దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు.[1]2024 mithun Chakraborty
చరిత్ర
[మార్చు]భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో జన్మించాడు. బొంబాయి లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్‌లలో అతను విద్యాభ్యాసం చేశాడు.
1896లో అతను బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూశాడు. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా అతను సినీపరిశ్రమకు తిరిగి ఖర్చుచేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను అతను పెద్దగా పట్టించుకోలేదు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషిచేశాడు.
అవార్డు వివరాలు
[మార్చు]1969లో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లీశ్వరి, బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం.
బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే.
ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలు
[మార్చు]- 1969 - దేవికా రాణి, నటి
- 1970 - బి.ఎన్.సర్కార్, నిర్మాత
- 1971 - పృథ్వీరాజ్ కపూర్, నటుడు
- 1972 - పంకజ్ మాలిక్, సంగీత దర్శకుడు గాయకుడు
- 1973 - సులోచన
- 1974 - బి.ఎన్.రెడ్డి, దర్శకనిర్మాత
- 1975 - ధీరేన్ గంగూలీ, నటుడు
- 1976 - కానన్ దేవి, నటి
- 1977 - నితిన్ బోస్, దర్శకుడు
- 1978 - ఆర్.సి.బోరల్, స్క్రీన్ ప్లే
- 1979 - సోహ్రాబ్ మోడి, దర్శకనిర్మాత
- 1980 - పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు
- 1981 - నౌషాద్, సంగీత దర్శకుడు
- 1982 - ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 1983 - దుర్గా ఖోటే, నటి
- 1984 - సత్యజిత్ రే, దర్శకుడు
- 1985 - వి.శాంతారాం, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 1986 - బి.నాగిరెడ్డి, నిర్మాత
- 1987 - రాజ్ కపూర్, నటుడు, దర్శకుడు
- 1988 - అశోక్ కుమార్, నటుడు
- 1989 - లతా మంగేష్కర్, గాయని
- 1990 - ఎ.నాగేశ్వర రావు, నటుడు
- 1991 - భాల్జీ ఫెండార్కర్, గాయకుడు, సంగీత దర్శకుడు
- 1992 - భూపేన్ హజారికా, గాయకుడు, సంగీత దర్శకుడు
- 1993 - మజ్రూహ్ సుల్తాన్‌పురి, పాటల రచయిత
- 1994 - దిలీప్ కుమార్, నటుడు, గాయకుడు
- 1995 - రాజ్ కుమార్, నటుడు, గాయకుడు
- 1996 - శివాజీ గణేశన్, నటుడు
- 1997 - కవి ప్రదీప్, పాటల రచయిత
- 1998 - బి.ఆర్.చోప్రా, దర్శకుడు, నిర్మాత
- 1999 - హృషికేష్ ముఖర్జీ, దర్శకుడు
- 2000 - ఆషా భోంస్లే, గాయని
- 2001 - యష్ చోప్రా, దర్శకుడు, నిర్మాత
- 2002 - దేవానంద్, నటుడు, దర్శకుడు, నిర్మాత
- 2003 - మృణాల్ సేన్, దర్శకుడు
- 2004 - అదూర్ గోపాలక్రిష్ణన్, దర్శకుడు
- 2005 - శ్యాం బెనగళ్, దర్శకుడు
- 2006 - తపన్ సిన్హా, దర్శకుడు
- 2007 - మన్నా డే, గాయకుడు
- 2008 - వి. కె. మూర్తి, ఛాయాగ్రాహకుడు
- 2009 - డి.రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 2010 - కైలాసం బాలచందర్, దర్శకుడు
- 2011 - సౌమిత్ర ఛటర్జీ నటుడు కవి రచయిత దర్శకుడు
- 2012 - ప్రాణ్, నటుడు
- 2013 - గుల్జార్, నటుడు
- 2014 - శశికపూర్, నటుడు
- 2015 - మనోజ్ కుమార్, నటుడు, దర్శకుడు, నిర్మాత
- 2016 - కె.విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత[2]
- 2017 - వినోద్ ఖన్నా
- 2018 - అమితాబ్ బచ్చన్
- 2019 - రజనీకాంత్
- 2020 - ఆశా పరేఖ్
- 2023 - వహీదా రెహమాన్[3]
- 2024 - మిథున్ చక్రవర్తి[4]
- 2025 - మోహన్ లాల్[5]
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగు ప్రముఖులు
[మార్చు]- 1980 - పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు (తెలుగువాడైన హిందీ సినీరంగంలో చేసిన సేవలకుగాను పురస్కారం అందుకున్నాడు)
- 1974 - బి.ఎన్.రెడ్డి, దర్శకనిర్మాత
- 1982 - ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 1986 - బి.నాగిరెడ్డి, నిర్మాత
- 1990 - ఎ.నాగేశ్వర రావు, నటుడు
- 2009 - డి.రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 2016 - కె.విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత[6]
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022
[మార్చు]2022 ఫిబ్రవరి 20న ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2021లో విడుదలై విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. షేర్షా ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. 83 సినిమాలో నటించిన రణవీర్ సింగ్కు ఉత్తమ నటుడు, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్తమ నటి అవార్డులు దక్కాయి.
[7]dadasahed palke international Film fare awards- 2024
Best actor (female): rani mukarji
Best Film: javan
Best actor ( male ) sharook khan
ఇవి కూడా చూడండి
[మార్చు]- నంది పురస్కారాలు
- ఉగాది పురస్కారాలు
- రఘుపతి వెంకయ్య అవార్డు
- ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
- ఏఎన్ఆర్ జాతీయ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీ ఎల్.వి. ప్రసాద్ కు దాదా సాహెబ్ ఫాల్కే". ఆంధ్రపత్రిక. 3 June 1983. Retrieved 17 May 2021.
- ↑ ఆంధ్రజ్యోతి. "కళాతపస్వికి దాదాసాహెబ్ అవార్డు". Archived from the original on 28 April 2017. Retrieved 24 April 2017.
- ↑ Andhra Jyothy (26 September 2023). "నటిగా ఐదు దశాబ్దాల సేవలకుగానూ.. ప్రతిష్టాత్మక పురస్కారం!". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
- ↑ NT News (30 September 2024). "మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ "సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు." TV9 Telugu. 20 September 2025. Archived from the original on 20 September 2025. Retrieved 20 September 2025.
- ↑ "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే". Telugu Prabha. 21 September 2025. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.
- ↑ "Dadasaheb Phalke: అట్టహాసంగా 'దాదా ఫాల్కే' అవార్డుల వేడుక.. మూవీ ఆఫ్ ది ఇయర్‌గా 'పుష్ప'". EENADU. Retrieved 2022-02-21.