1908
స్వరూపం
1908 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1905 1906 1907 - 1908 - 1909 1910 1911 |
దశాబ్దాలు: | 1880లు 1890లు 1900లు 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 27: నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్‌లో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 9: ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది.
- సెప్టెంబర్ 28: మూసీ నదికి వరదల మూలంగా హైదరాబాద్‌లో తీవ్రంగా ఆస్తి నష్టం.
జననాలు
[మార్చు]- జనవరి 1: లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (మ.1988)
- జనవరి 17: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
- ఫిబ్రవరి 4: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
- మార్చి 1: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకులు. (మ.1986)
- మార్చి 30: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
- ఏప్రిల్ 5: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
- ఏప్రిల్ 26: సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992)
- జూన్ 5: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)
- జూన్ 10: ఈశ్వరప్రభు, హేతువాది. [మ. ?]
- జూలై 7: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ.1970)
- ఆగష్టు 5: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (మ.1975)
- ఆగష్టు 24: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931)
- ఆగష్టు 27: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
- సెప్టెంబరు 3: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
- సెప్టెంబరు 8: చెలికాని అన్నారావు, తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారి, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
- అక్టోబరు 1: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
- అక్టోబరు 2:పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
- అక్టోబరు 6: ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
- అక్టోబరు 10: ముదిగొండ లింగమూర్తి, తొలి తరం సినిమా నటుడు.
- అక్టోబర్ 15: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.2006)
- నవంబర్ 8: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.2006)
- నవంబర్ 16: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)
- డిసెంబరు 1: నార్ల వెంకటేశ్వరరావు, తెలుగునాట పాత్రికేయులు, రచయిత. (మ.1985)
- డిసెంబరు 9: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
మరణాలు
[మార్చు]- జనవరి 17: లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (జ.1908)
- జూన్ 24: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- ఆగష్టు 11: ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. (జ.1889)
- ఆగష్టు 17: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966)
- ఆగష్టు 25: హెన్రీ బెక్వెరెల్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.