బంగార్రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగార్రాజు
దర్శకత్వంకళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంఅక్కినేని నాగార్జున,
రమ్యకృష్ణ,
నాగచైతన్య,
కృతి శెట్టి
ఛాయాగ్రహణంపి.ఎస్.వినోద్,
ఆర్.సిద్ధార్థ
కూర్పువిజయ్‌ వర్థన్‌
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ
జనవరి 14, 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

బంగార్రాజు 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న విడుదలైంది.[1]బంగార్రాజు జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

బంగార్రాజు సినిమా హైదరాబాద్‏లోని అన్నపూర్ణ స్టూడియోలో 2021ఆగస్టు 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[3][4][5]

'సోగ్గాడే చిన్ని నాయనా' కథ ఎక్కడ ముగిసిందో అక్కడ ఈ సినిమా మొదలు అవుతుంది. చిన బంగార్రాజు (నాగ చైతన్య)కి వరసకు మరదలు అయ్యే నాగలక్ష్మి (కృతి శెట్టి)తో పెళ్లి చేయాలని సత్యభామ (రమ్యకృష్ణ) అనుకుంటుంది. నాగలక్ష్మి తండ్రి రమేష్ (రావు రమేష్)తో కూడా మాట్లాడుతుంది. అతడూ సరే అంటాడు. అయితే చిన్నప్పటి నుంచి చిన్న బంగార్రాజు, నాగలక్ష్మి ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. చిన్ననాటి నుండే నాన్న‌మ్మ ద‌గ్గ‌రే పెరిగిన చిన బంగార్రాజు సైతం తాత బంగార్రాజు (నాగార్జున) పోలిక‌ల‌తో ఊరిలో అమ్మాయిలతో సంద‌డి చేస్తున్న క్రమంలో సత్యభామ హఠాన్మరణం చెంది స్వర్గంలో ఉన్న భర్త బంగార్రాజు చెంతకు చేరుకుంటుంది.

శివపురం శివాలయంలో ఉన్న గుప్తనిధిపై దుష్టశక్తుల కన్నుపడుతుంది. ఆ దేవాలయాన్ని బంగార్రాజు కుటుంబం తరాలుగా రక్షిస్తుంటుంది. చిన్న బంగార్రాజు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని సంపత్‌ (సంపత్‌రాజ్‌) కుట్ర పన్నుతాడు. ఈ నేపథ్యంలో స్వర్గంలో ఉన్న బంగార్రాజు, సత్యభామ మనవడిని రక్షించడానికి పూనుకుంటారు. దాంతో బంగార్రాజు, సత్యభామల ఆత్మను యమధర్మరాజు, ఇంద్రుడు కలిసి భూలోకానికి పంపుతాడు. చిన్న బంగార్రాజు, నాగలక్ష్మిని కలపడం కోసం పెద్ద బంగార్రాజు ఏం చేశాడు? భూలోకం వచ్చిన తర్వాత మనవడికి ఎదురైన ఆపదను ఎలా తప్పించాడు? గుడి నిధులను ఎలా కాపాడాడు అనేది మిగతా సినిమా కథ.[6][7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • నువ్వు సిగ్గుపడితే , చిత్ర, సాయి చరణ్ , రమ్య బెహరా, రచన: కాసర్ల శ్యామ్
  • నా కోసం , సిద్దు శ్రీరామ్ , రచన: బాలాజీ
  • ఎంత సక్కగుందిరో , సాయి మాధవ్ , మోహన భోగరాజు ,మేఘన మిశ్రా, కావ్య అపర్ణ , రచన : బాలాజీ .
  • బంగార బంగరా , మధు ప్రియ, రచన : భాస్కర భట్ల రవికుమార్.
  • వాసి వాడి తస్సాదీయ్య , మోహన భోగరాజు , సాహితీ, హర్ష వర్ధన్ , రచన : కళ్యాణ కృష్ణ.
  • లడ్డు వుండ , నాగార్జున , ధనుంజయ్ , అనూప్ రూబెన్స్, నూతన మోహన్ , మోహన భోగరాజు , హరిప్రియ , రచన : భాస్కర భట్ల రవికుమార్.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 January 2022). "బంగార్రాజు మూవీ రివ్యూ". Archived from the original on 14 January 2022. Retrieved 14 January 2022.
  2. TV9 Telugu (18 February 2022). "ఓటీటీలోకి వచ్చేసిన బంగార్రాజు.. ఏందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే." Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andrajyothy (20 August 2021). "'బంగార్రాజు' ప్రారంభం". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  4. Namasthe Telangana (20 August 2021). "Bangarraju: పూజా కార్య‌క్ర‌మాల‌తో మొదలైన బంగార్రాజు". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
  5. 10TV (20 August 2021). "Bangarraju : 'బంగార్రాజు' స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు.. | Bangarraju" (in telugu). Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. Eenadu (15 January 2022). "రివ్యూ: బంగార్రాజు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  7. 10TV (14 January 2022). "రివ్యూ బంగార్రాజు" (in telugu). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  8. Sakshi (9 January 2022). "బంగార్రాజు: ఏకంగా 8మంది హీరోయిన్లు!.. గ్లామర్‌తో మెస్మరైజ్‌". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  9. Deccan Chronicle, Sashidhar (21 August 2021). "Kalyan Krishna excited to work for Bangarraju" (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2021. Retrieved 21 August 2021.