "స్టాక్" బౌలర్‌గా పనిచేశాడు. అయితే మార్షల్, గార్నర్‌లు రిటైరయ్యాక ఓపెనింగ్ బౌలర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని యాక్షనులో ఆ బౌలర్ల గాంభీర్యత లేదు. కానీ పొదుపు, చాలా సుదీర్ఘమైన స్పెల్‌లలో కూడా ఖచ్చితత్వం, ఉన్నాయి. అతను తన ఎత్తును ఉపయోగించి (సుమారు 198 సెం.మీ., లేదా ఆరు-అడుగుల-ఆరు), బంతికి తీవ్రమైన బౌన్స్‌ను కలిగించేవాడు. అతను తన కెరీర్ చివరి దశలో పేస్ కోల్పోయినప్పటికీ, వికెట్లు తీసే రేటు మాత్రం కొనసాగించాడు. ప్రత్యర్థులు అతను, ఆంబ్రోస్‌ల నుండి రక్షించుకుని బలహీనమైన మూడవ, నాల్గవ బౌలర్లపై దాడి చేయడానికి మొగ్గు చూపాయి.


వాల్ష్ తన చివరి వన్‌డే, 2000లో న్యూజిలాండ్‌తో, 2001లో తన స్వదేశంలో జమైకాలో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

దస్త్రం:CWalshBowling.png
వాల్ష్ టెస్టు కెరీర్ బౌలింగ్ గణాంకాలు. కాలక్రమేణా అవి ఎలా మారాయో చూపించే గ్రాఫ్.

టెస్టు క్రికెట్‌లో 5000 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసిన ఏడుగురు బౌలర్లలో వాల్ష్ ఒకడు. ఇతరులు శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్, నాథన్ లియాన్, భారతదేశానికి చెందిన అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ . [15] 500 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఏడుగురు బౌలర్లలో అతను కూడా ఒకడు. 1986లో శ్రీలంకపై కేవలం 1 పరుగుకు 5 వికెట్లు పడగొట్టిన వాల్ష్, వన్‌డేలలో అంతగా విజయవంతం కాలేదు. ఫస్టు క్లాస్ క్రికెట్‌లో, అతను ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ సార్లు 5 వికెట్లు, 20 సార్లు ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసుకున్నాడు.

అతని అత్యధిక స్కోరు, యాదృచ్ఛికంగా, గేమ్ రెండు రూపాల్లోనూ 30 యే. అతని కెరీర్ ముగిసే సమయానికి, అతను పేలవమైన బ్యాటింగ్‌కు ఖ్యాతిని పొందాడు, అతను బంతిని ఎదుర్కొంటే చాలు, ప్రేక్షకులు కేరింతలు కొట్టేవారు. [2] ఇది అతని బ్యాటింగ్‌ను మెచ్చుకోవడమా లేక బౌలింగ్‌ను ముగించే ప్రయత్నమా అనేది చర్చనీయాంశం. 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో (ఏడు వికెట్లు పడగొట్టాడు) చివరి వికెట్‌లో విజయం సాధించేందుకు (అందువలన సిరీస్‌లో డ్రాగా) బ్రియాన్ లారాతో నిలబడినప్పుడు అతని అత్యంత ముఖ్యమైన (స్కోరు లేని) ఇన్నింగ్స్ ఆడాడు. [16] వెస్టిండీస్ వాల్ష్ అంటే ఎంతో ఇష్టం, గౌరవం. అతని ప్రతిభకు చేరువయ్యే ఫాస్టు బౌలరు ఇంకా కనబడలేదు.


అతను 100 కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడి, ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని ఇద్దరు ఆటగాళ్ళలో ఒకడు.మరొకరు నాథన్ లియాన్ .

రికార్డులు

[మార్చు]

1986 డిసెంబరులో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో వాల్ష్ 5 వికెట్లు తీశాడు, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ షార్జాలోని షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 193 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఫార్మాట్‌లో అతను ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. [17] 1998 ఫిబ్రవరిలో, అతను గయానాలోని జార్జ్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌తో తన 100వ టెస్టు ఆడాడు. 2000లో, వాల్ష్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, కపిల్ దేవ్ 434 వికెట్లు తీసిన ఆరేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అతను తన 114వ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు, ఇది కపిల్ దేవ్ కంటే 17 మ్యాచ్‌లు తక్కువ. [18] టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వాల్ష్ నిలిచాడు. అతను, 2001లో దక్షిణాఫ్రికాపై ట్రినిడాడ్‌లోని పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌లో జాక్వెస్ కల్లిస్ వికెట్‌ తీసుకుని ఈ ఘనతను సాధించాడు. [19] అతని టెస్టు కెరీర్ మొత్తంలో, వాల్ష్ ఒక బౌలర్‌గా కర్ట్లీ ఆంబ్రోస్‌తో గొప్ప ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించాడు. అతనితో కలిసి 49 మ్యాచ్‌ల నుండి 421 వికెట్లను పంచుకున్నాడు. [2] టెస్టు క్రికెట్‌లో వాల్ష్ 519 వికెట్లు ఆ సమయంలో ఒక రికార్డు, దీనిని [20] లో శ్రీలంక ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు.


కెప్టెన్‌గా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు (55కి 13) వాల్ష్ పేరిట ఉంది[21]


వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ వాల్ష్‌ గురించి, "మనకు మరో కోర్ట్నీ వాల్ష్ కనిపిస్తారని నేను అనుకోను. నేను యువ ఫాస్టు బౌలర్ అయితే, అతనిని అనుకరించాలనుకుంటున్నాను." అని అన్నాడు.[22] వెస్టిండీస్ మాజీ ఆల్-రౌండర్ గ్యారీ సోబర్స్ అతని గురించి మాట్లాడుతూ, "వెస్టిండీస్ పట్ల అతని అంకితభావాన్ని, క్లిష్ట పరిస్థితుల్లో 100 శాతం ప్రయత్నించి, అందించడంలో అతని సామర్థ్యాన్నీ యువ ఫాస్టు బౌలర్లు అతన్ని చూసి నేర్చుకోవచ్చు." అన్నాడు. [22]

విరమణ తర్వాత

[మార్చు]

వెస్టిండీస్ జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్టర్‌గా తన కెరీర్ తర్వాత వాల్ష్, 2016 ఆగస్టులో బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌గా సంతకం చేశాడు. అతని కాంట్రాక్ట్ 2019 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత ముగిసింది.[23]

కోర్ట్నీ వాల్ష్, జోన్ వోలాస్టన్ కుమారుడు. వాల్ష్‌కు జమైకాలో కుడిజ్ అనే రెస్టారెంట్‌ ఉంది.[24] 2019 నవంబరులో, అతను వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గస్ లోగీకి అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [25]

కోచింగ్ కెరీర్

[మార్చు]

అతను కింగ్స్ XI పంజాబ్‌కు టాలెంట్ స్కౌట్‌గామ్, ఫాస్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.

వాల్ష్‌ను మూడేళ్ల కాంట్రాక్ట్‌పై 2016 సెప్టెంబరులో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమించారు. చండికా హతురుసింగ రాజీనామా చేసిన తర్వాత 2018 ఫిబ్రవరిలో తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [26]

2020 అక్టోబరులో అతను, వెస్టిండీస్ మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. [27] 2023 T20 ప్రపంచ కప్ తర్వాత, క్రికెట్ వెస్టిండీస్ అతని ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని నిర్ణయించుకుంది. [28]

అవార్డులు, సన్మానాలు

[మార్చు]

వాల్ష్. 1987లో విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకరిగా ఎంపికయ్యాడు. వాల్ష్, 1988లో వెస్టు ఇండియన్ క్రికెట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు [29] అతను, 2004లో ఆల్ టైమ్ గ్రేటెస్టు జమైకా క్రికెటర్‌గా పేరుపొందాడు [30]

2010 అక్టోబరులో, అతను జోయెల్ గార్నర్‌తో పాటు ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇతర పదిహేను మంది వెస్టు ఇండియన్ ప్లేయర్‌లతో చేరాడు. [31] [32]

మూలాలు

[మార్చు]
  1. Green, David (27 July 1998). "D Green: Walsh still scaling heights (27 Jul 1998)". ESPNcricinfo. Retrieved 22 July 2014.
  2. 2.0 2.1 2.2 "Courtney Walsh". ESPNcricinfo. Retrieved 22 August 2013.
  3. 3.0 3.1 Cricinfo staff, Wisden (30 October 2003). "All Today's Yesterdays – Happy birthday, Courtney". ESPNcricinfo. Retrieved 22 July 2014.
  4. 4.0 4.1 "Courtney Walsh". ESPNcricinfo. 22 July 2014. Retrieved 22 July 2014.
  5. "Cricket: Courtney Walsh becomes Bangladesh bowling coach". The Daily Star. 1 September 2016. Retrieved 31 August 2016.
  6. 6.0 6.1 "Wisden:Cricketer of the year 1987 – Courtney Walsh". Wisden. ESPNcricinfo. Retrieved 22 August 2013.
  7. "Teams Courtney Walsh played for". CricketArchive. Retrieved 22 August 2013.
  8. "West Indies in Australia 1984/85 (1st Test)". CricketArchive. Retrieved 7 September 2014.
  9. 9.0 9.1 9.2 "Test Matches played by Courtney Walsh (132)". CricketArchive. Retrieved 7 September 2014.
  10. "Test Bowling in Each Season by Courtney Walsh". CricketArchive. Retrieved 7 September 2014.
  11. 11.0 11.1 11.2 11.3 "Benson and Hedges World Series Cup 1984/85". CricketArchive. Retrieved 7 September 2014.
  12. "West Indies in India 1987/88 (1st Test)". CricketArchive. Retrieved 7 September 2014.
  13. "West Indies in India 1987/88 (2nd Test)". CricketArchive. Retrieved 7 September 2014.
  14. "West Indies in Australia 1988/89 (1st Test)". CricketArchive. Retrieved 7 September 2014.
  15. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-08-03.
  16. "Full Scorecard of Australia vs West Indies, Third test, 1998-9". ESPNcricinfo. Retrieved 22 July 2014.
  17. "Champions Trophy, 1986/87 – 5th Match". ESPNcricinfo. Retrieved 22 August 2013.
  18. Nasim, Col (retd) Rafi (2 April 2000). "News and Views". ESPNcricinfo. Retrieved 22 August 2013.
  19. CricInfo (19 March 2001). "Walsh becomes the first man to 500 Test wickets". ESPNcricinfo. Retrieved 22 August 2013.
  20. "Muralitharan breaks Test record". BBC Sport. London. 3 December 2007. Retrieved 5 March 2008.
  21. "Best figures in a match by a captain". cricinfo.
  22. 22.0 22.1 "Let's Not Lose Walsh". ESPNcricinfo. 25 April 2001. Retrieved 22 August 2013.
  23. "Walsh signs on as Bangladesh bowling coach". ESPNcricinfo. 31 August 2016. Retrieved 31 August 2016.
  24. "Cuddyz restaurant". Archived from the original on 30 March 2017. Retrieved 29 March 2017.
  25. "Walsh the new assistant coach for West Indies women". ESPNcricinfo (in ఇంగ్లీష్). 2019-11-01. Retrieved 2019-11-01.
  26. Isam, Mohammad (26 February 2018). "Walsh named Bangladesh's interim head coach". ESPNcricinfo. Retrieved 4 June 2023.
  27. "Courtney Walsh named West Indies women's coach". ESPN Cricinfo. Retrieved 2 October 2020.
  28. "CWI not to renew Courtney Walsh's contract as head coach of West Indies women's team". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-05-15.
  29. "Indian Cricket Cricketers of the Year: 1988". CricketArchive. Retrieved 7 September 2014.
  30. Wisden Cricinfo staff (13 May 2004). "Jamaica's top five cricketers of all time – Walsh and Holding named among Jamaica's best". ESPNcricinfo. Retrieved 7 September 2014.
  31. "ICC Cricket Hall of Fame". ESPNcricinfo. Retrieved 7 September 2014.
  32. "Rachael Heyhoe-Flint first woman inducted into cricket's Hall of Fame". The Guardian. 6 October 2010. Retrieved 22 August 2013.