నౌషాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నౌషాద్ అలీ
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలిభారతీయ శాస్త్రీయ సంగీతము
భారతీయ సినిమా సంగీతం
క్రియాశీల కాలం1940–2005

'నౌషాద్' అలీ (అ.సం.లి.వ.: nauṣād alī, ఆంగ్లం : Naushad Ali, ఉర్దూ: نوشاد علی, దేవనాగరి: नौशाद अली) (డిసెంబరు 25 1919మే 5 2006) భారత సినిమా సంగీతకారుడు.[1] బాలీవుడ్కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు.[2]

ఆయన స్వతంత్రంగా సంగీత దర్శకునిగా ప్రేమనగర్ (1940) మొట్టమొదటి సినిమా.[3] ఆయన సంగీత దర్శకునిగా విజయం సాధించిన సినిమా "రత్తన్ (1944)". దానితర్వాత 35 గోల్డెన్ జూబ్లీ హిట్స్, 12 గోల్డెన్ జూబ్లీ, 3 డైమండ్ జూబ్లీ విజయం సాధించాయి. ఆయనకు 1982లో దాదాసాహెబ్ ఫ్లాల్కే పురస్కారం, 1992 లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.[4]

జీవిత చరిత్ర

[మార్చు]

నౌషాద్ లక్నో నగరంలో పెరిగాడు, ఈ నగరం సంప్రదాయాలకు, ఉత్తరభారత సంగీతానికి సాహిత్యానికి ప్రముఖ కేంద్రం. ఇతడి తండ్రి వాహిద్ అలీ ఒక మున్షి (క్లర్కు). బాల్యంలో నౌషాద్ బారాబంకీ లోని దేవాషరీఫ్ ఉర్సు కార్యక్రమాలకు వెళుతూ వుండేవాడు. అక్కడ ప్రముఖ 'ఖవ్వాల్' (ఖవ్వాలీ పాడేవారు) లు ప్రదర్శనలు ఇచ్చేవారు. నౌషాద్ వీరిని వింటూ సంగీతం పట్ల ఉత్సుకత పెంచుకున్నాడు. నౌషాద్ క్లాసికల్ హిందుస్తానీ సంగీతం "ఉస్తాద్ గుర్బత్ ఖాన్", "ఉస్తాద్ యూసుఫ్ అలీ", "ఉస్తాద్ బబ్బన్ సాహెబ్", ఇతరుల వద్ద నేర్చుకున్నాడు. తరచూ హార్మోనియంలనూ మరమ్మత్తు చేసేవాడు.

నౌషాద్ 2006 మే 5 న ముంబాయిలో మరణించాడు. ఇతనికి ఆరుగురు కుమార్తెలు జుబేదా, ఫహమీదా, ఫరీదా, సయీదా, రషీదా, వహీదా,, ముగ్గురు కుమారులు రహమాన్ నౌషాద్, రాజు నౌషాద్, ఇక్బాల్ నౌషాద్.

రచయితగా

[మార్చు]

నౌషాద్ సంగీత దర్శకుడే గాక సాహిత్యంలోనూ దిట్ట. ఇతను వ్రాసిన పుస్తకం "ఆఠ్‌వాఁ సుర్ (ఎనిమిదవ స్వరం), ఇంకొక ఆల్బమ్ "ఆఠ్‌వాఁ సుర్ - ద అదర్ సైడ్ ఆఫ్ నౌషాద్", దీనిలో 8 గజల్లు ఉన్నాయి. ఈ గజల్లు వ్రాసింది, బాణి సమకూర్చింది నౌషాదే. ట్రాక్ లిస్టు:

  1. ఆబాదియోఁ మేఁ దష్త్ కా మన్‌జర్ భి ఆయెగా - హరిహరన్ గానం చేసాడు - 7:08
  2. ఆజ్ కిఇ బాత్ కల్ పె క్యౌఁ టాలో - హరిహరన్ & ప్రీతి ఉత్తమ్ సింగ్ - 6:17
  3. ఘటా ఛాయీ థి సావన్ ఖుల్ కె బర్సా - ప్రీతి ఉత్తమ్ సింగ్ - 7:19
  4. కభీ మెరి యాద్ ఉన్‌కో ఆతీతో హోగీ - హరిహరణ్ & ప్రీతి ఉత్తమ్ సింగ్ - 6:18
  5. ముఝ్ కో మువాఫ్ కీజియే - హరిహరణ్ - 5:35
  6. పీనేవాలే బేఖుదీ సె కామ్ లే - హరిహరణ్ & ప్రీతి ఉత్తమ్ సింగ్ - 8:13
  7. సావన్ కే జబ్ బాదల్ ఛాయే - హరిహరణ్ - 6:50
  8. తన్‌హా ఖుద్ సె బాత్ కరూఁ - ప్రీతి ఉత్తమ్ సింగ్ - 7:49

సంగీత శైలి

[మార్చు]

భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని, సినిమాలలో ఉపయోగించే రీతినిచ్చి, ఓ కొంగ్రొత్త శైలిని నాంది పలికిన వాడు నౌషాద్. అందులోనూ సాంప్రదాయబద్ధంగా, జనపదాల శైలిని సరళిని సినిమాలలో జొప్పించిన ఘనత దక్కించుకున్నవారిలోనూ ఇతను ఒకడు. బైజూ బావరా సినిమాలో ఉపయోగించిన భజన-బాణీలే ఇందుకు చక్కటి ఉదాహరణలు. "మన్ తడ్‌పత్ హరి దర్శన్ కో", "భగవాన్.. ఓ దునియాకే రఖ్‌వాలే" లాంటి పాటల బాణీలు, సంగీత శైలి పూర్తిగా సశాస్త్రీయ శైలి. పశ్చిమ సంగీత ధ్వనులు, వాయిద్య పరికరాలు అతి తక్కువగా వాడేవాడు. వాడిననూ అవలీలగా ఉపయోగించడంలో దిట్ట.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సంగీత దర్శకుడు

[మార్చు]
సినిమా సంవత్సరం దర్శకుడు నటవర్గం వ్యాఖ్య
ప్రేమ్ నగర్ 1940 మోహన్, దయారామ్, భవాని రామానంద్, బిమలాకుమారి, హుస్న్ బాను, రాయ్ మోహన్, నాగేంద్ర, సాలు, గుల్జార్
దర్శన్ 1941 చిమన్‌లాల్ ముల్జీభాయి లుహార్, రాజ్ కపూర్, సురయ్యా
మాలా 1941 బల్వంత్ భట్ జయంత్, రోజ్, జైరాజ్, నజీర్, దయాదేవి, హీరా
నయీ దునియా 1942 అబ్దుల్ రషీద్ కార్దార్ జైరాజ్, శోభనా సామర్థ్, వాస్తి, అజురీ, మజహర్ ఖాన్, హరి శివదసాని, జీవన్
శారద 1942 అబ్దుల్ రషీద్ కార్దార్ ఉల్హాస్, మెహతాబ్, వాస్తి, నిర్మల, బద్రీ ప్రసాద్
స్టేషన్ మాస్టర్ 1942 చిమ్నాలాల్ ముల్జీభాయి లుహార్ ప్రేమ్ అదీబ్, ప్రతిమాదేవి, గులాబ్
కానూన్ 1943 అబ్దుల్ రషీద్ కార్దార్ మెహతాబ్, షాహు మఢోక్
నమస్తే 1943 ముహమ్మద్ సాదిక్ సాని వస్తి, ప్రొతిమాదాస్, జగదీష్ సేథీ, మిశ్రా
సంజోగ్ 1943 అబ్దుల్ రషీద్ కార్దార్ చార్లీ, అన్వర్ హుసేన్, మెహతాబ్
గీత్ 1944 ఎస్.యూ. సన్నీ షాహు మొడక్, నిర్మల, అమీర్ అలీ
జీవన్ 1944 మొహమ్మద్ సన్నీ వస్తి, మెహతాబ్, బద్రీప్రసాద్, అన్వర్, శ్యాంకుమార్
పహలే ఆప్ 1944 అబ్దుల్ రషీద్ కార్దార్ షమీమ్, వస్తి, అన్వర్ హుసేన్, జీవన్, దీక్షిత్, నిర్మాత: కార్దార్
రత్తన్ 1944 ఎస్. సాదిక్ అమీర్ బాను, కరన్ దేవన్, స్వర్ణలత నౌషాద్ కొరకు రఫీ పాడిన మొదటి పాట, అదీ కోరస్ లో "హిందూస్తాన్ కే హమ్ హైఁ"
సన్యాసి 1945 అబ్దుల్ రషీద్ కార్దార్ షమీమ్, అమర్, మిశ్రా, శ్యాంకుమార్, నసీమ్ జూనియర్, గులామ్ ముహమ్మద్
అన్‌మోల్ ఘడి 1946 మెహబూబ్ ఖాన్ నూర్జహాన్, సురీందర్, సురయ్యా
కీమత్ 1946 నజీర్ అజ్మేరీ అమర్, సులోచనా చటర్జీ, ఏ షాహ్, శారద, బద్రీ ప్రసాద్, సోఫియా, అన్వరీ, నవాబ్
షాజహాన్ (హిందీ చిత్రం) 1946 అబ్దుల్ రషీద్ కార్దార్ కుందన్ లాల్ సైగల్, రాగిణి
దర్ద్ 1947 అబ్దుల్ రషీద్ కార్దార్ ఉమా దేవి, సురయ్యా ఉమా దేవి (హాస్యనటి "టున్ టున్") తన మొదటి పాట "అఫ్సానా లిఖ్ రహీ హూఁ" పాడింది.
ఏలాన్ 1947 మెహబూబ్ ఖాన్ హిమాలయ్‌వాలా, లీలా మిశ్రా, షాహ్‌ నవాజ్
నాటక్ 1947 ఎస్.యూ. సన్నీ సురయ్యా, అమర్, సోఫియా, కన్‌వర్, శ్యాంకుమార్, ప్రతిమాదేవి
అనోఖీ అదా 1948 మెహబూబ్ ఖాన్ సురేంద్ర, నసీంబాను, మురాద్, కక్కూ
మేలా 1948 ఎస్.యూ. సన్నీ దిలీప్ కుమార్, నర్గిస్, జీవన్
అందాజ్ 1949 మెహబూబ్ ఖాన్ దిలీప్ కుమార్, రాజ్ కపూర్, నర్గిస్
చాంద్‌నీ రాత్ 1949 మొహమ్మద్ ఎహసాన్ శ్యాం, నసీమ్ బానో
దిల్లగీ 1949 అబ్దుల్ రషీద్ కార్దార్ శ్యాం, సురయ్యా, శారద, అమీర్ బాను, అమర్
దులారీ 1949 అబ్దుల్ రషీద్ కార్దార్ సురేష్, మధుబాల, గీతాబాలి
బాబుల్ 1950 ఎస్.యూ. సన్నీ దిలీప్ కుమార్, నర్గిస్ నిర్మాత కూడా
దాస్తాన్ 1950 అబ్దుల్ రషీద్ కార్దార్ రాజ్ కపూర్, సురయ్యా, వీణా, సురేష్
దీదార్ 1951 నితిన్ బోస్ దిలీప్ కుమార్, నిమ్మి, నర్గిస్, అశోక్ కుమార్
జాదూ 1951 అబ్దుల్ రషీద్ కార్దార్ సురేష్, నళిని, జయవంత్
ఆన్ 1952 మెహబూబ్ ఖాన్ దిలీప్ కుమార్, నిమ్మి, నాదిరా
బైజూ బావరా 1952 విజయ్ భట్ భరత్ భూషణ్, మీనాకుమారి
దీవానా 1952 అబ్దుల్ రషీద్ కార్దార్ సురయ్యా, సురేష్, సుమిత్రాదేవి, శ్యాంకుమార్
అమర్ 1954 మెహబూబ్ ఖాన్ దిలీప్ కుమార్, నిమ్మి, మధుబాల
షబాబ్ 1954 మొహమ్మద్ సాదిక్ భరత్ భూషణ్, నూతన్
ఉడన్ ఖటోలా 1955 ఎస్.యూ. సన్నీ దిలీప్ కుమార్, నిమ్మీ నిర్మాత కూడా
మదర్ ఇండియా 1957 మెహబూబ్ ఖాన్ రాజ్ కుమార్, నర్గిస్, రాజేంద్ర కుమార్, సునీల్ దత్, కన్హయ్యాలాల్
సోహ్ని మహివాల్ 1958 రాజా నవాతే భరత్ భూషణ్, నిమ్మీ మహేంద్ర కపూర్ గాయకుడిగా ప్రవేశించిన మొదటి చిత్రం.
కోహినూర్ 1960 ఎస్.యూ. సన్నీ దిలీప్ కుమార్, మీనా కుమారి, కుంకుం, జీవన్
మొఘల్ ఎ ఆజం 1960 కరీం ఆసిఫ్ దిలీప్ కుమార్, మధుబాల, పృథ్వీరాజ్ కపూర్, దుర్గా ఖోటే, అజిత్ బడే గులాం అలీ ఖాన్ గాయకుడిగా మొదటి చిత్రం, "శుభ్ దిన్ ఆయో", , "ప్రేమ్ జోగన్ బన్‌కే"
గంగా జమునా 1961 నితిన్ బోస్ దిలీప్ కుమార్, వైజయంతి మాల బాలి దీనిలో పాటలు భోజ్‌పురి శైలిలో వున్నవి.
సన్ ఆఫ్ ఇండియా 1962 మెహబూబ్ ఖాన్ కమల్‌జీత్, కుంకుం, సాజిద్, సిమి గరేవాల్, జయంత్
మేరే మెహబూబ్ 1963 హర్నామ్ సింగ్ రవైల్ రాజేంద్ర కుమార్, సాధన, అమీత్, అశోక్ కుమార్, నిమ్మి
లీడర్ 1964 రాం ముఖర్జీ దిలీప్ కుమార్, వైజయంతి మాల బాలి
మైఁ హూఁ జాదూగర్ 1965 జుగల్ కిషోర్ జైరాజ్, చిత్రా, తివారి, సుజాత, మారుతి సర్దార్ మలిక్ తో కూడి సంగీతాన్నిచ్చాడు
దిల్ దియా దర్ద్ లియా 1966 అబ్దుల్ రషీద్ కార్దార్ దిలీప్ కుమార్, వహీదా రెహమాన్ , ప్రాణ్
సాజ్ ఔర్ ఆవాజ్ 1966 సుబోధ్ ముఖర్జీ సాయిరా బాను, కన్హయ్యాలాల్, జాయ్ ముఖర్జీ
పాల్కీ 1967 ఎస్.యూ. సన్నీ రాజేంద్ర కుమార్, వహీదా రెహమాన్,రెహమాన్ , జానీ వాకర్, కథా రచయిత కూడా
రాం ఔర్ శ్యాం 1967 టాపీ చాణక్య దిలీప్ కుమార్, వహీదా రెహమాన్, ముంతాజ్ , ప్రాణ్, నిరూపరాయ్, లీలా మిశ్రా
ఆద్మీ 1968 ఎ.భీంసింగ్ దిలీప్ కుమార్, వహీదా రెహమాన్, మనోజ్ కుమార్
సాథీ 1968 సి.వి. శ్రీధర్ రాజేంద్ర కుమార్, వైజయంతి మాల బాలి, సిమీ గరేవాల్
సంఘర్ష్ 1968 హర్‌నామ్ సింగ్ రవైల్ దిలీప్ కుమార్, వైజయంతిమాల, బలరాజ్ సాహ్ని
గన్‌వార్ 1970 నరేష్ కుమార్ రాజేంద్ర కుమార్, వైజయంతి మాల బాలి, నిషీ
పాకీజా 1971 కమాల్ అమ్రోహి రాజ్ కుమార్, మీనాకుమారి, అశోక్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం , కొన్ని పాటలు నౌషాద్, మిగతా ప్రధాన సంగీతం గులాం మొహమ్మద్
టాంగేవాలా 1972 నరేష్ కుమార్ ముంతాజ్, సుజిత్ కుమార్
మై ఫ్రెండ్ 1974 ఎం. రెహమాన్ రాజీవ్, ప్రేమ నారాయణ్, ఉత్పల్ దత్, జగదీప్, అసిత్ సేన్, టున్ టున్
సునెహ్రా సంసార్ 1975 ఆదుర్తి సుబ్బారావు రాజేంద్ర కుమార్, హేమా, మాలా సిన్హా
ఆయినా 1977 కె. బాలచందర్ ముంతాజ్, రాజేష్ ఖన్నా
పాన్ ఖాయె సయ్యాఁ హమార్ (భోజ్‌పురి) 1978
చంబల్ కీ రాని 1979 రాధాకాంత్ మహేంద్ర సంధు, దారా సింగ్, చాంద్ ఉస్మానీ
ధరమ్ కాంటా 1982 సుల్తాన్ అహ్మద్ రాజ్ కుమార్, వహీదా రెహమాన్, జీతేంద్ర, రీనారాయ్, రాజేష్ ఖన్నా, సులక్షణ పండిట్
లవ్ అండ్ గాడ్ 1986 కరీం ఆసిఫ్ (కె. ఆసిఫ్) సంజీవ్ కుమార్, నిమ్మి, ప్రాణ్
ధ్వని (మళయాలం) 1988 అబూ ఏ.టి. జయభారతి, జయరాం, ప్రేమ్‌ నజీర్ , శోభన
తేరే పాయల్ మేరే గీత్ 1989 రెహమాన్ నౌషాద్ గోవింద, మీనాక్షి శేషాద్రి
ఆవాజ్ దే కహాఁ హై 1990 సిబ్తె హసన్ రజ్వీ బిందు, అన్నూకపూర్, సత్యేంద్ర కపూర్
గుడ్డూ 1995 ప్రేమ్ లల్వాని షారుక్ ఖాన్ , మనీషా కొయిరాలా, ముకేష్ ఖన్నా, దీప్తినావల్, విజయేంద్ర ఘాట్‌గే, అషోక్ సరాఫ్, ప్రేమ్ లల్వాని
తాజ్ మహల్ : ఏన్ ఎటర్నల్ లవ్ స్టోరీ 2005 అక్బర్ ఖాన్ కబీర్ బేడి, మోనిషా కోయిరారా, జుల్ఫి సయ్యద్ , సోనియా
హుబ్బా ఖాతూన్ విడుదల కాలేదు మెహబూబ్ ఖాన్ సంజయ్ ఖాన్ ముహమ్మద్ రఫీ ఒక్క పాటే అందుబాటులో వుంది "జిస్ రాత్ కే ఖ్వాబ్ ఆయే".

మళయాల సినిమాలు

[మార్చు]

ఈ సినిమా నేపథ్యగాయనీ గాయకులు: యేసుదాస్, పి.సుశీల.

ఆంగ్ల సినిమాలు

[మార్చు]
  • "సచ్ ఎ లాంగ్ జర్నీ" (1998), దర్శకుడు: స్టుర్లా గున్నార్సన్, సంగీతం: జోన్నధన్ గోల్డ్‌స్మిత్, నటవర్గం: రోషన్ సేఠ్, సోనీ రజ్దాన్, ఓంపురి, నసీరుద్దీన్ షా

ఈ సినిమా ఆఖరులో పాకీజా (1971) పాట "థాడే రహియో" కైఫీ అజ్మీ రచన, లతా మంగేష్కర్ పాడిన పాటను వుంచారు.

నిర్మాత

[మార్చు]

కథా రచయిత

[మార్చు]
  • పాల్కీ (1967)

అవార్డులు

[మార్చు]

గౌరవ హోదాలు

[మార్చు]
  • సినీ సంగీత దర్శకుల సంఘానికి అధ్యక్షుడు.
  • ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ - ఛైర్మన్.
  • మహారాష్ట్ర స్టేట్ ఆంగ్లింగ్ అసోసియేషన్ - అధ్యక్షుడు.
  • ఆలమీ ఉర్దూ కాన్ఫరెన్స్ (ఢిల్లీ) - అధ్యక్షుడు.
  • స్పెషల్ ఎక్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, బాంబే - అనే బిరుదు.

మూలాలు

[మార్చు]
  1. Bharatan, Raju (2013). Naushadnama: The Life and Music of Naushad. p. 352.
  2. Raju Bharatan (1 August 2013). "Preface". Naushadnama: The Life and Music of Naushad. Hay House, Inc. pp. 48–. ISBN 978-93-81398-63-0. Retrieved 26 January 2015.
  3. Ganesh Anantharaman (January 2008). Bollywood Melodies: A History of the Hindi Film Song. Penguin Books India. pp. 31–. ISBN 978-0-14-306340-7. Retrieved 26 January 2015.
  4. CHOPRA, SATISH. "The man, his music". Retrieved 6 May 2012.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నౌషాద్&oldid=4010315" నుండి వెలికితీశారు