మొఘల్ ఎ ఆజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mughal-e-Azam
దర్శకత్వంకే. ఆసిఫ్
రచనఅమాన్
కమాల్ అమ్రోహీ
నిర్మాతకే ఆసిఫ్
తారాగణందిలీప్ కుమార్,
మధుబాల,
పృథ్వీరాజ్ కపూర్
అజిత్ ఖాన్
దుర్గా ఖోటే
నిగార్ సుల్తానా
ఛాయాగ్రహణంఆర్.డి. మాథుర్
కూర్పుధరమ్‌వీర్
సంగీతంనౌషాద్
విడుదల తేదీ
1960
సినిమా నిడివి
173 ని.
భాషఉర్దూ

మొఘల్ ఎ ఆజం (ఆంగ్లం : Mughal-e-Azam) (హిందీ భాష: मुग़ल-ए आज़म, ఉర్దూ భాష: مغلِ اعظم) ఒక భారతీయ సినిమా. దీని నిర్మాత నిర్దేశకుడు కే. ఆసిఫ్. ఈ ఉర్దూభాషా చిత్రం 1960 లో నిర్మింపబడినది. ఈ చిత్రనిర్మాణానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది.ఈ చిత్రం 1960లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది

సినిమాలో ఒక పాట, చివరి దృశ్యం మాత్రము ఈస్టుమన్ కలర్‌లో చిత్రీకరించారు. 2004లో దీనిని పూర్తి రంగుల చిత్రంగా తిరిగి విడుదల చేశారు.

సినిమా కథ

[మార్చు]

మొఘల్ సుల్తాన్ అక్బర్ (పృథ్వీరాజ్ కపూర్), తనయుడు సలీం (దిలీప్ కుమార్), 'అనార్కలీ' (మధుబాల) ల మధ్యన ఈ చిత్రకథ నడుస్తుంది. చారిత్రక చిత్రాన్ని ప్రేమకథా చిత్రంగా మలచి, తయారయ్యింది ఈ సినిమా. అనేక చారిత్రక విషయాలు సత్యదూరాలే. కానీ, ఈ చిత్రంలో వాడిన భాష 'సాహిత్య భాష', సంగీతం నౌషాద్ సమకూర్చగా, లతా మంగేష్కర్, షంషాద్ బేగం, ముహమ్మద్ రఫీ లు పాటలు పాడారు;

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]