మీనా కుమారి (హిందీ నటి)
మీనా కుమారి | |
---|---|
జననం | మహెజబీన్ బేనో 1933 ఆగస్టు 1 బాంబే అధ్యక్ష పదవి, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1972 మార్చి 31 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 38)
మరణ కారణం | సిర్రోసిస్ |
Burial place | రహమతాబాద్ స్మశానవాటిక, ముంబై, మహారాష్ట్ర |
ఇతర పేర్లు | ట్రాజెడీ క్వీన్, మంజు, మీనాజీ, చైనీస్ డాల్, ఫిమేల్ గురు దత్, సిండ్రెల్లా ఆఫ్ ఇండియన్ సినిమాలు |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1939–1972 |
జీవిత భాగస్వామి | |
Writing career | |
కలం పేరు | నాజ్ |
సంతకం | |
మీనా కుమారి (1 ఆగస్టు 1933 – 31 మార్చి 1972), ప్రముఖ భారతీయ నటి, గాయకురాలు, కవయిత్రి. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమె నాజ్ అనే పేరుతో రచనలు చేసేది.[1][2] మీనా కుమారిని భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్ గా అభివర్ణిస్తారు.[3] బాలీవుడ్లో అత్యంత గొప్ప నటీమణిగా ఆమె పేరు గాంచింది. తన చిన్నతనం నుంచీ చనిపోయే దాకా ఆమె 30 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్ లుగా నిలవడం విశేషం. వాటిలో పాకీజా, సాహిబ్ బీబీ ఔర్ గులాం, మేరే అప్నే, ఆర్తీ, బైజు బవారా, పరిణీతా, దిల్ అప్నా ఔర్ ప్రీత్ప రాయీ, ఫుట్ పాత్, చార్ దిల్ చార్ రహెన్, దేరా, అజాద్, మిస్ మేరీ, శారద, దిల్ ఏక్ మందిర్, కాజల్, చిరాగ్ కహాన్ రోషిణి కహాన్, మఝ్లీ దీదీద్, ఫూల్ ఔర్ పత్తర్, బాభీ కీ చుదియాన్, యహుది, హలకు, బాద్బాన్, కోహినూర్ వంటి సినిమాలు ఇప్పటి తరానికి తెలియడం విశేషం. మీనా కుమారి బాలనటిగా, గాయనిగా కూడా చేసింది.
ఆ తరువాత దునియా ఏక్ సరై, పియా ఘర్ ఆజా, బిచ్చడే బలాం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఆమె. మీనా జీవితచరిత్ర రాసిన వినోద్ మెహతాతో ఒక దర్శకుడు మాట్లాడుతూ ట్రాజడీ కింగ్ అయిన దిలీప్ కుమార్కూడా ఆమెతో నటించేటప్పుడు ఆమె అంత బాగా చేయలేక ఇబ్బంది పడేవారు అన్నాడు.[4] ఆమెతో నటించేటప్పుడు రాజ్ కుమార్ డైలాగులు మర్చిపోయేవాడట.[5] మధుబాలకూడా మీనా కుమారి అభిమాని. ఆమె మీనాకుమారి గురించి మాట్లాడుతూ ఆమె గొంతు చాలా విలక్షణమైనది. ఏ ఇతర హీరోయిన్ కీ అలాంటి గొంతు లేదు అని అంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "April 2 1954". Filmfare. Archived from the original on 2017-05-11. Retrieved 2016-09-25.
- ↑ Tanha Chand. "Tanha Chand". Rekhta.org. Retrieved 2016-07-25.
- ↑ "Meena Kumari – "The Tragedy Queen of Indian Cinema"". Rolling Frames Film Society. Archived from the original on 2018-08-04. Retrieved 2017-04-02.
- ↑ "Meena Kumari the melancholic queen of cinema! - Sun Post". Retrieved 2016-07-25.
- ↑ "Kamal Amrohi NEVER Worked With Rajkumar After Pakeezah". YouTube. 2015-11-18. Retrieved 2016-07-25.
- ↑ "Madhubala – Her Sister's Recollections". 2016-04-16. Retrieved 2016-08-19.
- Pages using embedded infobox templates with the title parameter
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1932 జననాలు
- 1972 మరణాలు
- భారతీయ నటీమణులు
- భారతీయ కవయిత్రులు
- భారతీయ చలన చిత్ర గాయకులు
- భారతీయ మహిళా గాయకులు