విన్‌స్టన్ బెంజిమన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Winston Keithroy Matthew Benjamin | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | All Saints, Antigua and Barbuda | 1964 డిసెంబరు 31|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm fast | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1987 నవంబరు 25 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 ఏప్రిల్ 29 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1986 అక్టోబరు 17 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 మే 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1985–1995 | Leeward Islands | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1986–1993 | Leicestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1994–1996 | Hampshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 20 |
1964, డిసెంబర్ 31న జన్మించిన విన్‌స్టన్ బెంజమిన్ (Winston Benjamin) వెస్టీండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 21 టెస్టు మ్యాచ్‌లకు, 85 వన్డే మ్యాచ్‌లకు ఇతడు వెస్టీండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. బెంజమిన్ తన తొలి టెస్టును 1987-88లో భారత్ పై ఢిల్లీలో ఆడినాడు.
టెస్ట్ క్రికెట్
[మార్చు]బెంజిమన్ 1987-88లో తొలిసారిగా భారత్ పై ఢిల్లీలో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. 8 టెస్టులు ఆడిన తరువాత 1993 వరకు జట్టులో స్థానం దక్కలేదు. రెండు సంవత్సరాలు ఆడిన తరువాత మళ్ళీ 1994-95లో ఆస్ట్రేలియా పర్యటన తరువాత ఉధ్వాసనకు గురైనాడు. మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు, 61 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 85 పరుగులు. టెస్ట్ బౌలింగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 46 పరుగులకు 4 వికెట్లు.
వన్డే క్రికెట్
[మార్చు]బంజిమన్ మొత్తం 85 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 298 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.
ప్రపంచ కప్ క్రికెట్
[మార్చు]బెంజిమన్ 1987, 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
కోచ్‌గా
[మార్చు]క్రీడాజీవితం అత్యున్నత దశ తరువాత కోచ్‌గా కొత్త అవతారం ఎత్తి లీవార్డ్ ఐలాండ్ జట్టుకు కోచ్‌గా కొద్దికాలం వ్యవహరించాడు. కాని 2005 జూన్లో తొలిగించబడ్డాడు.[1]