వివియన్ రిచర్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివియన్ రిచర్డ్స్
Vivian richards.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం/ఆఫ్‌బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 121 187
పరుగులు 8540 6721
బ్యాటింగ్ సగటు 50.23 47.00
100లు/50లు 24/45 11/45
అత్యుత్తమ స్కోరు 291 189*
ఓవర్లు 861 940
వికెట్లు 32 118
బౌలింగ్ సగటు 61.37 35.83
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 2
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 2/17 6/41
క్యాచ్ లు/స్టంపింగులు 122/- 100/-

As of ఆగస్ట్ 18, 2007
Source: cricketarchive.com

1952, మార్చి 7న ఆంటిగ్వా లోని సెయింట్ జాన్స్ లో జన్మించిన వివియన్ రిచర్డ్స్ పూర్తి పేరు ఐజాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్ (Sir Isaac Vivian Alexander Richards). అయిననూ అతడు వివియన్ లేదా వివ్ రిచర్డ్స్ గానే ప్రసిద్ధి చెండాడు. ఇతడు వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 2002లో వివ్ రిచర్డ్స్ వన్డేలలో సర్వకాల అత్యున్నత బ్యాట్స్‌మెన్‌గా గుర్తించబడ్డాడు. కాని 2003లో భారత్ కు చెందిన సచిన్ టెండుల్కర్ కు ప్రథమస్థానం ఇచ్చి ఇతనికి ద్వితీయస్థానంతో సరిపెట్టారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

వివియన్ రిచర్డ్స్ తన తొలి టెస్ట్‌ జీవితాన్ని 1974లో భారత్‌పై బెంగుళూరులో ఆరంగేట్రం చేసాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో 192 పరుగులతో నాటౌట్‌గా నిల్చాడు. టెస్టులలో అతడు మొత్తం 121 మ్యాచ్‌లు ఆడి 50.23 సగటుతో 8540 పరుగులు చేసాడు. అందులో 24 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 291 పరుగులు. టెస్టులలో 50 సార్లు వెస్టిండీస్ కు నాయకత్వం వహించి 24 సార్లు గెలిపించాడు. కెప్టెన్‌గా ఓడిపోయినవి కేవలం 8 మాత్రమే. ఇప్పటివరకు కూడా ఒక్క టెస్ట్ సీరీస్ ఓడిపోని వెస్ట్‍ఇండీస్ కెప్టెన్‌గా రికార్డు అతని పేరిటే ఉంది. 1986లో ఆంటిగ్వాలో ఇంగ్లాండుకు విరుద్ధంగా టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి టెస్ట్ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించినవాడిగా రికార్డు సృష్టించాడు. టెస్టులలో వివ్ 84 సిక్సర్లు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 291 వెస్ట్‌ఇండీస్ తరఫున ఆరవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1976 సంవత్సరం అతనికి కలిసివచ్చిన సంవత్సరం. టెస్టులలో 90.00 సగటుతో 11 సెంచరీలతో మొత్తం 1710 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోరు 291 పరుగులు కూడా ఇదే కాలంలో సాధించబడింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఇతని రికార్డు 30 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి 2006 నవంబర్ 30నాడు పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ యూసుఫ్ ఈ రికార్డును అధికమించాడు.

వన్డే క్రికెట్[మార్చు]

వివ్ రిచర్డ్స్ 187 వన్డేలు ఆడి 6721 పరుగులు సాధించాడు. అతని తొలి వన్డే శ్రీలంకపై 1975లో ఆడినాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 189 నాటౌట్. 11 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు కూడా వన్డేలలో సాధించాడు. 1986-87 లో ఒకే వన్డేలో సెంచరీ, 5 వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు. 2005 వరకు వన్డేలలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా గుర్తించబడ్డాడు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

1975, 1979, 1983. 1987 ప్రపంచ్‌కప్ క్రికెట్‌లో వివ్ రిచర్డ్స్ వెస్ట్‌ఇండీస్ జట్టుకు ఇతను ప్రాతినిధ్యం వహించాడు. 1975, 1979 లో జరిగిన మొదటి, రెండో ప్రపంచ కప్‌ లను గెలిచిన వెస్ట్‌ఇండీస్ జ ట్టు లో ఇతను కీలక ఆటగాడు. 1979లో లార్డ్స్ లో జరిగిన ఫైనల్ లో వివ్ సెంచరీతో వెస్ట్‌ఇండీస్ కు విజయం చేకూర్చాడు.1983లో కూడా ఫైనల్ వరకు వచ్చి కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ చేతిలో పరాజయం పొందినారు.

వ్యక్తిగతం[మార్చు]

1980లలో వివియన్ రిచర్డ్స్ ఒక భారతీయ సినిమా నటి నీనా గుప్తా తో సంబంధం పెట్టుకుని మసాబ గుప్తా అనే కుమార్తెను కన్నారు.

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

  • 1977లో వివ్ రిచర్డ్స్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
  • 2000లో విజ్డెన్ శతాబ్దపు అత్యున్నత క్రికెటర్లలో 5 వ స్థానం పొందినాడు.

బయటి లింకులు[మార్చు]