1999
స్వరూపం
1999 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 |
దశాబ్దాలు: | 1970లు - 1980లు - 1990లు - 2000లు - 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జనవరి
[మార్చు]- జనవరి 1: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
- జనవరి 3: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి
[మార్చు]- ఫిబ్రవరి 2: వెనెజులా అధ్యక్షుడిగా హ్యూగో చావెజ్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
మార్చి
[మార్చు]- హంగేరీ, పోలెండ్, చెక్ రిపబ్లిక్లు నాటోలో ప్రవేశించాయి.
ఏప్రిల్
[మార్చు]- ఏప్రిల్ 17 : వాడుకరి:ARUVA RAMATEJA పుట్టిన రోజు.
- ఏప్రిల్ 30: కంబోడియా ఆసియాన్‌లో 10వ సభ్యదేశంగా చేరింది.
మే
[మార్చు]- మే 5: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-98 రెండో ఎడిషన్‌ను విడుదల చేసింది.
- మే 13: ఇటలీ అధ్యక్షుడిగా కార్లో అజెగిలో సియాంపి ఎన్నికయ్యాడు.
- మే 17: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎహుడ్ బరాక్ ఎన్నికయ్యాడు.
జూన్
[మార్చు]- జూన్ 21: ఆపిల్ కంప్యూటర్ తొలి ఐబుక్‌ను విడుదల చేసింది.
సెప్టెంబర్
[మార్చు]- సెప్టెంబర్ 14: కిరిబతి, నౌరూ, టోంగా దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ప్రవేశించాయి.
అక్టోబర్
[మార్చు]- అక్టోబర్ 12: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది.
డిసెంబర్
[మార్చు]- డిసెంబర్ 24: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 5: వాసిలీ లియోంటిఫ్, ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 1: మధురాంతకం రాజారాం, రచయిత. (మ.1930)
- ఏప్రిల్ 13: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924)
- ఏప్రిల్ 13: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935)
- మే 16: మారొజు వీరన్న, బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎస్ఎఫ్) స్థాపకుడు.
- మే 27: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927)
- మే 28: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920)
- జూన్ 12: జలగం వెంగళరావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1921)
- జూలై 28: ట్రిగ్వే హవెల్మొ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఆగష్టు 25: సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924)
- సెప్టెంబరు 4: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966)
- సెప్టెంబరు 17: రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (జ.1909)
- డిసెంబర్ 26: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (జ.1918)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: రవి శంకర్, అమర్త్య సేన్, గోపీనాధ్ బొర్దొలాయి
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : హృషికేష్ ముఖర్జీ.
- జ్ఞానపీఠ పురస్కారం : నిర్మల్ వర్మ.
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం:గెరార్డస్ హూహ్ట్, మార్టినస్ వెల్ట్‌మన్.
- రసాయనశాస్త్రం: అహ్మద్ జెవేల్.
- వైద్యం: గుంటర్ బ్లోబెల్.
- సాహిత్యం: గుంటర్ గ్రాస్.
- శాంతి: మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ ముండెల్.