Jump to content

చండికా హతురుసింగ

వికీపీడియా నుండి
చండికా హతురుసింగ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉపుల్ చండికా హతురుసింగ
పుట్టిన తేదీ (1968-09-13) 1968 సెప్టెంబరు 13 (వయసు 56)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రBangladesh Head Coach
బంధువులుChaminda Hathurusingha (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 48)1991 ఫిబ్రవరి 22 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1999 మార్చి 4 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 65)1992 జనవరి 10 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1999 మార్చి 19 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1989–2005Tamil Union C&AC
1998–2004Moors SC
ప్రధాన కోచ్‌గా
Yearsజట్టు
2005–2006United Arab Emirates
2009–2010Sri Lanka A
2011–2013న్యూ సౌత్ వేల్స్
2013/14Sydney Thunder
2014–2017Bangladesh
2017–2019Sri Lanka
2023–Bangladesh
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 26 35 207 96
చేసిన పరుగులు 1,274 669 10,862 2,203
బ్యాటింగు సగటు 29.62 20.90 36.44 27.88
100లు/50లు 0/8 0/4 20/61 0/16
అత్యుత్తమ స్కోరు 83 66 191 93
వేసిన బంతులు 1,962 954 22,359 2,663
వికెట్లు 17 14 425 59
బౌలింగు సగటు 46.41 50.64 22/09 29.69
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 12 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 4/66 4/57 8/29 4/18
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 6/8 161/– 27/–
మూలం: Cricinfo, 2014 మే 19

ఉపుల్ చండికా హతురుసింగ (జననం 1968, సెప్టెంబరు 13) శ్రీలంక క్రికెట్ కోచ్, మాజీ ఆటగాడు. ఆల్ రౌండర్‌గా 1991 నుండి 1999 వరకు శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

తొలి జీవితం

[మార్చు]

హతురుసింగ కొలంబోలో జన్మించాడు. తమిళ యూనియన్, మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ కోసం క్లబ్ క్రికెట్ ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో శ్రీలంక తరపున 26 టెస్టులు, 35 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. 1992, 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లలో జట్టు సభ్యుడిగా ఉన్నాడు.

కోచింగ్ కెరీర్

[మార్చు]

హతురుసింఘ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2005–2006), బంగ్లాదేశ్ (2014–2017), శ్రీలంక (2017–2019) తదితర జట్టులకు ప్రధాన కోచ్ ఉన్నాడు. 2023లో బంగ్లాదేశ్‌కు మళ్లీ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు. న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ థండర్‌తో కలిసి ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా కూడా ఉన్నాడు.

బంగ్లాదేశ్ (మొదటిసారి)

[మార్చు]

2014 మేలో 2014 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 తర్వాత రాజీనామా చేసిన షేన్ జుర్గెన్‌సెన్ స్థానంలో హతురుసింగ బంగ్లాదేశ్ జాతీయ జట్టు కోచ్‌గా ఎంపికయ్యాడు.[1][2] 2017 వరకు భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ విజయాలు, శ్రీలంక (దూరంగా), ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై టెస్ట్ విజయాలతో బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఇప్పటివరకు పాల్గొన్న అత్యంత విజయవంతమైన కోచ్ గా నిలిచాడు. ఇతని పదవీకాలంలో, బంగ్లాదేశ్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంది. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది.[3]

బంగ్లాదేశ్ కోచ్‌గా
మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా
టెస్ట్ 21 6 11 4
వన్డే 51 25 23 3
టీ20 29 10 19 2

శ్రీలంక

[మార్చు]

2017 నవంబరు 9న బంగ్లాదేశ్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేశాడు. 2018 భారత పర్యటన తర్వాత జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉంటాడని డిసెంబరు8న శ్రీలంక క్రికెట్ ప్రకటించింది.[4]

శ్రీలంక కోచ్‌గా
మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా
టెస్ట్ 21 6 11 4
వన్డే 44 10 29 5
టీ20 12 4 8 0

బంగ్లాదేశ్ (రెండవసారి)

[మార్చు]

2023 జనవరి 31న మళ్ళీ బంగ్లాదేశ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు.[5] మొదటి అసైన్‌మెంట్‌లో, బంగ్లాదేశ్ ప్రపంచ టీ20 ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మొదటిసారి 3-0తో వైట్‌వాష్ చేసింది.

బంగ్లాదేశ్ కోచ్‌గా
మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా
టెస్ట్ 2 2 0 0
వన్డే 12 6 4 2
టీ20 8 7 1 0

మూలాలు

[మార్చు]
  1. (19 May 2014). "Hathurusingha to be Bangladesh coach" – ESPNcricinfo. Retrieved 2023-08-31.
  2. Malcolm Conn (19 May 2014). "Sydney Thunder in search of new coach as Chandika Hathurusingha takes charge of Bangladesh"The Daily Telegraph (Sydney). Retrieved 2023-08-31.
  3. "'We are equipped with both spin and pace' – Hathurusingha". ESPNcricinfo. Retrieved 2023-08-31.
  4. "SLC to appoint Chandika Hathurusinghe as Head Coach 2017-2019". Sri Lanka Cricket. Archived from the original on 9 December 2017. Retrieved 2023-08-31.
  5. Azam, Atif (1 February 2023). "Hathurusingha named Bangladesh head coach". Cricbuzz.

బాహ్య లింకులు

[మార్చు]