గార్డన్ గ్రీనిడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గార్డన్ గ్రీనిడ్జ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కద్బర్ట్ గార్డన్ గ్రీనిడ్జ్
పుట్టిన తేదీ (1951-05-01) 1951 మే 1 (వయసు 72)
బ్లాక్ బెస్, సెయింట్ పీటర్, బార్బడోస్
బ్యాటింగుకుడి చేయి
బౌలింగుకుడి చేయి మీడియం/ఆఫ్ బ్రేక్
పాత్రOpening Batsman
బంధువులుకార్ల్ గ్రీనిడ్జ్ (కుమారుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 150)1974 నవంబరు 22 - ఇండియా తో
చివరి టెస్టు1991 ఏప్రిల్ 27 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 16)1975 జూన్ 11 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1991 మే 25 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1973–1991బార్బడోస్
1990స్కాట్లాండ్
1970–1987హాంప్‌షైర్
1987MCC
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే FC LA
మ్యాచ్‌లు 108 128 523 440
చేసిన పరుగులు 7,558 5,134 37,354 16,349
బ్యాటింగు సగటు 44.72 45.03 45.88 40.56
100లు/50లు 19/34 11/31 92/183 33/94
అత్యుత్తమ స్కోరు 226 133* 273* 186*
వేసిన బంతులు 26 60 955 286
వికెట్లు 1 18 2
బౌలింగు సగటు 45.00 26.61 105.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/21 5/49 1/21
క్యాచ్‌లు/స్టంపింగులు 96/– 45/– 516/– 172/–
మూలం: CricketArchive, 2009 జనవరి 24
గార్డన్ గ్రీనిడ్జ్

గార్డన్ గ్రీనిడ్జ్ (Cuthbert Gordon Greenidge) వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1951, మే 1న బార్బడస్లో జన్మించాడు. గ్రీనిడ్జ్ వెస్టీండీస్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా 1974 నుంచి 1991 వరకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి తొలి టెస్ట్ మ్యాచ్ భారత్ పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంగేట్రం చేసాడు. గ్రీనిడ్జ్ 108 టెస్టులు ఆడి 44.72 సగటుతో 7558 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 128 మ్యాచ్‌లు ఆడి 45.03 సగటుతో 5134 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు సాధించాడు. 1975, 1979, 1983 ప్రపంచ కప్ క్రికెట్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.

అతని యొక్క ఉత్తమ ప్రదర్శన 1984లో ఇంగ్లాండుతో జరిగిన సీరీస్‌లో సాధించాడు. ఆ సీరీస్ లోలార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో, ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన నాల్గవ టెస్టులో రెండింటిలోనూ డబుల్ సెంచరీలు సాధించాడు. ఆ సీరీస్‌లో వెస్టీండీస్ 5-0 తేడాతో ఇంగ్లాండును చిత్తు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించిన తరువాత 1997లో బంగ్లాదేశ్కు కోచ్‌గా వ్యవహరించాడు. అతని మార్గదర్శకత్వంలో 1997లో బంగ్లాదేశ్ ఐ.సి.సి.ట్రోఫీని గెలిచింది. 1999లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌కు కూడా అర్హత పొందినది.