Jump to content

షంషాద్ బేగం

వికీపీడియా నుండి
షంషాద్ బేగం
షంషాద్ బేగం
జననం(1919-04-14)1919 ఏప్రిల్ 14
లాహోర్, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుతం పంజాబ్, పాకిస్తాన్)
మరణం2013 ఏప్రిల్ 23(2013-04-23) (వయసు 94)
వృత్తినేపథ్య గాయని
క్రియాశీల సంవత్సరాలు1933–1976
జీవిత భాగస్వామి
గణపత్ లాల్ బట్టో
(m. 1934; మరణించాడు 1955)
పురస్కారాలుఓపీ నయ్యర్ అవార్డు (2009)[1]
పద్మభూషణ్ పురస్కారం (2009)[2]

షంషాద్‌ బేగం (హిందీ: शमशाद बेगम; 1919 ఏప్రిల్ 14 - 2013 ఏప్రిల్ 23) హిందీ చిత్ర పరిశ్రమలో మొదటి తరం నేపథ్య గాయకులలో ఒకరైన భారతీయ గాయని.[3][4] ఆమె విలక్షణమైన గాత్రం, శ్రేణికి ప్రసిద్ధి చెందింది. ఆమె హిందుస్తానీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, పంజాబీ భాషలలో 6,000లకు పైగా పాటలు పాడారు. వాటిలో 1287 హిందీ సినిమా పాటలు ఉన్నాయి.[5] ఆమె నౌషాద్ అలీ, ఓపీ న‌య్య‌ర్ వంటి ప్రసిద్ధ స్వరకర్తలతో కలిసి పనిచేసింది. వారు మెచ్చిన గాయకులలో ఒకరిగా మారింది. 1940ల నుండి 1970ల ప్రారంభం వరకు ఆమె పాటలు అత్యంత జనాదరణ పొందాయి. ఇప్పటికీ ఆమె పాడిన పాటలు రీమిక్స్ కొనసాగడం విశేషం.[6]

2009లో భారత ప్రభుత్వం కళల రంగంలో పద్మభూషణ్‌తో సత్కరించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బ్రిటీష్ ఇండియాలోని లాహోర్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్) 1919 ఏప్రిల్ 14న మియాన్ హుస్సేన్ బక్ష్ మాన్, గులాం ఫాతిమా దంపతులకు షంషాద్ బేగం జన్మించింది.[7] వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఈ ఎనిమిది మంది పిల్లలలో ఆమె ఒకరు. సమీపంలోని అమృత్‌సర్‌లో మరుసటి రోజే జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగింది.[8]

1932లో షంషాద్ బేగం ఆమె కంటే చాలా సంవత్సరాలు పెద్దవాడైన న్యాయ విద్యార్థి గణపత్ లాల్ బట్టోతో పరిచయం ఏర్పడింది. 1934లో మతపరమైన విభేదాల కారణంగా వారి కుటుంబాల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ 15 ఏళ్ల షంషాద్ బేగం ఆయనను వివాహం చేసుకుంది. వారికి ఉష అనే కుమార్తె ఉంది. భారత సైన్యంలోని అధికారి లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ రాత్రాను ఉష వివాహమాడింది.

షంషాద్ బేగం అత్యుత్తమ గాయని అయినప్పటికీ ఆమె తన కెరీర్ కంటే సహజంగా తన కుటుంబానికి ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాకుండా ఆమె కెరీర్ పురోగతి వెనుక ప్రధాన సానుకూల శక్తిగా తన భర్త ఉండేవాడు. కానీ 1955లో గణపత్ లాల్ బట్టో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ దుర్ఘటన ఆమెని చాలా కృంగదీసింది. ఆమె కెరీర్‌ను కొనసాగించడానికి పోరాట స్ఫూర్తిని కోల్పోయింది, తద్వారా అది తీవ్ర క్షీణతను నమోదు చేసింది.

మీడియాలో వివాదం

[మార్చు]

ఆమె భర్త మరణం తరువాత తన కుమార్తె కుటుంబంతో సహా కలిసి ముంబైకి నివాసం మార్చింది.[9] ఆమె క్రమక్రమంగా ఏకాంతంగా మారి తన మనవళ్లకే పూర్తిగా అంకితమైపోయింది.[10] దీంతో ఆమె బతికే ఉందా లేదా చనిపోయిందా అనే విషయం సాధారణ ప్రజలకు తెలియకుండాపోయింది. కానీ వివిధ భారతి, ఇండియా రేడియో ద్వారా ప్రతీరోజు ఆమె పాటలు మారుమోగుతూనే ఉండేవి.

ఆమె పాడిన పాటలు ప్రజలలో అంత ఆదరణ పొందుతున్నా దశాబ్దాలపాటు ప్రజల దృష్టికి దూరంగా ఉండడంతో 2004లో ఆమె కొన్ని సంవత్సరాల క్రితం మరణించారని అనేక ప్రచురణలు తప్పుగా నివేదించడంతో మీడియాలో వివాదం చెలరేగింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన షంషాద్ బేగం కుటుంబం ఒక పత్రికా ప్రకటనలో ఆమె ఏకాంత జీవితం గడుపుతోందని స్పష్టం చేసింది.[9]

ఈ వివాదానికి అసలు కారణం దిలీప్ కుమార్ భార్య అయిన సైరాబాను వాళ్ళ అమ్మమ్మ షంషాద్ బేగం 1998లో మరణించడంగా తేలింది.

మూలాలు

[మార్చు]
  1. "O P Nayyar award for Shamshad Begum". The Times of India. Archived from the original on 24 September 2013. Retrieved 25 January 2009.
  2. "Yesteryears' playback singer Shamshad Begum named for Padma Bhushan". Twocircles.net. 25 January 2009. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
  3. "Shamshad Begum, The Legendary Singer". India Post. August 1998. Archived from the original on 17 May 2013. Retrieved 30 March 2008.
  4. "Shamshad Begum dies at 94". The Times of India. Archived from the original on 26 April 2013. Retrieved 24 April 2013.
  5. "India singing legend Shamshad Begum dies". 24 April 2013. Archived from the original on 25 November 2018. Retrieved 6 November 2018.
  6. "Who was Shamshad Begum?". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.
  7. "Shamshad Begum was born in Lahore, not Amritsar: Daughter". The Express Tribune. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
  8. "Shamshad Begum was born in Lahore, not Amritsar: Daughter (Interview)". Newstrackindia.com. 2013-05-03. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
  9. 9.0 9.1 "Newsmakers – Shamshad Begum". milligazette.com. 15 November 2004. Archived from the original on 18 March 2009. Retrieved 22 October 2008.
  10. "Shamshad Begum Profile – Interview". planetpowai.com. Archived from the original on 6 January 2009.