పైడి జైరాజ్
పైడి జైరాజ్ | |
|---|---|
| జననం | 1909 సెప్టెంబరు 28 [1] |
| మరణం | 2000 ఆగస్టు 11 (వయసు: 90) |
| జాతీయత | |
| వృత్తి | నటులు, నిర్మాత, దర్శకులు |
పైడి జైరాజ్ (ఆంగ్లము: Paidi Jairaj)(సెప్టెంబరు 28, 1909 - ఆగష్టు 11, 2000) భారత సినీరంగంలో తెలంగాణ కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత.[2][3]
తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ పేరును రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టారు.[4]
ఆయన 1929లో ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే మూకీ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ తో సమానంగా సుమారు ఏడు దశాబ్దాల పాటు ప్రముఖ నటులలో ఒకరిగా కొనసాగి చివరిగా 1995లో ‘గన్ అండ్ గాడ్’ సినిమా చేసి 86 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమ నుంచి తప్పుకున్నాడు.
పైడి జైరాజ్ భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకుగాను 1980లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కింది.[5]
తెలుగు లో మొట్టమొదటి గా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నాడు.
జననం
[మార్చు]పైడి జైరాజ్ 1909 సెప్టెంబరు 28న హైదరాబాద్ రాష్ట్రంలోని (ప్రస్తుత తెలంగాణ) సిరిసిల్లలో అచ్యుతయ్య నాయుడు, తాయారమ్మ దంపతులకు జన్మించాడు.[6] జైరాజ్ 156 చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు.
నటనా జీవితం
[మార్చు]భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు మేనత్త అవుతారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.
'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ, ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్.
సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదలైంది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే హిందీ సినిమా తెలుగులోకి అనువాదం చేయబడింది.
నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో ' సాగర్ ' చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఎక్కువగా షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి చారిత్రక పాత్రల్ని ధరించిన జైరాజ్ తెలుగు వాడై వుండి కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు.
దర్శకత్వం
[మార్చు]పైడి జైరాజ్ మెహర్, సాగర్ , మాల, ప్రతిమ అనే నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పి.జె. ఫిల్మ్స్ యూనిట్ పతాకంపై ప్రసిద్ధనటి నర్గీస్ కథానాయికగా 'సాగర్' చిత్రాన్ని 1951లో నిర్మించాడు.
అవార్డులు
[మార్చు]జైరాజ్ భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది.
కుటుంబం
[మార్చు]పి. జైరాజ్ 1940లో ఢిల్లీకి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. టీవీ నిర్మాత-దర్శకుడు రాజన్ షాహి ఆయన కుమార్తె కుమారుడు.
మరణం
[మార్చు]పి జైరాజ్ 2020 ఆగస్ట్ 11న ముంబైలో మరణించాడు.[7]
గుర్తింపులు
[మార్చు]హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు జాతీయభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచి, తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జైరాజ్ అందించిన సేవలకు గుర్తుగా రవీంద్రభారతి రెండవ అంతస్తులోని హాలును ఆధునీకరించి ‘పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్’గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.[8][9]
సినిమాలు
[మార్చు]నటుడు
[మార్చు]| సంవత్సరం | సినిమా | గమనికలు |
|---|---|---|
| 1930 | జగ్మాగ్తి జవానీ | |
| 1932 | షికారి | |
| 1933 | మాయా జాల్ | |
| పటిట్ పవన్ | ||
| ఔరత్ కా దిల్ | ||
| 1934 | మజ్దూర్ | |
| 1935 | షేర్ దిల్ ఔరత్ | |
| జీవన్ నాటకం | ||
| 1937 | తూఫానీ ఖజానా | |
| 1938 | బాబీ | |
| మధుర్ మిలన్ | ||
| 1939 | జుగారి | |
| లెదర్‌ఫేస్ | ||
| 1940 | చాంబే ది కలి | |
| 1941 | ప్రభాత్ | |
| మాలా | ||
| స్వామి | ||
| 1942 | నయీ దునియా | |
| ఖిలోనా | ||
| తమన్నా | ||
| 1943 | నయీ కహానీ | |
| హమారీ బాత్ | ||
| ప్రేమ్ సంగీత్ | ||
| 1944 | పన్నా | శ్యామ్ |
| 1945 | రహత్ | |
| 1946 | షాజహాన్ | |
| సల్గిరా | ||
| రాజ్‌పుతాని | ||
| 1947 | మన్మణి | |
| 1948 | సాజన్ కా ఘర్ | |
| అంజుమన్ | ||
| ఆజాదీ కి రాహ్ పర్ | ||
| 1949 | దరోగాజీ | |
| రూమల్ | ||
| సింగార్ | ||
| అమర్ కహానీ | ||
| 1951 | రాజ్‌పుత్ | |
| సాగర్ | ||
| 1952 | లాల్ కున్వర్ | |
| రేషమ్ | ||
| 1954 | బాద్బాన్ | |
| 1955 | తీరాండాజ్ | |
| ఇన్సానియత్ | ||
| 1956 | పరివార్ | |
| హతిమ్ తాయ్ | ||
| 1957 | ముంతాజ్ మహల్ | |
| మూడు సముద్రాలకు అతీత ప్రయాణం | పరదేశి | |
| 1959 | చార్ దిల్ చార్ రహేన్ | |
| 1960 | రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్ | మిస్టర్ సూపర్ మ్యాన్ కి వాప్సీ |
| లాల్ ఖిలా | ||
| వీర్ దుర్గాదాస్ | ||
| చాంబే ది కలి | పంజాబీ సినిమా | |
| 1961 | రజియా సుల్తానా | |
| ఆస్ కా పంచీ | ||
| జై చితోడ్ | ||
| 1962 | పిక్ పాకెట్ | |
| 1963 | రాముడికి తొమ్మిది గంటలు | |
| గుల్-ఎ-బకావాలి | ||
| 1964 | ఖుఫియా మహల్ | |
| 1965 | బాఘి హసీనా | |
| 1965 | ముజ్రిం కౌన్ ఖూని కౌన్ | |
| 1966 | మాయ | |
| 1967 | బహరోన్ కే సప్నే | |
| 1968 | నీల్ కమల్ | |
| 1970 | గుణా ఔర్ కానూన్ | |
| జీవన్ మృత్యు | ||
| 1971 | నాదాన్ | |
| చోటీ బహు | ||
| చింగారి | ||
| 1972 | షెహ్జాదా | |
| 1973 | గెహ్రీ చాల్ | |
| సూరజ్ ఔర్ చందా | ||
| ఛలియా | ||
| నాగ మేరే సాథీ | ||
| 1974 | చోర్ చోర్ | |
| ఫస్లా | ||
| 1975 | షోలే | పోలీస్ కమిషనర్ |
| కాలా సోనా | ||
| ధర్మాత్మ | ||
| జోగిదాస్ ఖుమాన్ | ||
| హిమాలయ్ సే ఊంచా | ||
| టూఫాన్ | ||
| 1976 | హేరా ఫేరి | |
| చరస్ | ||
| బైరాగ్ | ||
| నాగ చంపా | ||
| 1977 | ఛైల్లా బాబు | |
| కచ్చ చోర్ | ||
| 1978 | ముకద్దర్ కా సికందర్ | |
| డాన్ | ||
| ఆఖ్రి డాకు | ||
| ఖూన్ కా బద్లా ఖూన్ | ||
| 1979 | అహింసా | |
| ఖండన్ | ||
| నాగిన్ ఔర్ సుహాగన్ | ||
| 1980 | జ్యోతి బనే జ్వాలా | |
| చునావోటి | ||
| జజ్‌బాత్ | ||
| శివశక్తి | ||
| 1981 | ఫిఫ్టీ ఫిఫ్టీ | |
| ఖూన్ ఔర్ పానీ | ||
| క్రాంతి | ||
| 1983 | అర్ధ్ సత్య | |
| మాసూమ్ | ||
| కరాటే | ||
| పుకార్ | ||
| పాంచ్విన్ మంజిల్ | ||
| 1984 | బిండియా చంకేగి | |
| మాన్ మర్యాద | ఠాకూర్ సూరజ్‌భన్ సింగ్ | |
| ఉంచి ఉరాన్ | ||
| 1986 | జిందా లాష్ | |
| 1988 | ఖూన్ భరి మాంగ్ | |
| 1992 | లంబు దాదా | |
| 1993 | మేరీ ఆన్ | |
| 1994 | బేతాజ్ బాద్షా | |
| 1995 | గాడ్ అండ్ గన్ |
దర్శకుడు
[మార్చు]| సంవత్సరం | సినిమా | గమనికలు |
|---|---|---|
| 1945 | ప్రతిమ | |
| 1951 | సాగర్ | |
| 1959 | మోహర్ |
- కెమెరా, ఎలెక్ట్రికల్ విభాగం (4 చిత్రాలు)
- 2000 బాఘీ (అసిస్టెంట్ కెమెరా - జైరాజ్‌గా)
- 1999 జుల్మీ (అసిస్టెంట్ కెమెరా - జైరాజ్‌గా)
- 1999 అనారీ నం. 1 (సహాయక కెమెరా - జైరాజ్‌గా)
- 1995 టక్కర్ (అసిస్టెంట్ కెమెరా - జైరాజ్ గా)
- ఎడిటోరియల్ విభాగం (1 చిత్రం)
- 1976 బైరాగ్ (అసిస్టెంట్ ఎడిటర్ - జైరాజ్ గా)
- స్వంత నిర్మాణం (1 చిత్రం)
- హిందుస్థాన్ హమారా (డాక్యుమెంటరీ)
మూలాలు
[మార్చు]- ↑ "మనకు ఎరుకలేని మనోడు!". Sakshi. 27 September 2014. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ BBC News తెలుగు (23 July 2022). "పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్". Archived from the original on 14 September 2022. Retrieved 14 September 2022.
- ↑ "తెలంగాణ జాతి గర్వించదగ్గ అద్భుతమైన కళాకారుడు పైడి జయరాజ్". Mana Telangana. 28 September 2024. Archived from the original on 10 May 2025. Retrieved 10 May 2025.
- ↑ Namasthe Telangana (28 September 2021). "పైడి జైరాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
- ↑ "Meet actor who holds record for having longest film career, not Amitabh Bachchan, Raj Kapoor, Kamal Haasan, Rajinikanth" (in ఇంగ్లీష్). DNA India. 22 February 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-19. Retrieved 2008-03-21.
- ↑ "తెలుగువారి ఖ్యాతిని చాటిన పైడి జయరాజ్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్". NTV Telugu. 28 September 2021. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "భారతీయ సినీపరిశ్రమకు తెలంగాణ ముద్ర జైరాజ్". EENADU. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
- ↑ "తెలంగాణ సినీశిఖరం జైరాజ్". Namasthe Telangana. 2022-09-28. Archived from the original on 2022-09-28. Retrieved 2022-10-14.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పైడి జైరాజ్
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005
- హిందీ తెరపై తొలి తెలుగు హీరో 'పైడి జైరాజ్', ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003.
- యూట్యూబ్(వి6 టివి)లో పైడి జైరాజ్ వీడియో