గుల్జార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుల్జార్
Gulzar 2008 - still 38227.jpg
జననం సంపూర్ణ సింగ్ కల్ర
(1936-08-18) ఆగస్టు 18, 1936 (వయస్సు: 81  సంవత్సరాలు)
దినా, ఝీలం జిల్లా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
వృత్తి సినీ దర్శకుడు, గీత రచయిత, సంభాషణల రచయిత, సినీ నిర్మాత, కవి
క్రియాశీలక కాలం 1961 - వర్తమానం వరకు
జీవిత భాగస్వామి(లు): రాఖీ

చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత గుల్జార్ 1936, ఆగష్టు 18 న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ మరియు పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.

సినీ గేయ రచయితగా[మార్చు]

బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాట రాశాడు. మీనా కుమారి మరణించిన తరువాత ఆమె వ్రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చు వేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత అమృతా ప్రీతమ్ రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్ (హైకూ)రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన ఉర్దూ కథా సంకలనం ధువాఁ (పొగ) కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉదారవాద కవి అయిన గుల్జార్ లైకిన్, ఆంధీ, పరిచయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

గుర్తింపులు, అవార్డులు[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గుల్జార్ నటి రాఖిని పెళ్ళి చేసుకుని విడిపోయాడు. కూతురు మేఘన కూడా సినిమా డైరెక్టర్. దేశ విభజన కాలంలో పాకిస్థాన్ నుంచి వచ్చి ముందు ఢిల్లీలో గడిపినా తరువాత ముంబయిలో స్థిరపడ్డాడు. అక్కడ ఒక గ్యారేజీలో పనిచేస్తుండగానే ప్రగతిశీల రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గుల్జార్&oldid=2063069" నుండి వెలికితీశారు