వివిధ భారతి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వివిధ భారతి Vividh Bharati ఆకాశవాణి (All India Radio) యొక్క విశిష్ట సేవ.[1] ఇది 1957 అక్టోబరు 3 తేదీన రేడియో సిలోన్ (Radio Ceylon) పోటీని తట్టుకోవడం కోసం ప్రారంభించబడింది. అనతికాలంలోనే ఈ రేడియో కార్యక్రమాలు విస్తృత ఆదరణ పొందినవి. ఇవి ప్రస్తుతం రోజుకు సుమారు 15 నుండి 17 గంటల పాటు కార్యక్రమాల్ని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఇవి సినీ సంగీతం, రేడియో నాటికలు మరియు ఇతర కార్యక్రమాల ద్వారా వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి.

వివిధ భారతి కార్యక్రమాలు బొంబాయి కేంద్రంలో నిర్వహిస్తారు. భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలోని 40 పైగా స్టేషన్ల నుండి ఈ కార్యక్రమాల్ని 97 శాతం దేశ ప్రజలకు అందిస్తున్నారు.

వివిధ భారతి కార్యక్రమాలలో లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్ వంటి ఎందరో ప్రముఖులు పాల్గొని ప్రేక్షకుల్ని ఆనందపరిచారు.

వివిధ భారతి 2007 అక్టోబరు 3 తేదీన స్వర్ణోత్సవాలు జరుపుకున్నది.[2]

కార్యక్రమాలు[మార్చు]

తెలుగు భాష[మార్చు]

 • ఏక చిత్ర గీతాలు - ఒక తెలుగు సినిమా నుండి 4-5 పాటలు
 • జనరంజని - శ్రోతలు కోరిక తెలుగు సినిమా పాటల కార్యక్రమం
 • హరివిల్లు - ఒక విషయం గురించిన విశ్లేషాత్మక సినీ పాటల కార్యక్రమం.
 • హలో ఎఫ్.ఎమ్. - లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం.

హిందీ భాష[మార్చు]

 • ఇన్సే మిలియే
 • ఛాయా గీత్
 • జైమాల
 • భూలే బిస్రే గీత్
 • సంగీత్ సరిత
 • హవా మహల్
 • సఖీ సహేలీ

వివిధ భారతి సేవా సమయాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]