సుకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుకుమార్
Sukku-one.jpg
జననం
బండ్రెడ్డి సుకుమార్

జనవరి 11
మట్టపాడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్[1]
ఇతర పేర్లుసుక్కు
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000–ఇప్పటివరకు
జీవిత భాగస్వామిత‌బిత‌ [2]
పిల్లలుసుకృతివేణి, సుక్రాంత్
తల్లిదండ్రులుతిరుపతి రావు నాయుడు, వీరవేణి

సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడు. 2004లో ఇతని మొదటి చిత్రం అల్లు అర్జున్ తోఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ నడవలేదు. నాల్గవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్య సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి.2014 లో మహేష్ బాబు తో 1 - నేనొక్కడినే చిత్రాన్ని తీశారు. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు.

జీవితం[మార్చు]

సుకుమార్ తూర్పు గోదావరి జిల్లా,అడ్డతీగల మండలంలోని మట్టపాడులో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంమీద ఆసక్తి ఉండేది. గ్రామంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చాలావరకు చదివాడు. పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కవితలు రాసేవాడు.

కళాశాలలో గణితం బోధించే అధ్యాపకులు లేకపోవడాంతో సుమారు పది మైళ్ళ దూరం వెళ్ళి వేరే అధ్యాపకుడి దగ్గర నేర్చుకున్నాడు. అలా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యే సరికి లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తర్వాత తనే జూనియర్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఒక వైపు చదువుకుంటూ రాజోలులో ట్యూషన్లు చెప్పేవాడు. తర్వాత 1998లో కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. నెలజీతం 75 వేల రూపాయల పైమాటే.[3] ఈ ఉద్యోగంలో బాగా నిలదొక్కుకున్నా మనసు మాత్రం సినిమాలవైపు లాగుతుండేది.

సినీ రంగం[మార్చు]

సినీ రంగంపై ఉన్న ఆసక్తితో 2000 లో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశాడు. 2004లో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా మంచి విజయవంతం అయ్యింది. రెండవ చిత్రం హీరో రామ్ పోతినేని తోజగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్ నడవలేదు. నాల్గవ చిత్రం 100% లవ్ అక్కినేని నాగ చైతన్య సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది. అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి.2014 లో మహేష్ బాబు తో 1 - నేనొక్కడినే చిత్రాన్ని తీశారు. అది కూడా సరిగా ఆడలేదు. 2016 లో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. 2018 లో రాం చరణ్ తేజ తో రంగస్థలం సినిమా తో తన కెరీర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు.

సినీ చరిత్ర[మార్చు]

  1. ఆర్య - (అల్లు అర్జున్)
  2. జగడం- (రామ్)
  3. ఆర్య 2- (అల్లు అర్జున్)
  4. 100% లవ్- (నాగ చైతన్య)
  5. 1 - నేనొక్కడినే- (మహేష్ బాబు)
  6. నాన్నకు ప్రేమతో - (ఎన్.టి.ఆర్)
  7. రంగస్థలం ౼ రామ్ చరణ్ తేజ్

మూలాలు[మార్చు]

  1. "నవలలు రాయాలని ఉంది". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. April 2018.
  2. NTV (1 June 2021). "సుకుమార్ భార్యకు 'సుకుమార్ రైటింగ్స్' బాధ్యతలు". NTV. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  3. "రూ.75 వేల సంపాదన వదిలి రూ.500లకు పనిచేసి..! - director buchibabu revealed unbelievable fact about sukumar". www.eenadu.net. Retrieved 2021-02-10.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సుకుమార్&oldid=3272785" నుండి వెలికితీశారు