ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం
వివరణజాతీయ సమైక్యతకోసం కృషికి
Locationన్యూ ఢిల్లీ
దేశంభారతదేశం Edit this on Wikidata
అందజేసినవారుభారత జాతీయ కాంగ్రెస్
మొదటి బహుమతి1985
అక్టోబరు 31, 2004న న్యూ ఢిల్లీలో ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ శ్యామ్ బెనెగల్‌కు ప్రధాన మంత్రి డాక్టర్. మన్మోహన్ సింగ్ జాతీయ సమగ్రత కోసం ఇందిరా గాంధీ అవార్డును ప్రదానం చేశారు.

ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుమీద ప్రదానం చేస్తున్న ప్రతిష్ఠాత్మక పురస్కారం. 1985 నుండి ప్రతియేటా ఇందిరా గాంధీ వర్ధంతిరోజు అంటే అక్టోబర్ 31వ తేదీన ఈ పురస్కారాన్ని భారతీయ జాతి, మత, సాంస్కృతిక, భాషా, సాంప్రదాయ గుంపులతో సాంగత్యం కలిగి ఉండి, జాతి సమైక్యతను అర్థం చేసుకుని, వృద్ధి చేస్తూ, భారతీయాత్మ అయిన ఏకత్వాన్ని ఆలోచన ద్వారా, ఆచరణ ద్వారా కృషి చేసే వ్యక్తులకు, సంస్థలకు ప్రదానం చేస్తున్నారు. కళ, విజ్ఞాన, సాంస్కృతిక, విద్యా, సాహిత్య, మత, సామాజిక సేవ, జర్నలిజం రంగాలలోని నిష్ణాతులు సభ్యులుగా కల సలహాసంఘం ఈ పురస్కారానికి విజేతను ఎన్నుకుంటుంది. ఏ సంవత్సరం ఈ పురస్కారానికి ఎన్నుకుంటారో ఆ ఏడాదికి వెనుక రెండు సంవత్సరాల కాలంలో చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పురస్కారం క్రింద 5 లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం ఇస్తారు.[1]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

ఈ పురస్కారం పొందినవారిలో స్వామి రంగనాథానంద (1987), అరుణా అసఫ్ అలీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (1987), పి.ఎన్.హస్కర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (1990), రాజీవ్ గాంధీ (మరణానంతరం), పరంధామ ఆశ్రమం (వార్ధా, మహారాష్ట్ర), ఆచార్య తులసి (1993), భీష్మాంబర్ నాథ్ పాండే (1996), బియాంత్ సింగ్ (పంజాబ్ ముఖ్యమంత్రి, మరణానంతరం) &నట్వర్ ఠక్కర్ (జంటగా), గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ (కర్ణాటక), ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ (శాంతినికేతన్), ఎ.పి.జె.అబ్దుల్ కలాం, శంకర్ దయాళ్ శర్మ (మరణానంతరం), సతీష్ ధావన్, హెచ్.వై.శారదా ప్రసాద్, రామ్‌ - రహీమ్‌ నగర్ స్లమ్‌ డ్వెల్లర్స్ అసోసియేషన్ (అహ్మదాబాద్), ఆమన్ పాఠక్ పీస్ వాలంటీర్ గ్రూప్ (అహ్మదాబాద్), రామ్‌సింహ్ సోలంకి & సునీల్ తమైచే (జంటగా), ఆచార్య మహాప్రజ్ఞ (2002), శ్యామ్ బెనగళ్ (2003), మహాశ్వేతాదేవి (2004), జావేద్ అఖ్తర్ (2005), డా.జె.ఎస్.బందూక్ వాలా & రామ్‌ పునియాని (జంటగా) (2006),[2] బలరాజ్ పురి (2009),[3] ఎ.ఆర్.రహమాన్& రామకృష్ణ మఠం (జంటగా) (2010),[4] మోహన్ ధరియా (2011),[5] గుల్జార్ (2012),[6] యం.యస్.స్వామినాధన్ (2013),[7] పి.వి.రాజగోపాల్ (2014),[8] టి.ఎం.కృష్ణ (2015-2016), చండీప్రసాద్ భట్ (2017 -2018) [9]మొదలైనవారున్నారు.

మూలాలు

[మార్చు]
  1. herenow4u.net , accessed 23 April 2008.
  2. "PM's Address at the Indira Gandhi Award for National Integration". PIB, Prime Minister's Office. 31 October 2007.
  3. "Congress Sandesh" (PDF). Archived from the original (PDF) on 22 April 2012. Retrieved 10 November 2010.
  4. "A R Rahman to receive Indira Gandhi Award". Times of India. 7 October 2010. Retrieved 7 October 2010.
  5. "Mohan Dharia gets Indira Gandhi National Integration award". Money Control. 31 October 2011.
  6. "Gulzar to get Indira Gandhi award for national integration". The Times of India. 30 September 2012. Archived from the original on 2014-02-02. Retrieved 2020-03-18.
  7. http://www.thehindubusinessline.com/news/ms-swaminathan-gets-indira-gandhi-national-integration-award/article5221437.ece
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-19. Retrieved 2020-03-18.
  9. "Pioneer of Chipko movement Chandi Prasad Bhatt gets Indira Gandhi award". The Indian Express (in Indian English). 12 October 2019. Retrieved 15 October 2019.