Jump to content

ఆండీ రాబర్ట్స్

వికీపీడియా నుండి
ఆండీ రాబర్ట్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Anderson Montgomery Everton Roberts
పుట్టిన తేదీ (1951-01-29) 1951 జనవరి 29 (వయసు 73)
ఉర్లింగ్స్ గ్రామం, ఆంటిగ్వా
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడు చేయి వాటం
బౌలింగుకుడి చేయి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 149)1974 మార్చి 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1983 డిసెంబరు 24 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 15)1975 జూన్ 7 - శ్రీలంక తో
చివరి వన్‌డే1983 7 డెసెంబరు - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1970–1984Leeward Islands
1970–1981Combined Islands
1973–1978Hampshire
1976New South Wales
1981–1984Leicestershire
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 47 56 228 195
చేసిన పరుగులు 762 231 3,516 1,091
బ్యాటింగు సగటు 14.94 10.04 15.69 14.54
100లు/50లు 0/3 0/0 0/10 0/1
అత్యుత్తమ స్కోరు 68 37* 89 59*
వేసిన బంతులు 11,135 3,123 42,760 9,841
వికెట్లు 202 87 889 274
బౌలింగు సగటు 25.61 20.35 21.01 18.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 11 1 47 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 7 0
అత్యుత్తమ బౌలింగు 7/54 5/22 8/47 5/13
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 6/– 52/– 33/–
మూలం: క్రికెట్ ఆర్కివ్, 2009 జనవరి 12

1951, జనవరి 29 న జన్మించిన ఆండీ రాబర్ట్స్ (Anderson Montgomery Everton 'Andy' Roberts) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు ఒకే టెస్ట్ ఇన్నింగ్సులో 7 వికెట్లను రెండు సార్లు సాధించాడు. 970 దశకం రెండో భాగం నుంచి 1980 దశకం తొలి భాగం వరకు వెస్ట్‌ఇండీస్ కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ చతుర్దయంలో ఇతడు ఒకడు. మిగితా ముగ్గురు మైకెల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, కొలిన్ క్రాఫ్ట్. వెస్ట్‌ఇండీస్ విజయం సాధించిన 1975, 1979 ప్రపంచ కప్ క్రికెట్‌కు ఇతడు ప్రాతినిధ్యం వహించాడు. ఫైనల్లో భారత్ చేతిలో భంగపడిన 1983 ప్రపంచ కప్‌లో కూడా ఆడినాడు.

రాబర్ట్స్ 47 టెస్టులు ఆడి 202 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 11 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. టెస్టులలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 54 పరుగులకు 7 వికెట్లు. వన్డేలలో 56 మ్యాచ్‌లు ఆడి 87 వికెట్లు పడగొట్టినాడు. వన్డేలలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.