Jump to content

నట్వర్ ఠక్కర్

వికీపీడియా నుండి
నట్వర్ ఠక్కర్
జననం1932
దహను, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా.[1]
మరణం2018 అక్టోబరు 7(2018-10-07) (వయసు: 85–86)
గౌహతి, అస్సాం
జాతీయతభారతీయుడు
వృత్తిసామాజిక కార్యకర్త
Organizationనాగాలాండ్ గాంధీ ఆశ్రమం
పేరుపడ్డదినాగాలాండ్ గాంధీ
పురస్కారాలు
  • పద్మశ్రీ (1999)[1]
  • ఇందిరా గాంధీ జాతీయ పురస్కారం (1994)
  • జమ్నాలాల్ బజాజ్ పురస్కారం (1987)[2]
  • కర్మయోగి పురస్కారం (2015)[3][4]

నట్వర్ ఠక్కర్ (1932 - 2018 అక్టోబరు 7) నాగాలాండ్ కు చెందిన సామాజిక కార్యకర్త. ఈయనను నాగాలాండ్ గాంధీ గా పిలుస్తారు. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1932 లో బ్రిటిషు భారతదేశంలో, బొంబాయి ప్రెసిడెన్సీ లోని దహను (ప్రస్తుతం మహారాష్ట్ర) ప్రాంతంలో గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. గాంధేయ సామాజిక సంస్కర్త కాకా కలేల్కర్ ప్రేరణతో ఈయన 1955 లో తన 23 వ ఏట ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ కు వలస వెళ్లాడు. ప్రజలలో "స్వచ్ఛంద సామాజిక సేవ ద్వారా సద్భావన, భావోద్వేగ సమైక్యతను పెంపొందించాలని కోరికతో, మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి నాగాలాండ్ లోని చుచుయిమ్‌లాంగ్‌ అనే గ్రామంలో ‘నాగాలాండ్‌ గాంధీ ఆశ్రమం’ను స్థాపించాడు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈయన ఆశ్రమం స్థాపించిన సమయంలో, నాగా తిరుగుబాటుదారులకూ, భారత సైన్యానికీ ఘర్షణలు జరుగుతూండేవి. ఈయన తన ఆశ్రమంలో తేనెటీగల పెంపకం, బెల్లం ఉత్పత్తి, చమురు బట్టీలు, బయోగ్యాస్ ప్లాంట్, యాంత్రిక వడ్రంగి వర్క్‌షాప్, ఖాదీ అమ్మకపు దుకాణాలతో సహా వివిధ అభివృద్ధి, ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలలో స్థానికులకు ఆశ్రయం కల్పించాడు. ఇవేకాక బడి మానేసిన పిల్లలు, శారీరకంగా వికలాంగుల కోసం ఒక వృత్తి శిక్షణా కేంద్రాన్ని తన ఆశ్రమంలో ప్రారంభించాడు. ఈయన నాగాలాండ్‌లో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపొమ్మని తిరుగుబాటుదారులు అనేకసార్లు హెచ్చరించారు. కానీ ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈయనను గ్రామంలో ఉండమనీ, తన పనిని కొనసాగించమనీ ప్రోత్సహించి, అతని కార్యక్రమాలకు మద్దతుగా నిధులు కూడా కేటాయించాడు. ఈయన కొన్నిసార్లు సైన్యానికీ, గ్రామస్థులకూ మధ్యవర్తిగా చర్చలు జరిపి బంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించాడు. ఈయన ప్రయత్నాల కారణంగా 2006 లో చుచుయిమ్లాంగ్ గ్రామంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈయన సేవలకు మెచ్చిన గ్రామస్తులు "మహాత్మా గాంధీ సెంటర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంజిసిఎస్డబ్ల్యు)" నిర్మాణం కోసం "నాగాలాండ్ గాంధీ ఆశ్రమానికి" 232 ఎకరాల (94 హెక్టార్లు) భూమిని విరాళంగా ఇచ్చారు.[5][6]

పురస్కారాలు

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈయన 1956 లో నాగా క్రైస్తవ మహిళ లెంటినా ఆవోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

మరణం

[మార్చు]

ఈయన 2018 అక్టోబరు 7 న అస్సాంలోని హౌహతిలో ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Gandhian Natwar Thakkar lauds Indian civil society groups : Nagaland Post". nagalandpost.com. the original నుండి 5 మార్చి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 September 2015.
  2. "Shri Natwar Thakkar | Constructive Work | Jamnalal Bajaj Foundation Awards 1987". Jamnalalbajajfoundation.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2019.
  3. "Amit Shah to present award to Gandhian Natwar Thakkar on September 13 – timesofindia-economictimes". articles.economictimes.indiatimes.com. the original నుండి 2015-10-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2019.
  4. "Five things to watch out for this weekend | Business Line". thehindubusinessline.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 December 2019.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Telegraph India" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Saini, Ajay (December 2018). "Natwar Thakkar (1932–2018): Gandhi's Peace Emissary in Nagaland". Economic and Political Weekly. the original నుండి 2019-04-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-12-19.