రిచీ రిచర్డ్‌సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిచీ రిచర్డ్‌సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రిచర్డ్ బెంజమన్ రిచర్డ్‌సన్
జననం (1962-01-12) 1962 జనవరి 12 (వయసు 61)
Five Islands Village, Antigua and Barbuda
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm medium pace
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు West Indies
టెస్టు అరంగ్రేటం(cap 180) 24 November 1983 v India
చివరి టెస్టు 24 August 1995 v England
వన్డే లలో ప్రవేశం(cap 41) 17 December 1983 v India
చివరి వన్డే 14 March 1996 v Australia
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1981–1996 Leeward Islands
1993–1994 Yorkshire
1996–1997 Northern Transvaal
1997–1998 Windward Islands
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODIs FC LA
మ్యాచ్‌లు 86 224 234 313
సాధించిన పరుగులు 5,949 6,248 14,618 8,458
బ్యాటింగ్ సగటు 44.39 33.41 40.71 31.67
100s/50s 16/27 5/44 37/68 6/59
ఉత్తమ స్కోరు 194 122 194 122
బాల్స్ వేసినవి 66 58 914 88
వికెట్లు 0 1 13 2
బౌలింగ్ సగటు 46.00 33.92 42.50
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 1 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 0/0 1/4 5/40 1/4
క్యాచులు/స్టంపింగులు 90/– 75/– 207/– 94/–
Source: Cricket Archive, 19 October 2010

వెస్టిండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడైన రిచీ రిచర్డ్‌సన్ (Richard Benjamin Richardson) 1962, జనవరి 12న ఆంటిగ్వాలో జన్మించాడు. ఇతడు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 1983-84లో భారతపర్యటన సమయంలో క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించాడు. వివియన్ రిచర్డ్స్ తర్వాత వెస్టిండీన్ క్రికెట్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టినాడు. 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్య్వహరించి 11 టెస్టులను గెలిపించాడు. నాలుగేళ్ళ అతని నాయకత్వ సమయంలో వెస్టిండీస్ ఒకే ఒక్క సీరీస్ 1995లో ఆస్ట్రేలియాతో ఒడిపోయింది. బ్రియాన్ లారా ఇతని సమయంలోనే ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

రిచర్డ్‌సన్ 86 టెస్టులు ఆడి 44.39 సగటుతో 5949 పరుగులు సాధించాడు. 16 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు నమోదుచేశాడు. అందులో ఆస్ట్రేలియా పైనే 9 సెంచరీలు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 194 పరుగులు 1989లో గుయానాలో భారతజట్టుపై సాధించాడు.

వన్డేలలో 224 మ్యాచ్‌లు ఆడి 33.41 సగటుతో 6248 పరుగులు చేసాడు. ఇందులో 5 సెంచరీలు, 44 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 122 పరుగులు. రిచర్డ్‌సన్ 1987, 1992, 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో కూడా పాల్గొన్నాడు.

బయటి లింకులు[మార్చు]