క్లైవ్ లాయిడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లైవ్ లాయిడ్
Clive Hubert Lloyd.jpg
దస్త్రం:West Indies Cricket Board Flag.svg West Indies
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి {{{batting style}}}
బౌలింగ్ శైలి కుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 110 87
పరుగులు 7515 1977
బ్యాటింగ్ సగటు 46.67 39.53
100లు/50లు 19/39 1/11
అత్యుత్తమ స్కోరు 242* 102
ఓవర్లు 286 59.4
వికెట్లు 10 8
బౌలింగ్ సగటు 62.20 26.25
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు n/a
అత్యుత్తమ బౌలింగ్ 2/22 2/4
క్యాచ్ లు/స్టంపింగులు 90/- 39/-

As of నవంబర్ 10, 2005
Source: [1]

1944, ఆగస్టు 31గుయానా లోని జార్జ్‌టౌన్ లోజన్మించిన క్లైవ్ లాయిడ్ (Clive Hubert Lloyd) వెస్ట్‌ఇండీస్కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1974 నుంచి 1985 వరకు వెస్టీండీస్ కెప్టెన్‌గా ఉండి క్రికెట్ లో అగ్రరాజ్యంగా చేశాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యున్నత కెప్టెన్‌గా అతనికి ఖ్యాతి లభించింది. అతని నాయకత్వంలో వెస్టీండీస్ ఒక దశలో వరుసగా 27 టెస్టులలో పరాజయం పొందలేదు. అందులో 11 వరస విజయాలు. ( ఈ కాలంలో ఒక టెస్టుకు వివియన్ రిచర్డ్స్ నాయకత్వం వహించాడు). లాయిడ్ 3 ప్రపంచ కప్ లలో వెస్టీండీస్ కు నాయకత్వం వహించాడు. అందులో 1975, 1979 లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ కప్‌లలో వెస్టీండీస్ విజయం సాధించింది. 1983లో జరిగిన ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్ వరకు వచ్చి కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ జట్టు పై ఓడిపోయారు.

లాయిడ్ టెస్ట్ క్రికెట్‌లో 110 మ్యాచ్‌లు ఆడి 46.67 సగటుతో 7515 పరుగులు సాధించాడు. అతని తొలి టెస్ట్ 1966లో ఆడినాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 242 నాటౌట్. టెస్ట్ క్రికెట్‌లో 19 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు సాధించాడు.

వన్డే క్రికెట్‌లో లాయిడ్ 87 మ్యాచ్‌లు ఆడి 1977 పరుగులు 39.53 సగటుతో సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలో అతని అత్యధిక స్కోరు 102 పరుగులు.

1971లో లాయిడ్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.

రిటైర్‌మెంట్ తర్వాత లాయిడ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2001 నుంచి 2006 వరకు ఐ.సి.సి.మ్యాచ్ రెఫరీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతడు వెస్టీండీస్ క్రికెట్ మేనేజర్‌గా ఉన్నాడు.