అక్కినేని నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య | |
---|---|
జననం | అక్కినేని నాగ చైతన్య 1986 నవంబరు 23 హైదరాబాద్ , తెలంగాణ , భారతదేశం |
ఇతర పేర్లు | చై |
విద్యాసంస్థ | సెయింట్ మేరీస్ కాలేజ్, హైదరాబాద్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
కుటుంబం | అక్కినేని-దగ్గుబాటి కుటుంబం |
నాగ చైతన్య (జననం: 1986 నవంబరు 23) నటుడు అక్కినేని నాగార్జున, లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)ల తనయుడు. ఇతడు జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించాడు. కానీ ఆ చిత్రం ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఏ మాయ చేసావే ద్వారా మంచి విజయాన్ని నమోదు చేశాడు.
సినీ జీవితం
[మార్చు]నాగ చైతన్య నటించిన మొదటి సినిమా దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్. ఈ సినిమా ద్వారా నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ మరియ, నంది అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క తెలుగు పునః నిర్మాణం ఐన ఏ మాయ చేశావే చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
ఆ తర్వాత 2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం దడ, వివేక్ కృష్ణ దర్శకత్వంలో అమలాపాల్ కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి. నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో సునీల్, తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది. ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2015లో సుధీర్ వర్మ దర్శకత్వంలో 'దోచేయ్' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2016లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసమే శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017లో రారండోయ్ వేడుక చూద్దాం మళ్ళీ ఘన విజయం సాధించింది. 2018లో విడుదల అయిన శైలజారెడ్డి అల్లుడు విజయం సాధించింది. 2018లో విడుదల అయిన సవ్యసాచి సినిమా ప్లాప్ అయింది. 2019లో సమంత అక్కినేని తో నటించిన మజిలీ చిత్రంతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2019 డిసెంబరు లో తన మామయ్య అయిన దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామా సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]హైదరాబాదు లో జన్మించిన నాగ చైతన్య తన తల్లిదండ్రులు విడిపోయాక చెన్నైలో ఉంటున్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. పీ.ఎస్.బీ.బీ. పాఠశాలలో చదువుకున్నాడు. తన పాఠశాల బ్యాండ్ లో అప్పుడప్పుడూ గిటార్ వాయించేవాడు. ముంబైలో, కాలిఫోర్నియాలోని స్టూడియోలో నటనలో శిక్షణ పొందాడు. నేటికి కూడా చైతన్య తనకు కార్లమీద ఉన్న అభిమానంతో కార్ రేసుల్లో పాల్గొంటుంటాడు. 100% లవ్ సినిమా విడుదలైన కొత్తల్లో తనకీ, నటి అనుష్కకి నిశ్చితార్థం జరిగిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే అవన్నీ వదంతులని నాగార్జున, చైతన్య, అనుష్కలు తేల్చి చెప్పారు.
వివాహం
[మార్చు]నాగ చైతన్య తనతోపాటు 'ఏం మాయ చేసావే', 'మనం' వంటి చిత్రాల్లో కలిసి నటించిన సమంతను 2017, 6 అక్టోబర్ న వివాహం చేసుకున్నాడు. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీగియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.[1]
నాగ చైతన్య 8 ఆగస్టు 2024న నటి శోభితా ధూళిపాళను హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకొని 4 డిసెంబర్ 2024న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు.[2][3][4]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | గమనికలు |
---|---|---|---|---|
2009 | జోష్ | సత్య | తెలుగు | విజేత, ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నూతన నటుడు నంది అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు. |
2010 | విణ్ణైతాండి వరువాయా | కార్తీక్ తొలి చిత్రం జెస్సిలో కథానాయకుడిగా | తమిళం | అతిథి పాత్ర |
ఏ మాయ చేసావే | కార్తీక్ | తెలుగు | పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు | |
2011 | 100% లవ్ | బాలు | తెలుగు | |
దడ | విశ్వ | తెలుగు | ||
బెజవాడ | శివ కృష్ణ | తెలుగు | ||
2013 | ఆటోనగర్ సూర్య | సూర్య | తెలుగు | |
తడాఖా | కార్తీక్ | తెలుగు | తమిళ చిత్రం వేట్టైకి పునఃనిర్మాణం | |
మనం | నాగార్జున | తెలుగు | ||
2014 | ఒక లైలా కోసం | కార్తీక్ | తెలుగు | |
2015 | దోచేయ్ | చందు | తెలుగు | |
2015 | కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని | అతనిగానే | తెలుగు | అతితి పాత్రలో |
2015 | అటాడుకుందంరా | అతనిగానే | తెలుగు | అతితి పాత్రలో |
2016 | ప్రేమమ్ | విక్రం | తెలుగు | |
2016 | సాహసం శ్వాసగా సాగిపో | డి.సి.పి. రజినికాంత్ మురళిధర్ | తెలుగు | |
2017 | రారండోయ్ వేడుక చూద్దాం | శివ | తెలుగు | |
2017 | యుద్ధం శరణం | అర్జున్ | తెలుగు | |
2018 | సవ్యసాచి | తెలుగు | ||
2018 | శైలజారెడ్డి అల్లుడు | తెలుగు | ||
2019 | వెంకీ మామ | కెప్టెన్ కార్తీక్ శివరాం వీరమాచినేని/కార్తీక్ | తెలుగు | |
2020 | లవ్ స్టోరీ | రేవంత్ | తెలుగు | |
2022 | బంగార్రాజు | చిన్న బంగార్రాజు | [5] | |
థ్యాంక్యూ | అభి | [6] | ||
లాల్ సింగ్ చద్దా | బుబ్లు | హిందీ | [7] | |
2023 | కస్టడీ | ఏ. శివ | తమిళ్ తెలుగు |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2023 | దూత | సాగర్ | [8] |
వంశవృక్షం
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ "సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: గర్భంతో ఉన్న ఒక మహిళ ఫొటోతో సమంత ఇన్‌స్టా స్టోరీ." BBC News తెలుగు. Retrieved 2021-10-02.
- ↑ Eenadu (4 December 2024). "వైభవంగా నాగచైతన్య - శోభిత వివాహం.. ప్రముఖుల సందడి". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ Eenadu (17 December 2024). "చైతూతో ప్రేమ ప్రయాణం అలా మొదలైంది: శోభిత". Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ Palisetty, Ramya (20 August 2021). "Nagarjuna and Naga Chaitanya begin Bangarraju shoot. See pics from puja ceremony". India Today.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Naga Chaitanya's role in his much-awaited film Thank You Revealed; deets inside". Pinkvilla. 14 March 2022. Archived from the original on 11 జూన్ 2022. Retrieved 20 జూలై 2022.
- ↑ "Aamir Khan's Laal Singh Chaddha release date pushed to THIS date in 2022; Official announcement inside". Pinkvilla. 26 September 2021. Archived from the original on 26 సెప్టెంబరు 2021. Retrieved 26 September 2021.
- ↑ Eenadu (27 November 2023). "'దూత'లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
- CS1 Indian English-language sources (en-in)
- CS1 maint: url-status
- అక్కినేని కుటుంబం
- దగ్గుబాటి రామానాయుడు వంశవృక్షం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- తెలుగు సినిమా నటులు
- 1986 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు కళాకారులు
- సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు