Jump to content

కార్ల్ హూపర్

వికీపీడియా నుండి
కార్ల్ హూపర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కార్ల్ లేవ్‌లిన్ హూపర్
పుట్టిన తేదీ (1966-12-15) 1966 డిసెంబరు 15 (వయసు 58)
జార్జ్‌టౌన్, గయానా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 190)1987 డిసెంబరు 11 - ఇండియా తో
చివరి టెస్టు2002 నవంబరు 3 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 50)1987 మార్చి 18 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2003 మార్చి 4 - Kenya తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.4
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1983–1987Demerara
1984–2003Guyana
1992–1998Kent
2003–2004Lancashire
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 102 227 339 457
చేసిన పరుగులు 5,762 5,761 23,034 13,357
బ్యాటింగు సగటు 36.46 35.34 47.68 40.11
100లు/50లు 13/27 7/29 69/104 15/85
అత్యుత్తమ స్కోరు 233 113* 236* 145
వేసిన బంతులు 13,794 9,573 46,464 19,718
వికెట్లు 114 193 555 396
బౌలింగు సగటు 49.42 36.05 35.30 34.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 18 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/26 4/34 7/93 5/41
క్యాచ్‌లు/స్టంపింగులు 115/– 120/– 375/– 242/–
మూలం: ESPNcricinfo, 2008 డిసెంబరు 29

1966, డిసెంబర్ 15న జన్మించిన కార్ల్ హూపర్ (Carl Llewellyn Hooper) వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 దశాబ్దం చివరిలో గార్డన్ గ్రెనిడ్జ్, డెస్మండ్ హేన్స్, మాల్కం మార్షల్, కోర్ట్నీ వాల్ష్ దిగ్గజాలు ఆడే సమయంలో వెస్ట్‌ఇండీస్ జట్టులో ప్రవేశించి దాదాపు 21 సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడినాడు.

టెస్ట్ క్రికెట్

[మార్చు]

మొత్తం తన టెస్ట్ కెరీర్ లో 102 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హూపర్ అత్యధిక స్కోరు 233 పరుగులు 2001లో భారత జట్టుపై సాధించాడు.[1] హూపర్ టెస్టులలో మొత్తం 5762 పరుగులు సాధించాడు. అందులో 13 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 114 వికెట్లు సాధించాడు.

వన్డే క్రికెట్

[మార్చు]

వన్డేలలో హూపర్ 227 మ్యాచ్‌లు ఆడి 5761 పరుగులు సాధించాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 133 నాటౌట్. వన్డేలలో అతను 7 సెంచరీలు, 29 అర్థ సెంచరీలు సాధించాడు. 193 వికెట్లను కూడా తన బౌలింగ్‌లో పడగొట్టాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్

[మార్చు]

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హూపర్ గుయానా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో కూడా కెంట్, లాంకాస్టర్ తరఫున ఆడినాడు. 2003లో హూపర్ అన్ని 18 కౌంటీ జట్టులపై సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[2]

టెస్టులలోనూ, వన్డేలలోనూ 5000 పైగా పరుగులుచేసి, రెండింటిలోనూ 100 కు పైగా వికెట్లు సాధించి, రెండింటిలోనూ 100 కు పైగా క్యాచ్‌లు పట్టి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. http://uk.cricinfo.com/db/ARCHIVE/2001-02/IND_IN_WI/SCORECARDS/IND_WI_T1_11-15APR2002.html భారత్ లో టెస్ట్ సీరీస్
  2. http://www.cricinfo.com/asksteven/content/story/261028.html%7Ctitle=The fastest hundreds, and a Case history | date=2 October 2006 | publisher=Cricinfo | last=Lynch | first=Steven | accessdate=2007-04-27
  3. Cricinfo - Records - Test Matches - most matches and Most catches - One-day Internationals, retrieved 29 July 2007