దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (ఆంగ్లం: Dadasaheb Phalke Award) భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మశతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు.
చరిత్ర[మార్చు]
భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వరంలో జన్మించాడు. బొంబాయి లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్‌లలో అతను విద్యాభ్యాసం చేశాడు.
1896లో అతను బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా అతను సినీపరిశ్రమకు తిరిగి ఖర్చుచేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను అతను పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషిచేశాడు.
భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.
నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, నేపథ గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు చలనచిత్రాభివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే. కానీ అంతటి విశిష్ట సేవ చేసిన వారు చాలా అరుదుగానే ఉంటారు. అందుకే చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పొందే బిరుదు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.
అవార్డు వివరాలు[మార్చు]
మొట్టమొదటి సారిగా 1969 లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన “మల్లీశ్వరి”, “బంగారు పాప” లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. నిజానికి బియన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇద్దరు తెలుగు బియన్ లు ఈ అవార్డ్ అందుకోగా మరో బియన్ అయిన బి యన్ సర్కార్, బియన్ అనదగిన నితిన్ బోస్ కూడా ఈ పురస్కారం అందుకొన్నారు. బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే.
ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలు[మార్చు]
- 1969 - దేవికా రాణి, నటి
- 1970 - బి.ఎన్.సర్కార్, నిర్మాత
- 1971 - పృథ్వీరాజ్ కపూర్, నటుడు
- 1972 - పంకజ్ మల్లిక్, సంగీత దర్శకుడు
- 1973 - సులోచన
- 1974 - బి.ఎన్.రెడ్డి, దర్శకనిర్మాత
- 1975 - ధీరేన్ గంగూలీ, నటుడు
- 1976 - కానన్ దేవి, నటి
- 1977 - నితిన్ బోస్, దర్శకుడు
- 1978 - ఆర్.సి.బోరల్, స్క్రీన్ ప్లే
- 1979 - సోహ్రాబ్ మోడి, దర్శకనిర్మాత
- 1980 - పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు
- 1981 - నౌషాద్, సంగీత దర్శకుడు
- 1982 - ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 1983 - దుర్గా ఖోటే, నటి
- 1984 - సత్యజిత్ రే, దర్శకుడు
- 1985 - వి.శాంతారాం, దర్శకుడు, నిర్మాత, నటుడు
- 1986 - బి.నాగిరెడ్డి, నిర్మాత
- 1987 - రాజ్ కపూర్, నటుడు, దర్శకుడు
- 1988 - అశోక్ కుమార్, నటుడు
- 1989 - లతా మంగేష్కర్, గాయని
- 1990 - ఎ.నాగేశ్వర రావు, నటుడు
- 1991 - భాల్జీ ఫెండార్కర్, గాయకుడు, సంగీత దర్శకుడు
- 1992 - భూపేన్ హజారికా, గాయకుడు, సంగీత దర్శకుడు
- 1993 - మజ్రూహ్ సుల్తాన్‌పురి, పాటల రచయిత
- 1994 - దిలీప్ కుమార్, నటుడు, గాయకుడు
- 1995 - రాజ్ కుమార్, నటుడు, గాయకుడు
- 1996 - శివాజీ గణేశన్, నటుడు
- 1997 - ప్రదీప్, పాటల రచయిత
- 1998 - బి.ఆర్.చోప్రా, దర్శకుడు, నిర్మాత
- 1999 - హృషీకేష్ ముఖర్జీ, దర్శకుడు
- 2000 - ఆషా భోంస్లే, గాయని
- 2001 - యష్ చోప్రా, దర్శకుడు, నిర్మాత
- 2002 - దేవానంద్, నటుడు, దర్శకుడు, నిర్మాత
- 2003 - మృణాల్ సేన్, దర్శకుడు
- 2004 - అదూర్ గోపాలక్రిష్ణన్, దర్శకుడు
- 2005 - శ్యాం బెనగళ్, దర్శకుడు
- 2006 - తపన్ సిన్హా, దర్శకుడు
- 2007 - మన్నా డే, గాయకుడు
- 2008 - వి.కె.మూర్తి, ఛాయాగ్రాహకుడు
- 2009 - డి.రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు,
- 2010 - కైలాసం బాలచందర్, దర్శకుడు
- 2011 - సౌమిత్ర చటర్జీ, నటుడు
- 2012 - ప్రాణ్, నటుడు
- 2013 - గుల్జార్, నటుడు
- 2014 - శశికపూర్, నటుడు
- 2015 - మనోజ్ కుమార్, నటుడు, దర్శకుడు, నిర్మాత
- 2016 - కె.విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత[1]
- 2017 - వినోద్ ఖన్నా
- 2018 - అమితాబ్ బచ్చన్
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి. "కళాతపస్వికి దాదాసాహెబ్ అవార్డు". Retrieved 24 April 2017.