Jump to content

మహా శ్వేతాదేవి

వికీపీడియా నుండి
(మహాశ్వేతాదేవి నుండి దారిమార్పు చెందింది)
మహా శ్వేతాదేవి
జననం(1926-01-14)1926 జనవరి 14
ఢాకా, బ్రిటిషు ఇండియా
మరణం2016 జూలై 28(2016-07-28) (వయసు: 90)
కోల్ కత్తా
వృత్తిసామాజిక కార్యకర్త, రచయిత
సాహిత్య ప్రక్రియnovel, short story, drama, essay
విషయంDenotified tribes of India
సాహిత్య ఉద్యమంGananatya
ప్రసిద్ధ రచనలుsHajar Churashir Maa (No. 1084's Mother)
Aranyer Adhikar (The Occupation of the Forest)
Titu Mir
సంతకం

మహా శ్వేతాదేవి (జనవరి 14, 1926 - జూలై 28, 2016) ( (బెంగాలీ: মহাশ্বেতা দেবী ) పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త.

ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి, నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త.

తొలి జీవితం

[మార్చు]

1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.

రచనలు

[మార్చు]
ఎతోవా పోరాటం గెలిచాడు.

మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా రాధాకృష్ణమూర్తి అనువదించాడు. బాలలకు తేలిగ్గా అర్థమయ్యేలాగా ఈ రచన చేశారు. పిల్లలకు ఆసక్తి కలిగించేవిధంగా పుస్తకంలో చక్కని చాయాచిత్రాలు జతచేశారు. ఈ గ్రంథం వల్ల మన దేశంలోనే ఉంటూనే చాలామందికి తెలియని గిరిజనుల సంస్కృతి, వారి పోరాటాలు, జీవితంలో లక్ష్యాలు, వాటీని సాధించేందుకు వారు ఎంచుకోవాల్సిన కష్టభరిత ప్రయాణం వంటివి ఎన్నో తెలుస్తాయి.

అవార్డులు

[మార్చు]

మరణం

[మార్చు]

90 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2016, జూలై 28 గురువారం న తుది శ్వాస విడిచారు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, జాతీయం (28 July 2016). "మహాశ్వేతాదేవి కన్నుమూత". Archived from the original on 30 జూలై 2016. Retrieved 28 July 2016.

యితర లింకులు

[మార్చు]