రాజ్‌కుమార్

వికీపీడియా నుండి
(రాజ్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాజ్‌కుమార్
Rajkumar kannada hero.jpg
జననం సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు
(1929-04-24) 1929 ఏప్రిల్ 24
గజనూరు,
మద్రాసు రాజ్యము,
బ్రిటీషు ఇండియా
మరణం 2006 ఏప్రిల్ 12 (2006-04-12)(వయసు 76)
బెంగుళూరు, కర్ణాటక, భారత్
స్మృతి చిహ్నాలు కంఠీరవ స్టుడియోస్[1]
ఇతర పేర్లు అన్నావ్రు, రాజ్‌కుమార్
వృత్తి నటుడు
గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1954–2005
ఎత్తు 5 ft 7 in (170 cm)
ఉద్యమం గోకాక్ ఉద్యమము[2]
జీవిత భాగస్వామి పార్వతమ్మ (1953–2006; his death)
పిల్లలు శివరాజ్‌కుమార్
రాఘవేంద్ర రాజ్‌కుమార్
పునీత్ రాజ్‌కుమార్
లక్ష్మి
పూర్ణిమ

కన్నడ కంఠీరవుడు మరియు రాజ్ కుమార్ (ఏప్రిల్ 24, 1929ఏప్రిల్ 12, 2006) గా ప్రసిద్ధి చెందిన డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

లక్షలాది అభిమానులు "డాక్టర్. రాజ్" లేదా "అన్నావ్రు" (అన్నగారు) అని పిలిచే ఈయన కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి మరియు జీవన చైత్ర ఈయన నటించిన కొన్ని మరపురాని సినిమాలు.

మొదట శ్రీ పి.బి. శ్రీనివాస్ పాడినా, తరువాత తన పాటలు తానే పాడుకున్న రాజ్ కుమార్ సంగీత స్రష్ట, పేరొందిన గాయకుడు. తను నటించిన చిత్రాలకే కాక, నేపధ్య గాయకునిగా ఇతర నటులకు కూడా గాత్ర దానం చేశారు. ఇంకా అనేక భక్తి గీతాలు కూడా పాడారు.

తెలుగులో కాళహస్తి మహాత్యం (1954) సినిమాలో భక్త కన్నప్పగా అద్భుతంగా నటించాడు.

తొలి జీవితం[మార్చు]

రాజ్ కుమార్ 1929, ఏప్రిల్ 24న అప్పటి మైసూరు రాజ్యంలోని గజనూరులో కన్నడ కుటుంబంలో జన్మించాడు.[3] ఈ గ్రామం ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కర్ణాటక సరిహద్దు వెంట ఉంది.[4][5][6] ఈయన మాతృభాష కన్నడ. తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు. తల్లి లక్ష్మమ్మ. వీరి పెద్ద కొడుకైన రాజ్‌కుమార్ కు ముత్తత్తి రాయుని (హనుమంతుడు) పేరుమీద ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు.[7]

నట జీవితము[మార్చు]

మూలాలు[మార్చు]

పురస్కారములు[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]